డెలివరీ అయిన 2 నెలలకే నటి ఆత్మహత్యాయత్నం.. భర్తకు విడాకులు | Tamil Actress Krithika Annamalai Reveals About Divorce | Sakshi
Sakshi News home page

Actress: భర్తతో గొడవలు.. చచ్చిపోదామనుకున్నా, నేను పని చేస్తే తను ఖాళీగా..

Published Wed, Jan 3 2024 3:16 PM | Last Updated on Wed, Jan 3 2024 3:48 PM

Tamil Actress Krithika Annamalai Reveals About Divorce - Sakshi

జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డానంటోంది తమిళ బుల్లితెర నటి కృతిక అన్నమలై. ఒకానొక సమయంలో భర్త పెట్టే టార్చర్‌ భరించలేక ఆత్మహత్యకు యత్నించానంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నా వైవాహిక జీవితంలో చాలా సమస్యలున్నాయి. అసలు నా పెళ్లి జీవితమే పెద్ద సమస్య. నా మెడలో తాళి పడ్డ పది నెలలకు కొడుకు పుట్టాడు. ఆ సమయంలో నా చేతిలో మూడు సీరియల్స్‌ ఉన్నాయి. వాడిని చూసుకోవడం కోసం సీరియల్స్‌ మానేసి ఇంటిపట్టునే ఉన్నాను.

ఇంటి దగ్గరే ఖాళీగా..
అప్పటినుంచే నాకు, నా భర్తకు మధ్య గొడవలు మొదలయ్యాయి. తర్వాత అతడు వ్యాపారంలో నష్టపోవడంతో నేను తిరిగి సీరియల్స్‌ చేయడం ప్రారంభించాను. తను మాత్రం బాధ్యత లేకుండా ఇంటి దగ్గరే ఖాళీగా కూర్చున్నాడు. దీనివల్ల మా మధ్య గొడవలు మరింత ముదిరాయి. ఒకరోజు ఈ టార్చర్‌ భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించాను. పిల్లాడు పుట్టిన రెండు నెలలకే ఇది జరిగింది. చావు అంచుల దాకా వెళ్లి తిరిగొచ్చిన నేను మళ్లీ అతడితోనే సర్దుకుపోవాలనుకున్నాను.

భరించలేక విడాకులు..
నాలుగేళ్లు అతడితోనే కలిసున్నాను. ఆ తర్వాత మాత్రం తనను భరించే ఓపిక నశించి విడాకులు తీసుకున్నాను. చాలామందికి నేను విడాకులు తీసుకున్న విషయం కూడా తెలియదు. ఇప్పుడు విడిపోయానని చెప్పినందుకు చాలామంది చులకనగా కామెంట్లు చేస్తారు. కానీ మేము కూడా మనుషులమే.. మాకూ జీవితాలుంటాయి. నా భర్తతో ఎంతో పోరాడాను. అలిసిపోయాను. నాకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచన ఏమాత్రం లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా 'మెట్టి ఒలి' సీరియల్‌తో పాపులర్‌ అయింది కృతిక. విలనిజం పండించడంలో ఆమె దిట్ట. సీరియల్స్‌లో కనిపించే ఈ నటి 'మనద మయిలద' అనే డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లోనూ పాల్గొంది.

NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com

చదవండి: అమ్మ జీవితంలో చాలా మిస్సయింది.. రెండో పెళ్లి.. మేము ఏమంటామోనని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement