పసివాడి ప్రాణం సీరియల్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సుజిత తర్వాత సినిమాలు, సీరియల్స్‌లోనూ నటించి పెద్ద నటిగా ఎదిగింది. ఎంతో సాంప్రదాయంగా రెడీ అయ్యే సుజిత అన్నయ్య సూర్యకిరణ్ కూడా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ సత్తా చాటిన ఈయన బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో పాల్గొన్న వారం రోజులకే ఎలిమినేట్ అయ్యాడు. ఈయన నటి కల్యాణిని పెళ్లి చేసుకుని కొన్నేళ్లకే ఆమెకు విడాకులిచ్చాడు.
తాజాగా వీరి విడాకులకు గల కారణాన్ని సుజిత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. 'అన్నయ్యకు పెళ్లయిన మూడేళ్లకే నాకు వివాహం జరిగింది. నేను ఎక్కువగా షూటింగ్‌లోనే ఉండేదాన్ని. అప్పుడప్పుడు అన్నయ్యతో ఫోన్ మాట్లాడేదాన్ని. హైదరాబాద్‌కు షూటింగ్‌కు వచ్చినప్పుడు మాత్రం తనను నేరుగా కలిసేదాన్ని. వదిన (కల్యాణి) అప్పటికే తెలుగు ఇండస్ట్రీలో గొప్ప నటి. తనతో మాట్లాడటం, తనతో ఉండటం నాకు చాలా ఇష్టం. అక్కాచెల్లెళ్లు ఎలా ఉండేవారో మేమిద్దరం అలా ఉండేవాళ్లం.
అయితే ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువకాలం ఉండకూడదు. అటువంటి ఇబ్బందులు వస్తే దాన్ని బ్యాలెన్స్ చేసే సామర్థ్యం దంపతుల్లో ఒక్కరికైనా ఉండాలి. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. వాళ్లిద్దరూ అనవసరంగా పెద్ద పెద్ద విషయాల్లో కాలు పెట్టారు. అన్నయ్య నిర్మాతగా సినిమా తీశాడు. నాకు చెప్తే సరేనన్నాను. అన్నయ్యకు, నాకు 8 ఏళ్ల ఏజ్ గ్యాప్. ఆయనకు సలహా ఇచ్చేంత పెద్ద దాన్ని కాదు. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో తనే నాకు తండ్రి లాగా! తనంటే నాకు కొంత భయం కూడా!
చివరకు వారు తీసిన సినిమా డిజాస్టర్ అయింది, నష్టాలు వచ్చాయి. అదే వారి జీవితంలో వచ్చిన పెద్ద సమస్య! మాకీ విషయం తెలిసి సాయం చేద్దామనుకునేలోపు వారు మరీ దారుణ స్థితిలోకి వెళ్లిపోయారు. అన్నీ అప్పులు, ఉన్నదంతా అమ్మేశారు. కేరళలో మంచి ప్రాపర్టీ ఉండేది, దాన్ని కూడా అమ్మేశారు. సినిమా అనేది గ్యాంబ్లింగ్. ఇది అందరికీ కలిసి రాదు.. ఉన్న డబ్బంతా సినిమా కోసం పెట్టడం అనేది తెలివితక్కువ తనం. ఈ ఒక్క పని వాళ్ల జీవితాన్ని ముంచేసింది' అని చెప్పుకొచ్చింది సుజిత.
చదవండి: దేశంలోనే రిచ్ హీరో.. కారు, బంగ్లాలు అమ్మేసి చివరి రోజుల్లో మురికివాడలో
Comments
Please login to add a commentAdd a comment