Surya Kiran
-
డైరెక్టర్ సూర్యకిరణ్ మృతిపై సుజిత ఎమోషనల్
టాలీవుడ్ రచయిత, దర్శకుడు సూర్య కిరణ్ (48) మార్చి 11న కన్నుమూశారు. పచ్చ కామెర్ల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరిగిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల ఇండస్ట్రీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇప్పటికే సూర్యకిరణ్ గురించి ఆయన సన్నిహితులు పలు విషయాలను పంచుకుని బాధపడ్డారు కూడా. తాజాగా ఆయన సోదరి సుజిత రియాక్ట్ అయ్యారు. సూర్య కిరణ్‌కు సోదరి సుజిత అంటే చాలా ఇష్టం.. ఇదే విషయాన్ని ఆయన పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అదే విధంగా అన్నయ్య పట్ల సుజిత కూడా అమితమైన ప్రేమను చూపించేవారు. అలాంటిది నేడు సూర్యకిరణ్ లేడన్న నిజాన్ని తట్టుకోలేక ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. 'ఆయన నా అన్నయ్య మాత్రమే కాదు.. నా హీరో, నాకు తండ్రి కూడా.. ఇండస్ట్రీలో నీ టాలెంట్‌కు, నీ మాటలకు నేను ఎప్పుడూ అభిమానినే. మరో జన్మంటూ ఉంటే.. అప్పుడైనా నీ కలలన్నీ సాకారం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.' అంటూ సుజిత ఎమోషనల్ అయ్యారు. పసివాడి ప్రాణం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సుజిత తర్వాత సినిమాలు, సీరియల్స్‌లోనూ నటించి పెద్ద నటిగా ఎదిగారు. చిన్నప్పుడు వారు తండ్రిని కోల్పోవడంతో ఒక నాన్నలా తమ కుటుంబాన్ని సూర్యకిరణ్ పోషించారని గతంలో సుజిత చెప్పారు. ప్రస్తుతం ఆమె పలు సీరియల్స్‌లో నటిస్తూ హైదరాబాద్‌లోనే సెటిల్ అయ్యారు. తమ మధ్య 8 ఏళ్లు గ్యాప్ ఉండటంతో ఎంతో ప్రేమగా అన్నయ్య చూసుకునేవారని ఆమె పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Sujithar (@sujithadhanush) -
సూర్యకిరణ్ ఈ ఒక్క తప్పు చేయడం వల్లే మరణించారు: సీనియర్ నటి
టాలీవుడ్ రచయిత, దర్శకుడు సూర్య కిరణ్ (48) మార్చి 11న కన్నుమూశారు. పచ్చ కామెర్ల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఆయన మరణించారు. నేడు చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయిన సూర్యకిరణ్ మరణించడంతో ఆయన సన్నిహితులు షాక్‌కు గురయ్యారు. బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో కంటెస్టెంట్‌గా కొనసాగిన విషయం తెలిసిందే. అదే సీజన్లో కంటెస్టెంట్‌గా ఉన్న సీనియర్ నటి కరాటే కళ్యాణి ఆయన మృతి పట్ల పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హీరోయిన్ కళ్యాణిని ప్రేమ పెళ్లి చేసుకున్న సూర్యకిరణ్ పలు మనస్పర్దలు రావడంతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆయన చాలా వరకు కుంగిపోయాడని కరాటే కళ్యాణి తెలిపారు. 'భార్యతో విడిపోయిన తర్వాత ఇక తనకు జీవితంలో ఏమీ మిగలలేదని ఆయన అనుకునే వాడు.. ఈ క్రమంలో ఎక్కువగా మద్యానికి బానిస అయ్యాడు. దీంతో ఆయన లివర్ బాగా దెబ్బతింది. ఈ క్రమంలో ఆయనకు పచ్చ కామెర్లు రావడంతో దానిని ఆయన గుర్తించలేకపోయాడు. ఆపై ప్రతి రోజూ మద్యం సేవించడంతో ఆ సమస్య ఎక్కువ అయింది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినా ఉపయోగం లేకుండా పోయింది. సూర్య కిరణ్ నుంచి భార్య విడిపోయిన తర్వాత ఆమె మళ్లీ ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఆశించాడు. అది ఎప్పటికీ జరగదేమో అనే ఆలోచనలతో రాత్రంతా మద్యం,సిగరెట్స్ తాగుతూ గడిపేవాడు. జాండిస్ ఉన్న సమయంలో ఎక్కువగా మద్యం తీసుకోవడం వలనే సూర్యకిరణ్ మరణించారని కరాటే కళ్యాణి తెలిపారు. (మాజీ సతీమణి కళ్యాణితో సూర్యకిరణ్) టాలీవుడ్లో సత్యం, ధన 51, రాజుభాయ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన సూర్యకిరణ్ 'మాస్టర్ సురేష్' పేరుతో 200లకు పైగా చిత్రాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించాడు. సూర్యకిరణ్ టి.ఎస్.మణి, రాధాలకు చెన్నైలో జన్మించారు. వీరి స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. ఆయన సోదరి సుజిత కూడా బుల్లితెరతో పాటు పలు సినిమాల్లో నటిగా రాణిస్తున్నారు. -
టాలీవుడ్ డైరెక్టర్, నటుడు సూర్యకిరణ్ ఇకలేరు!
రచయిత, దర్శకుడు సూర్య కిరణ్ (51) కన్నుమూశారు. టాలీవుడ్లో సత్యం, ధన 51, రాజుభాయ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. పచ్చ కామెర్ల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించారని తెలుస్తోంది. 'మాస్టర్ సురేష్' పేరుతో 200లకు పైగా చిత్రాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించిన ఆయన బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో కంటెస్టెంట్‌గా కొనసాగిన విషయం తెలిసిందే. కానీ మొదటి వారంలోనే ఆయన ఎలిమినేట్ అయ్యాడు. ఆ సమయంలో హౌస్‌లో ఉన్న ఇతర కంటెస్టెంట్స్ ఎలాంటి వారో ఆయన చెప్పిన తీరు అందరినీ మెప్పించింది. ఆ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. (మాజీ సతీమణి కళ్యాణితో సూర్యకిరణ్) హీరోయిన్ కళ్యాణిని ప్రేమ పెళ్లి చేసుకున్న సూర్యకిరణ్ పలు మనస్పర్దలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. ఈ విషయంలో ఆయన పలు కాంట్రవర్శీలతో వార్తల్లో నిలిచాడు. బాలనటుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు అవార్డులను అందుకున్న సూర్య కిరణ్.. దర్శకుడిగా రెండు నంది పురస్కారాలను అందుకున్నాడు. సూర్యకిరణ్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.మంగళవారం ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి. అప్పులు జీవితాన్ని ముంచేశాయి: సుజిత కళ్యాణితో విడాకుల గురించి సూర్య కిరణ్ చెల్లెలు అయిన బుల్లితెర నటి సుజిత గతంలో కొన్ని విషయాలు పంచుకున్నారు. కళ్యాణితో వివాహం జరిగిన తర్వాత నిర్మాతగా సూర్యకిరణ్ ఒక సినిమాను నిర్మించినట్లు సుజిత తెలిపింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో భారీగా నష్టాలు వచ్చాయని ఆమె పేర్కొంది. అదే తన అన్నయ్య జీవితంలో వచ్చిన పెద్ద సమస్య అంటూ సుజిత తెలిపింది. తన అన్నయ్యకు సాయం చేద్దామనుకునేలోపు శక్తికి మించిన అప్పులు చుట్టిముట్టినట్లు ఆమె చెప్పింది. దీంతో సూర్యకిరణ్ కుటుంబం మరీ దారుణ స్థితిలోకి వెళ్లింది. అన్నీ అప్పులు, ఉన్నదంతా అమ్మేశారు. కేరళలో మంచి ప్రాపర్టీ ఉండేది, దాన్ని కూడా అమ్మేశారు. ఈ ఒక్క పని వళ్ల తన అన్నయ్య సూర్యకిరణ్ జీవితాన్ని ముంచేసిందని సుజిత తెలిపింది. Director #SuryaKiran has passed away due to jaundice. He directed telugu films, Satyam, Raju Bhai and a few others. He was also a former contestant on Biggboss Telugu. Om Shanti. pic.twitter.com/CrDctCs9UZ — Suresh PRO (@SureshPRO_) March 11, 2024 -
ఎలాంటి తవ్వకాలూ చేపట్టడం లేదు
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, కైలాసగిరి కొండ దిగువన తవ్వకాలపై యథాతథస్థితి(స్టేటస్ కో) కొనసాగించాలని హైకోర్టు బుధవారం విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) కమిషనర్‌ను ఆదేశించింది. తవ్వకాలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. పిటిషనర్ ఆరోపిస్తున్న విధంగా ఎలాంటి తవ్వకాలు చేయడం లేదని వీఎంఆర్డీఏ తరఫు న్యాయవాది వరికూటి సూర్యకిరణ్ చెప్పిన విషయాన్ని హైకోర్టు రికార్డ్ చేసింది. నిబంధనల ప్రకారం ఈ కొండ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్)–2 పరిధిలోకి వస్తుంది కాబట్టి, తవ్వకాలకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణలో ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తామంది. విచారణను డిసెంబర్ 13కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం తవ్వకాలకు అనుమతులు తీసుకునేందుకు ఈ ఉత్తర్వులు ఎంత మాత్రం అడ్డంకి కాదని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కైలాసగిరి కొండను తవ్వి నిర్మాణాలు చేపడుతున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకుని తగిన ఉత్తర్వులివ్వాలంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఎలాంటి తవ్వకాలు చేయడం లేదని, తెన్నేటి పార్కుకు వచ్చే సందర్శకుల సౌకర్యార్థం కొండ దిగువన ఉన్న చెట్ల తుప్పలను తొలగించి, కార్ పార్కింగ్‌కు అనువుగా చదునుచేస్తున్నామని వీఎంఆర్డీఏ తరఫు న్యాయవాది సూర్యకిరణ్ తెలిపారు. కార్ పార్కింగ్ ఏర్పాటు ప్రజా ప్రయోజనం కిందకే వస్తుందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. తవ్వకాలకు కేంద్రం నుంచి అనుమతులు తప్పనిసరి కదా.. మీరు అనుమతులు తీసుకున్నారా? లేదా? అని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన వివరాలు తన వద్ద సిద్ధంగా లేవని సూర్యకిరణ్ తెలిపారు. తదుపరి విచారణ సమయంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానన్నారు. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. -
ఉన్నదంతా అమ్మేశారు, పీకల్లోతు అప్పులు.. కల్యాణి విడాకులకు కారణమిదే!
పసివాడి ప్రాణం సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సుజిత తర్వాత సినిమాలు, సీరియల్స్‌లోనూ నటించి పెద్ద నటిగా ఎదిగింది. ఎంతో సాంప్రదాయంగా రెడీ అయ్యే సుజిత అన్నయ్య సూర్యకిరణ్ కూడా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ సత్తా చాటిన ఈయన బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో పాల్గొన్న వారం రోజులకే ఎలిమినేట్ అయ్యాడు. ఈయన నటి కల్యాణిని పెళ్లి చేసుకుని కొన్నేళ్లకే ఆమెకు విడాకులిచ్చాడు. తాజాగా వీరి విడాకులకు గల కారణాన్ని సుజిత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. 'అన్నయ్యకు పెళ్లయిన మూడేళ్లకే నాకు వివాహం జరిగింది. నేను ఎక్కువగా షూటింగ్‌లోనే ఉండేదాన్ని. అప్పుడప్పుడు అన్నయ్యతో ఫోన్ మాట్లాడేదాన్ని. హైదరాబాద్‌కు షూటింగ్‌కు వచ్చినప్పుడు మాత్రం తనను నేరుగా కలిసేదాన్ని. వదిన (కల్యాణి) అప్పటికే తెలుగు ఇండస్ట్రీలో గొప్ప నటి. తనతో మాట్లాడటం, తనతో ఉండటం నాకు చాలా ఇష్టం. అక్కాచెల్లెళ్లు ఎలా ఉండేవారో మేమిద్దరం అలా ఉండేవాళ్లం. అయితే ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువకాలం ఉండకూడదు. అటువంటి ఇబ్బందులు వస్తే దాన్ని బ్యాలెన్స్ చేసే సామర్థ్యం దంపతుల్లో ఒక్కరికైనా ఉండాలి. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. వాళ్లిద్దరూ అనవసరంగా పెద్ద పెద్ద విషయాల్లో కాలు పెట్టారు. అన్నయ్య నిర్మాతగా సినిమా తీశాడు. నాకు చెప్తే సరేనన్నాను. అన్నయ్యకు, నాకు 8 ఏళ్ల ఏజ్ గ్యాప్. ఆయనకు సలహా ఇచ్చేంత పెద్ద దాన్ని కాదు. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో తనే నాకు తండ్రి లాగా! తనంటే నాకు కొంత భయం కూడా! చివరకు వారు తీసిన సినిమా డిజాస్టర్ అయింది, నష్టాలు వచ్చాయి. అదే వారి జీవితంలో వచ్చిన పెద్ద సమస్య! మాకీ విషయం తెలిసి సాయం చేద్దామనుకునేలోపు వారు మరీ దారుణ స్థితిలోకి వెళ్లిపోయారు. అన్నీ అప్పులు, ఉన్నదంతా అమ్మేశారు. కేరళలో మంచి ప్రాపర్టీ ఉండేది, దాన్ని కూడా అమ్మేశారు. సినిమా అనేది గ్యాంబ్లింగ్. ఇది అందరికీ కలిసి రాదు.. ఉన్న డబ్బంతా సినిమా కోసం పెట్టడం అనేది తెలివితక్కువ తనం. ఈ ఒక్క పని వాళ్ల జీవితాన్ని ముంచేసింది' అని చెప్పుకొచ్చింది సుజిత. చదవండి: దేశంలోనే రిచ్ హీరో.. కారు, బంగ్లాలు అమ్మేసి చివరి రోజుల్లో మురికివాడలో -
నటి కల్యాణితో విడాకులు.. కారణమేంటో చెప్పిన డైరెక్టర్
డైరెక్టర్, బిగ్‌బాస్ ఫేం సూర్య కిరణ్ గురించి ప్రత్యేకం పరిచయం అక్కర్లేదు. సుమంత సత్యం మూవీతో డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. ఈ క్రమంలో జౌను.. వాళ్లిద్దరు ఇష్టపడ్డారు మూవీతో పరిచయమైన వీరిద్దరూ 2005లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2020లో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే వీరి విడాకుల కారణాలేంటో ఎవరికి తెలియదు కానీ, సడెన్‌గా విడిపోతున్నామని ప్రకటించడంతో అందరు షాక్ అయ్యారు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన సూర్య కిరణ్.. కల్యాణితో విడాకులపై స్పందిచాడు. వారి విడాకులకు కారణాలపై నోరు విప్పాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘మేం 15 ఏళ్లు కాపురం చేశాం. మా మధ్య ఎన్నడు అభిప్రాయ భేదాలు కానీ, గొడవలు కానీ రాలేదు. ఎంతో అనోన్యంగానే ఉన్నాం. నేను చూసిన మంచి అమ్మాయిల్లో కల్యాణి ఒకరు. ఆవిడ చాలా మంచివారు. అయితే సొంత ప్రొడక్షన్ పెట్టి సినిమాలు తీయడం వల్ల ఆస్తుల పోయాయి. అప్పుల పాలయ్యాను, ఒకవేళ దానికి బయపడే ఆమె విడాకులు అడిగిరామో’ అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ‘‘మేం విడిపోవడానికి కారణమేంటని కోర్టు అడిగిన ప్రశ్నకు కూడా కల్యాణి ఏం సమాధానం చెప్పలేదు. విడాకుల కోసం మేం జడ్జిని సపరేట్ చాంబర్లో కలిశాం. అప్పుడు జడ్జి నన్ను చూపిస్తు ‘ఈయన కొడతారా? తిడతారా? మీ అత్తింటివారు ఇబ్బంది పెడుతున్నారా?’ అని కల్యాణిని అడిగారు. దానికి కల్యాణి లేదని సమాధానం ఇచ్చింది. మరెందుకు విడాకులు తీసుకుంటున్నారని అడిగినా తను ఎలాంటి సమాధానం చెప్పలేకపోయింది. ఆ వెంటనే జడ్జి మీరు డైవర్స్ తీసుకుంటే పిల్లల బాధ్యత ఎవరిది?’ అని ప్రశ్నించారు. వెంటనే నేను మాకు పిల్లలు లేరన్నాను. చదవండి: మహేశ్ సినిమాలో ఆ పాత్రను అయిష్టంగానే చేశా: ప్రకాశ్ రాజ్ మీకు పిల్లలు లేకపోవడటమే విడాకులకు కారణమా? అని అడగంతో అవును అని చెప్పాను. ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ‘వేయిట్ చేయండి. అప్పులు తీరిపోయిన తర్వాత మనం మళ్లీ పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాను’’ అన్నాడు. చివరగా తనకున్న అప్పుల కారణంగా అందరు తనని డబ్బులు అడిగి ఇబ్బంది పెడతారనే ఆందోళనతోనే కల్యాణి విడాకులు తీసుకుని ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా సూర్య కిరణ్ తమిళంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పనిచేశాడు. బాల నటుడిగా ఆయన దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించాడు. -
బిగ్‌బాస్: మెరుపుతీగలా వచ్చిపోయింది వీళ్లే!
Telugu Bigg Boss, 1st Week Eliminated Contestants: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అంటే ఇదేనేమో.. బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టే ఛాన్స్ వచ్చినా ప్రేక్షకులు కనికరించకపోవడంతో మొదటివారమే ఇంటిబాటపట్టారు చాలామంది సెలబ్రిటీలు. బిగ్‌బాస్ ఆడే నాటకంలో వారం రోజులకే ఎలిమినేట్ అవక తప్పలేదు. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఇప్పటివరకు ఐదుగురు సెలబ్రిటీలు అందరి కంటే ముందే షోలో ఎలిమినేట్ అయ్యారు. వారెవరన్నది చూసేద్దాం.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్ తొలి సీజన్లో నటి జ్యోతి అందరికంటే ముందుగా ఎలిమినేట్ అయింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించిన రెండో సీజన్లో సంజన అన్నె షోలో అడుగు పెట్టిన వారం రోజులకే అందరికీ వీడ్కోలు పలుకుతూ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. కింగ్ నాగ్ బిగ్‌బాస్ హోస్టింగ్‌ను భుజానికెత్తుకున్న మూడో సీజన్లో నటి హేమ మొదటివారమే ఎలిమినేట్ అయింది. నాలుగో సీజన్లో సూర్య కిరణ్‌ను ఎలిమినేట్ చేయగా తాజా సీజన్లో సరయూ ఫస్ట్ వీక్‌లోనే బయటకొచ్చింది. అయితే వీరిలో కొందరు కోపం, కొట్లాటల కారణంగానే ముందుగా ఎలిమినేట్ అయ్యారనేది తెలిసిన విషయమే. కాకపోతే ఒక్కవారంలోనే కంటెస్టెంట్లను జడ్జ్ చేయడం సరికాదని బిగ్‌బాస్ వీక్షకులు అభిప్రాయపడుతున్నారు. పైగా నామినేషన్స్‌లోకి వచ్చినవారిలో కొందరిని బిగ్‌బాస్ కావాలని నెగెటివ్‌గా చూపిస్తారనేది కూడా కొంతమంది వాదన. మరికొందరినేమో కనీసం తెర మీద కూడా చూపించకుండా మాయ చేస్తాడనేది మరో విమర్శ. అందుకే ఎన్నో ఆశలతో బిగ్‌బాస్ షోలో అడుగు పెట్టే కంటెస్టెంట్లకు వారేంటో నిరూపించుకునేందుకు ఒక్క అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది చాలామంది అభిప్రాయం. ఇందుకుగానూ తొలివారం ఎలిమినేషన్‌ను ఎత్తేస్తే బాగుంటుందని బుల్లితెర అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు? -
బిగ్‌బాస్: చతికిలపడ్డ కంటెస్టెంట్లు వీళ్లే
అంగరంగ వైభవంగా ప్రారంభమైన బిగ్‌బాస్ నాల్గో సీజన్లో 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. 16 మందితో మొదలైన షోలో మరో మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చి చేరాయి. కానీ ఏ వైల్డ్ కార్డ్ కంటెస్టెంటు కూడా ఫినాలేకు చేరుకోలేకపోయింది. కొందరు మెరుపు తీగల్లా వచ్చి వెళ్లిపోగా, భారీ అంచనాల మధ్య వచ్చిన మరికొందరు మాత్రం ఉనికిని కూడా చాటుకోలేక అభిమానులను నిరుత్సాహానికి గురి చేశారు. అలాంటి కంటెస్టెంట్లు ఎవరెవరే చూద్దాం... సూర్యకిరణ్ తన కోపమే తన శత్రువు అన్న వాక్యం దర్శకుడు సూర్య కిరణ్ విషయంలో అక్షరాలా నిజమైంది. ఎదుటి వాళ్లు చెప్పేది వినకుండా, ప్రతిదానికి చిర్రుబుర్రులాడేవాడు. అందుకే షోలో అడుగు పెట్టిన మొదటి వారమే షో నుంచి నిష్క్రమించాడు. కానీ తను హౌస్‌లో ఉండాల్సిన వ్యక్తి అని, ఇలా ఎలిమినేట్ అయిపోతాననుకోలేదని చెప్పుకొచ్చాడు. కానీ రెమ్యూనరేషన్ మాత్రం ఊహించినదానికన్నా పది రెట్లు ఎక్కువే ఇచ్చారని చెప్పాడు. (చదవండి: వారం రోజులకు లక్షల్లో ఇచ్చారు) కరాటే కల్యాణి అప్పుడే కోప్పడుతూ అప్పుడే ఏడుస్తూ కల్యాణి ఎవరికీ ఓ పట్టాన అర్థం కాలేదు. చిన్నచిన్న విషయాలకు కూడా పెద్ద రాద్ధాంతం చేసేది. అలా ఆమె పెద్దపెద్దగా కేకలేస్తూ అందరి మీద నోరు పారేసుకోవడంతో సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు. చాలామందితో కయ్యం పెట్టుకుని చివరికి రెండో వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. కానీ ఆమె అమ్మ రాజశేఖర్‌తో కలిసి అందరినీ తెగ ఎంటర్టైన్ చేసేది. (చదవండి: అభిజిత్ బిగ్‌బాస్‌కే గర్వకారణం) స్వాతి దీక్షిత్ ఇంట్లో మూడో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన బొద్దు గుమ్మ స్వాతి దీక్షిత్. ఆమె ఎంట్రీ, ఎలిమినేషన్ రెండూ అందరినీ సర్ప్రైజ్ చేశాయి. ఇంట్లోకి వెళ్లగానే ఆమెను ఇంప్రెస్ చేసేందుకు అబ్బాయిలు పోటీపడ్డారు. చివరికి ఆమె అభిజిత్‌తో కనెక్ట్ కావడం, అభిజిత్-హారిక మధ్య గ్యాప్ రావడం, ఇంతలో ఆమె ఎలిమినేట్ కావడం చకచకా జరిగిపోయాయి. (చదవండి: స్వాతిలో అది నాకు నచ్చలేదు: లాస్య) యాంకర్ లాస్య లాస్య అనగానే గుర్తొచ్చేది చీమ-ఏనుగు జోకులు. ఆమె వేసే జోకులకు ఎవరూ నవ్వకపోయినా ఆమె మాత్రం పడీపడీ నవ్వేది. కానీ ఈ నవ్వే ఆమెకు నానాపేర్లు తెచ్చిపెట్టింది. ఫేక్ స్మైల్, కవరింగ్ స్మైల్ అంటూ మిగతావాళ్లు లాస్య గురించి ఎన్నో అన్నారు. ఇది పక్కన పెడితే ఈ యాంకర్ నుంచి ఆమె అభిమానులు ఎంతగానో ఆశించారు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్కు మ్యాచ్ అవకుండా ఆమె కిచెన్లోనే ఉండిపోయి వంటలక్కగా మారిపోయింది. టాస్కుల్లోనూ వెనకబడిపోయింది. (చదవండి: టాప్ 2: లాస్య జోస్యం నిజమయ్యేనా?) జోర్దార్ సుజాత తెలంగాణ యాసలో మాట్లాడే ఈ యాంకర్ కిలకిలా నవ్వుతూనే ఉండేది. ఎప్పుడు చూసినా లాస్యతో కలిసి ఇంట్లో జరిగే విషయాల గురించి గుసగుసలు పెట్టేది. అలా ఆమెకు గాసిప్ క్వీన్ అన్న ముద్ర పడిపోయింది. అయితే వ్యాఖ్యాత నాగార్జునను పట్టుకుని ఆమె బిట్టూ అని పిలవడం చాలామందికి నచ్చలేదు. దీంతో ఐదోవారంలోనే ముల్లెమూట సర్దుకుని ఇంటిబాట పట్టింది. బయటకు వచ్చాక సుజాత మాట్లాడుతూ తనను బిట్టూ అని బిగ్‌బాస్ యూనిటే పిలవమని చెప్పిందంటూ తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు గట్టి సమాధానం ఇచ్చింది. (చదవండి: బిట్టూ అని వాళ్లే పిలవమన్నారు: సుజాత) కుమార్ సాయి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టిన మొట్ట మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంటు. ఎవరితోనూ కలవలేక, క్లారిటీ లేని సమాధానాలతో కన్ఫ్యూజన్ మాస్టర్‌గా నిలిచాడు. కొన్ని టాస్కుల్లో బాగా ఆడి కెప్టెన్ అయినప్పటికీ హౌస్‌లో ఉన్నానా? లేనా? అన్నట్టుగా ఉండటంతో అతడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. హౌస్‌లో కూడా ఇంటిసభ్యులు కుమార్‌ను తమలో ఒకరుగా ఫీల్ అవలేదు. దీంతో అతడు ఏకాకిగా మారిపోయాడు. చివరికి ఏడో వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. కానీ నాగార్జున స్క్రిప్ట్ చెప్పాలన్న కోరికకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంతోషంగా వీడ్కోలు తీసుకున్నాడు. -
రెమ్యూనరేషన్: పది రెట్లు ఎక్కువే ఇచ్చారు
తెలుగు బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో రెండో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టాడు సూర్యకిరణ్. కానీ కటువుగా మాట్లాడే వైఖరి వల్ల మొదటివారమే ఎలిమినేట్ అయ్యాడు. బయట చేసే డైరెక్షన్ ఇంట్లోనూ చేయడం వల్లే అతను తిరుగుముఖం పట్టాల్సి వచ్చిందని ప్రేక్షకుల అభిప్రాయం. తాజాగా ఆయన బిగ్‌బాస్ షో గురించి, వాళ్లిచ్చే రెమ్యూనరేషన్ గురించి మాట్లాడాడు ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కళ్యాణిని ఇతర ఇంటి సభ్యులు ఆడుకుంటున్నా, అది ఆమెకు అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు. ఇక మొదటి వారంలో ప్రేమలేవీ చిగురించలేవంటూనే అభిజిత్, మోనాల్, అఖిల్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని తెలిపాడు. దీని గురించి ఇంట్లో నుంచి వచ్చేముందు మోనాల్‌ను హెచ్చరించానన్నాడు. (బిగ్‌బాస్: చీపురుతో చితక్కొట్టిన గంగవ్వ) అందరికీ బాగానే ఇచ్చారు "రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారనేది చెప్పొచ్చో, లేదో నాకు తెలీదు. కానీ నాకైతే చాలానే ఇచ్చారు. అడిగిన దానికి 10 రెట్లు ఎక్కువే సమర్పించుకున్నారు. ఒక్క వారం రోజులు ఉన్నందుకు లక్షల్లో ఇచ్చారు. ఈ డబ్బుతో ఐదారు నెలలు కులాసాగా బతికేయొచ్చు. నాకొక్కరికి మాత్రమే కాదు, అందరికీ బాగానే ఇచ్చారు. నిజానికి ఒక వారమే కదా ఉన్నది.. ఏమైనా ఇస్తారా అని కొంత అడిగితే, ఇచ్చేది చాలా వుందంటూ పెద్ద మొత్తంలో సర్దారు. ఇక హౌస్‌లో కూడా ఉండాలని అనిపించలేదు. కానీ తొలివారం ఎలిమినేషన్ ఉండదనుకున్నాను. ఇకపోతే అమ్మ రాజశేఖర్ జెన్యూన్ పర్సన్, నాలాంటి వాళ్లు ఒకరు లోపల అతడికి సాయంగా ఉంటే బాగుండు. లేదంటే హౌస్‌లో ఉన్నవాళ్లు ఆయనపై ఎక్కేస్తారు. హౌస్‌లో అమాయకులు ఎవరూ లేరు" అని సూర్యకిరణ్ స్పష్టం చేశాడు. (ఓ మూడు నాలుగు వారాలు ఉందామనుకున్నా) -
నేను చనిపోయాననుకున్నారు
సుమంత్ హీరోగా నటించిన ‘సత్యం’ చిత్రంతో దర్శకునిగా పెద్ద విజయాన్ని నమోదు చేసుకున్నారు సూర్యకిరణ్. ఆ తర్వాత పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్ 4’లో పాల్గొన్నారు. అయితే తొలి వారమే ఎలిమినేట్ అయ్యారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో సూర్యకిరణ్ చెప్పిన విశేషాలు. ► నేను ‘బిగ్‌బాస్’లో పాల్గొనడానికి ఓ కారణం ఉంది. ‘సత్యం’ సినిమా హిట్టయిన తర్వాత నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. తర్వాత కొన్ని సినిమాలు చేశాను. ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాలతో చెన్నై వెళ్లిపోయాను. ఆ టైమ్‌లో నేను చనిపోయానని న్యూస్ వచ్చింది. ‘ఇలాంటి న్యూస్ వచ్చిందేంటి’ అనుకుని మళ్లీ ఓ సినిమా డైరెక్ట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఉగాదికి షూటింగ్ మొదలుపెడదామని అన్నీ రెడీ చేసుకున్నాక కరోనా వల్ల లాక్డౌన్ వచ్చింది. ఈ టైమ్‌లో బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్‌బాస్ లాంటి పెద్ద ప్లాట్‌ఫామ్‌తో రీ ఎంటర్ అయితే అందరికీ తెలుస్తుంది కదా అని పాల్గొన్నాను. ► బిగ్‌బాస్ హౌస్‌లో ఓ మూడు నాలుగు వారాలు ఉందామనుకుని వెళ్లాను. ఆ తర్వాత బయటకు వచ్చి డిసెంబర్‌కల్లా షూటింగ్ పూర్తి చేయాలనేది నా ఆలోచన. కానీ, అనుకోకుండా మొదటివారమే బయటకి వచ్చేశాను. ఒక వారం రోజులపాటు ఓ కొత్త అనుభూతిని అనుభవించాను. బాగానే ఉంది. కాకపోతే ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. ► నర్సరీ, ఫస్ట్‌క్లాస్ స్కూల్లో టీచర్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో బిగ్‌బాస్ నాకు అలా అనిపించింది. నేను ఒక కాలేజీ ప్రొఫెసర్లా ఉండి.. టీచర్ లేని స్కూల్లో స్టూడెంట్‌లా ఉండటం అంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. అందరూ హరీబరీగా మాట్లాడుతుంటారు. ► బ్యాడ్‌టైమ్ ఉంటే తాడు కూడా పామై కరుస్తుంది అంటారు. అలా అయ్యింది నా టైమ్. బాలనటునిగా రెండు స్టేట్ అవార్డులు, మూడు నేషనల్ అవార్డులు వచ్చాయి. టీవీ సీరియల్ చేస్తే ఢిల్లీలో అవార్డు ఇచ్చి, సన్మానించారు. డైరెక్టర్‌గా సినిమా చేస్తే అది పెద్ద హిట్. ఇలా విజయవంతంగా సాగిన నా లైఫ్ ఒక్కసారిగా రివర్స్ అయ్యింది. ఒక ఏడేళ్లపాటు పెద్ద గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌ను కట్ చేయటానికి బిగ్‌బాస్‌కి వచ్చాను. అంతేకానీ వాళ్లిచ్చే 50 లక్షల ప్రైజ్‌మనీ కోసం రాలేదు. ► బిగ్‌బాస్ హౌస్‌లో మంచి విషయాలు చెబితే వినిపించుకునేవాళ్లు లేరు. చేదు మందుని పంచదారతో ఇస్తారు కదా. నేను షుగర్ లేకుండా చేదుగా ఇచ్చేవాణ్ణి. ఆరోగ్యం బాగుండటానికి చేదు మందు ఇస్తున్నానని వాళ్లు గ్రహించలేదు. బిగ్‌బాస్ హౌస్‌లో షుగర్ ఉన్నవాళ్లకే షుగర్ ఇస్తున్నారు. అది వాళ్లకే సమస్య అని రెండు మూడు వారాల్లో తెలుసుకుంటారు. రకరకాల మైండ్ సెట్ ఉన్న ఇంతమందితో కలిసి ఉంటానని నేనెప్పుడూ అనుకోలేదు. నాకు ప్రతి రోజూ చాలా భారంగా గడిచింది. అక్కడ ఉన్నవాళ్లలో కొంతమంది ‘సార్.. అప్పుడే రెండు రోజులైంది’ అనేవారు. నేనేమో.. ‘రెండు రోజులే అయ్యిందా’ అనుకునేవాణ్ణి. ► ఒక్క రాజశేఖర్ (అమ్మ రాజశేఖర్) తప్ప హౌస్‌లో పెద్దగా సినిమావాళ్లెవరూ లేరు. మిగతావాళ్లకు బిగ్‌బాస్ ఒక మంచి ప్లాట్‌ఫామ్ అవుతుంది. హౌస్‌లో చాలావరకూ ఆర్టిఫిషియల్‌గా నవ్వేవారు. ఎప్పుడూ బిర్యానీని చూడనట్లు బిహేవ్ చేసేవారు. వర్షం పడుతుంటే అబ్బబ్బా.. వర్షం అంటుంటారు. హౌస్‌లో ఉన్నవాళ్లంతా మనకన్నా చాలా తెలివిగలవాళ్లు, నాకంత తెలివి లేదు. ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఉంటేనే ఫుటేజ్ టెలికాస్ట్ చేస్తారని తెలిసింది వాళ్లకు, అందుకే వాళ్లంతా అలా చేస్తారేమో. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రెండు కథలు రెడీగా ఉన్నాయి. త్వరలోనే వాటి వివరాలు చెబుతాను. -
హారిక విష సర్పం, అఖిల్ దున్నపోతు..
సండేను ఫండే చేసేందుకు బిగ్‌బాస్ మంచి ప్లానే వేశాడు. అబ్బాయిలు, అమ్మాయిల మధ్య డ్యాన్స్ పోటీ పెట్టాడు. అమ్మ రాజశేఖర్, నాగ్ జడ్జిలుగా వ్యవహరించారు. జిగేల్ రాణి పాటకు మోనాల్, మెహబూబ్ నువ్వా నేనా అన్న రీతిలో స్టెప్పులేశారు. కానీ మెహబూబ్‌కే ఎక్కువ పాయింట్లు వచ్చాయి. పెద్దపులి పాటకు సోహైల్, కల్యాణి అదరగొట్టారు. ప్రేక్షకులు ఈలలు కొట్టేలా జోష్‌గా డ్యాన్స్ చేశారు. ఈ ఇద్దరిలో కల్యాణికి ఎక్కువ మార్కులు పడ్డాయి. నోయల్, హారిక మధ్య పోటీ రంజుగా సాగింది. హోరాహోరీగా తలపడ్డిన ఈ ఇద్దరికీ సమానంగా మార్కులు పడ్డాయి. దేవి నాగవల్లి, అభిజిత్ మధ్య డ్యాన్స్ ఆసక్తికరంగా సాగింది. హీరో అభి ఎలాగో తన స్టెప్పులతో ఊపేయగా దేవి ఎక్స్ప్రెషన్స్, స్టెప్పులు కలిపి వీర లెవల్లో డ్యాన్స్ చేసింది. దీంతో దేవికి ఎక్కువ మార్కులు పడ్డాయి. రెచ్చిపోయిన దివి, తడబడ్డ అఖిల్ మైండ్ బ్లాక్ పాటకు డ్యాన్స్ చేయడంలో అఖిల్ కాస్త తడబడ్డాడు. కానీ దివి మాత్రం చూపు తిప్పుకోనివ్వకుండా స్టెప్పులేయడంతో ఆమెకే ఎక్కువ మార్కులు పడ్డాయి. నాది నెక్కలేసు గొలుసు పాటకు సూర్యకిరణ్, లాస్య రెచ్చిపోయి మరీ చిందులేశారు. చొక్కా విప్పేసి మరీ డ్యాన్స్ చేసినందుకు సూర్యకిరణ్‌కు అధిక పాయింట్లు లభించాయి. ఆ తర్వాత మాస్టర్ గంగవ్వతో డ్యాన్స్ చేయించాడు. వయసు మర్చిపోయి మరీ అవ్వ రెట్టింపు జోష్‌తో గంతులేసింది. మొత్తంగా ఈ టాస్క్‌లో అమ్మాయిలకు 91 పాయింట్లు రాగా, అబ్బాయిలకు 88 పాయింట్లు వచ్చాయి. (చదవండి: బిగ్‌బాస్ : గంగవ్వ తోపు.. ‘బకరా’ అయిన లాస్య) సూర్యకిరణ్ అవుట్ ఆ తర్వాత అఖిల్ సేవ్ అయ్యాడని పాట రూపంలో తెలిపారు. ఆ తర్వాత బొమ్మ గీసి దాని ద్వారా అది ఏ పద్యమో కనుక్కోవాలని ఆటాడించారు. అయితే అందరూ పద్యాలు చెప్తే.. గంగవ్వ మాత్రం చెవులకింపైన జోల పాట పాడింది. అనంతరం మెహబూబ్ సేవ్ అయ్యాడని స్కెచ్ చూపించారు. ఇంకా ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారని నాగ్ చెప్పగానే ఇంటి సభ్యులు ఎలిమినేషన్స్ వద్దంటూ ర్యాప్ సాంగ్‌తో వేడుకున్నారు. కానీ అలాంటి పప్పులు ఉడకవని నాగ్ తేల్చి చెప్పారు. మొదటి నుంచీ ఊహించినట్టుగానే సూర్య కిరణ్ ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించారు. కాగా తను నీళ్లు ఇవ్వడం వల్లే సూర్య కిరణ్ వెళ్లిపోయాడని మోనాల్ కన్నీళ్లు పెట్టుకుంది. (చదవండి: నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత) దేవిని మొసలి, సోహైల్ ఎలుక అనంతరం సూర్యకిరణ్‌తో నాగ్ ఓ టాస్క్ ఆడించారు. ఇందులో జంతువుల ఫొటోలను కంటెస్టెంట్లతో పోల్చమన్నారు. అలా మోనాల్‌ను నెమలితో, గంగవ్వను చీమతో, దేవిని మొసలితో, సోహైల్‌ను ఎలుకతో, అభిజిత్‌ను పిల్లితో, దివిని తాబేలుతో, కళ్యాణిని కోతితో, మెహబూబ్‌ను గద్దతో, హారికను పాముతో పోల్చాడు. విశ్వాసమున్నందుకు సుజాతను కుక్కతో, అతిగా ఆలోచిస్తున్నందుకు నోయల్‌ను నక్కతో, కెప్టెన్‌గా ఇంటి భారాన్ని మోస్తున్నందుకు లాస్యను గాడిదతో, అరియానాను గుడ్లగూబతో, అఖిల్‌ను దున్నపోతుతో, అమ్మ రాజశేఖర్‌ను సింహంతో పోల్చాడు. (చదవండి: నోయల్ సింపతీ కార్డ్ ప్లే చేస్తున్నాడు, ఓవర్ యాక్షన్) దేవిపై బిగ్‌బాంబ్ ఆ తర్వాత దేవికి ఒకరోజు మొత్తం ఏ పని చేయనవసరం లేదని బిగ్‌బాంబ్ వేసి వీడ్కోలు తీసుకున్నాడు. అనంతరం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ సాయి కుమార్‌ను స్టేజీపైకి పిలిచారు. కుమార్ మాట్లాడుతూ.. షో గెలవాలన్న ఆశయం, హౌస్ నుంచి బయటకు వచ్చేసరికి కోవిడ్ అంతమైపోయి తిరిగి సాధారణంగా పని చేసుకోవాలన్న నమ్మకం, నాగ్‌కు స్క్రిప్ట్ చెప్పాలన్న కోరిక.. ఈ మూడింట్లో ఒక్కటి జరిగినా చాలు అని మనసులోని మాటను బయట పెట్టాడు. మరి అతడు హౌస్‌లోకి వెళ్లి ఎంతలా ఎంటర్టైన్ చేస్తాడనేది రేపటి నుంచి చూడాల్సిందే! (చదవండి: గంగవ్వ 10 వారాల పైనే ఉంటుంది) -
బిగ్‌బాస్: తొలివారం ఎలిమినేట్ అయ్యేది అతనే!
బిగ్‌బాస్ తెలుగు సీజన్-4 మొదలై వారం కావొస్తున్న అనుకున్నంత ఆదరణ లభించడం లేదనిపిస్తోంది. బలమైన, పేరున్న కంటెస్టెంట్లను తీసుకురావడంలో బిగ్‌బాస్ ఈసారి దృష్టి పెట్టలేదనేది ప్రేక్షకుల మాట. ఈక్రమంలోనే తొలి వారం ఎలిమినేషన్‌కు గడువు దగ్గర పడింది. హౌజ్ నుంచి ఎవరు బయటికి వెళ్తారనేది మరికొన్ని గంటల్లో తేలుతుంది. అయితే, శనివారం నాటి ఎపిసోడ్‌ను బట్టి సూర్య కిరణ్ ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన ప్రవర్తనపై ఇంటా, బయటా విమర్శలు వస్తున్నాయి. ప్రేక్షకుల్లో కూడా ఆయనపై మంచి అభిప్రాయం కలగలేదని సోషల్ మీడియాలో కామెంట్లను బట్టి అర్థమవుతోంది. అతన్ని బయటికి పంపించేందు ఓట్లు వేసినట్టు చాలా మంది చెప్తున్నారు. ఇక హోస్ట్ నాగార్జున సైతం సూర్య కిరణ్‌ను కాస్త కఠినంగానే మందలించారు. అన్నీ కలగలిసి అతన్ని బయటికి పంపేందుకు రంగం సిద్ధమయ్యేలా చేశాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. (చదవండి: బిగ్‌బాస్ : గంగవ్వ తోపు.. ‘బకరా’ అయిన లాస్య) డ్యాన్సులతో ఇరదీసిన కంటెస్టెంట్లు ఇక ‘సండే అంటే ఫన్ డే’ అంటూ రాములో రాములా పాటతో ఆదివారం నాటి ఎపిసోడ్లో నాగార్జున ఎంట్రీ ఇవ్వనున్నారు. హౌజ్‌లోని కంటెస్టెంట్లతో సైతం ఆయన డ్యాన్సులు వేయించాడు. దివి వైద్య-సొహైల్, హారిక-నోయల్, దేవి-అభిజిత్, లాస్య-సూర్యకిరణ్, మోనాల్-మెహబూబ్ జోడీగా స్టెప్పులు వేశారు. ‘తమ్ముడూ.. లెట్స్ డూ కుమ్ముడూ’ పాటకు అమ్మ రాజశేఖర్ గంగవ్వతో కాలు కదిపాడు. అంతకుముందు నాగార్జున కంటెస్టెంట్లను బొమ్మలు గీయాలని చెప్పాడు. కంటెస్టెంట్లు వేసిన బొమ్మలను మిగతావారు వర్ణించాలని సూచించాడు. ఆదివారం ఉదయం విడుదలైన ప్రోమో ద్వారా ఈ విషయాలు రివీల్ అయ్యాయి. ఇదిలాఉండగా.. ఈ రోజుల్లో' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆదివారం నాటి ఎపిసోడ్ ద్వారా హౌజ్‌లోకి అడుగుపెట్టడం ఖాయమనే వార్తలు వెలువడుతున్నాయి. (చదవండి: టాప్ 5లో ఎవరుంటారని చెప్పడం కష్టం) Sunday is a Fun'day...Get ready for loads of entertainment.#BiggBossTelugu4 Today at 9 PM on @StarMaa pic.twitter.com/HBX5EbNmZU — starmaa (@StarMaa) September 13, 2020 -
బిగ్‌బాస్: డేంజర్ జోన్లో ఆ ఇద్దరు
బిగ్‌బాస్ నాల్గవ సీజన్ ప్రస్తుతం నీరసంగా సాగుతోంది. ప్రోమోలతో ఆకాశమంత హైప్ క్రియేట్ చేసినా ఎపిసోడ్లు మాత్రం చప్పగా సాగుతున్నాయి. అసలే ఐపీఎల్ గండం ముంచుకొస్తుంది. ఆటను రంజుగా మార్చకపోతే ప్రేక్షకులు షోతో డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బిగ్‌బాస్ ప్లాన్ మారుస్తే తప్ప ప్రేక్షకులు షోలో లీనమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇదిలా వుంటే గంగవ్వ, అభిజిత్, మెహబూబ్ దిల్సే, అఖిల్ సార్థక్, సూర్య కిరణ్, సుజాత, దివి వైద్య మొదటి వారం ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నారు. ఇప్పటివరకు వచ్చిన ఓట్ల ఆధారంగా ఇద్దరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. (చదవండి: బిగ్‌బాస్: 'అతను ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది') ఒక్క ఎపిసోడ్‌తో పెరిగిన దివి క్రేజ్ 50 శాతానికిపైగా ఓట్లతో గంగవ్వ ఎప్పుడో సేఫ్ జోన్లోకి వెళ్లిపోయింది. ఆమె తర్వాత ఎక్కువ ఓట్లు గెలుచుకున్న అభిజిత్ కూడా ఎలిమినేషన్ గండం నుంచి బయటపడ్డాడు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న అఖిల్, మెహబూబ్ కూడా ఈసారికి ఎలిమినేషన్ నుంచి బతికి బట్టకట్టారు. మిగిలింది దివి, సుజాత, సూర్యకిరణ్.. నిన్నటి ఎపిసోడ్ ముందు వరకు దివికి తక్కువ ఓట్లు పడ్డాయి. కానీ ఒక్క ఎపిసోడ్ ఆమె రాతనే మార్చేసింది. దివి సైలెంట్ కిల్లర్ అని, ఆమె హౌస్‌లో ఉండాల్సిందేనంటూ ఓట్లు గుద్దుదుతున్నారు. సుజాత.. తొందరపాటు, తత్తరపాటు చర్యలతో ఆమెకు తక్కువ ఓట్లు వచ్చాయి. (చదవండి: బిగ్‌బాస్: సూర్య కిరణ్‌తో దివి ఫైట్!) తన కోపమె తన శత్రువు తొలి రోజు నుంచే ఎవరి మీద పడితే వారిమీద తన కోపాగ్నిని ప్రదర్శించి సూర్య కిరణ్ అప్రతిష్ట మూట గట్టుకున్నాడు. ఎదుటివారిని మాట్లాడనివ్వకపోవడం, తన మాటే వినాలనేలా మూర్ఖత్వంగా ప్రవర్తించడమే ఓట్ల గండికి ప్రధాన కారణం. 'తన కోపమె తన శత్రువు' అన్న మాట ఇతని విషయంలో అక్షరాలా నిజమయ్యేట్లు కనిపిస్తోంది. కోపావేశాల కారణంగా హౌస్‌లో విలన్‌గా మారిపోయిన సూర్య కిరణ్‌ను బ్యాగు సర్దేసి బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు పంపిచాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే చివరి స్థానాల్లో ఉన్న కంటెస్టెంట్ల మధ్య ఓట్ల వ్యత్యాసంలో పెద్ద తేడా కూడా లేదు. పైగా నేడు రాత్రి 12 గంటల వరకు ఓటింగ్ వేసేందుకు అవకాశం ఉండటంతో చివరి రెండు స్థానాలు తారుమారైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది నాగార్జున వచ్చి చెప్పేవరకు వెయిట్ చేయక తప్పదు. (చదవండి: అమ్మ రాజశేఖర్ కుళ్లు జోకులు మానేయండి) -
బిగ్‌బాస్: నువ్వు హీరోయిన్, నేను హీరో
మొన్నటివరకు దివి హౌస్‌లో ఉందా? లేదా అని భూతద్దం వేసి మరీ వెతికారు. ఒక్కసారి నోరు విప్పి మాట్లాడంటూ సోషల్ మీడియాలో శతకోటి దండాలు పెట్టారు. మరికొందరు మీమ్స్‌తో దివిపై లెక్కలేనన్ని సెటైర్లు వేశారు. దివి మాట్లాడకపోతే నెట్టింట ప్రళయం వచ్చేలా ఉందని భావించిన బిగ్‌బాస్ ప్రేక్షకుల వినతికి అంగీకారం తెలిపాడు. దివిని మాట్లాడించేందుకు స్పెషల్ టాస్క్ ఇచ్చాడు. అది కూడా ఇంటి సభ్యుల్లో ఎలాంటి మార్పు ఉండాలని కోరుకుంటున్నావో చెప్పాలన్నాడు. దివి ఏమాత్రం తొణక్కుండా ప్రతి ఒక్కరి గురించి స్పష్టంగా వివరణ ఇచ్చింది. దివిలో ఉన్న ఈ టాలెంట్‌కు అటు ఇంటిసభ్యులతోపాటు ప్రేక్షకులు కూడా ఖంగు తిన్నారు. (చదవండి: గంగవ్వ 10 వారాల పైనే ఉంటుంది) ఆమె చెప్పిన పాయింట్లు విన్న తర్వాత ప్రేక్షకుల్లో దివికి ఫాలోయింగ్ పెరిగిపోయింది. అటు ఇంటి సభ్యులు కూడా ఆమెతో కలిసిపోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా సూర్య కిరణ్, మరీ ముఖ్యంగా అమ్మ రాజశేఖర్ ఆమెతో క్లోజ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అమ్మ రాజశేఖర్ దివిపై పొగడ్తల వర్షం కురిపించాడు. "మంచి క్యారెక్టర్, అందం ఉంది, మనందరితో బిగ్‌బాస్‌లో ఉంది. నువ్వు హీరోయిన్, నేను హీరో.. సరేనా" అని కబుర్లు చెప్పాడు. తనకు నిజంగా వంట చేసే అబ్బాయిలంటే ఇష్టమని దివి కూడా చెప్పుకొచ్చింది దీంతో ముసి ముసి నవ్వులు నవ్వుతూ మురిసిపోయిన మాస్టర్ పొరపాటున కూరలో టీ పొడి వేసి వంటను నాశనం చేశాడు. ఏదేమైనా ఒక్క ఎపిసోడ్‌తో ప్రేక్షకుల్లో దివిపై ఉన్న అభిప్రాయమే మారిపోయింది. (చదవండి: బిగ్‌బాస్: ఎట్టకేలకు దివి మాట్లాడింది!) Ammai influence tho #AmmaRajasekhar cooking fasak!!!#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/0ohk7xopEg — starmaa (@StarMaa) September 11, 2020 -
హారిక కొందరికైనా రెస్పెక్ట్ ఇస్తే మంచిది
హౌస్‌లో జరుగుతున్న అల్లర చివ్వర యవ్వారాలకు బిగ్‌బాస్ ఫుల్స్టాప్ పెట్టాడు. కంటెస్టెంట్లతో ఫిజికల్ టాస్క్ ఆడించాడు. తొలిసారి టాస్క్ ఇచ్చాడు కాబట్టి, అందరూ తమ శక్తి మేర కష్టపడ్డారు. ఆ తర్వాత బిగ్‌బాస్ దివికి ప్రత్యేక టాస్క్ ఇచ్చాడు. టాస్క్‌లో భాగంగా దివి వైద్య తానేం అనుకుంటుందో ఉన్నదున్నట్టుగా అందరి మొహం మీదే చెప్పింది. అయితే ఆమె చెప్పినదాన్ని కొందరు అంగీకరించకపోయినప్పటికీ ఎలాంటి వాదులాట జరగకపోవడం విశేషం. నేటి ఎపిసోడ్లో జరిగిన హైలెట్స్‌ను పరిశీలిస్తే.. బిగ్‌బాస్ మార్నింగ్ మస్తీలో దివికి టాస్క్ ఇచ్చాడు. తను ఇంటిసభ్యులను ఏ విషయంలో మార్చాలని అనుకుంటుందో చెప్పాలన్నాడు. దీంతో టాస్క్ ప్రారంభించిన దివి అఖిల్ మోడల్ అని.. అతని వాకింగ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది. కాబట్టి అది మార్చుకుంటే మంచిది అని చెప్పింది. పక్కవాళ్లు ఏడిస్తే కన్నీళ్లు పెట్టుకోవద్దని గంగవ్వకు సూచించింది. ఏడవద్దంటే తన వల్లకాదని గంగవ్వ కాస్త కటువుగా సమాధానమివ్వగా, ఏడిస్తే తామెవరం చూడలేం అంటూ అవ్వను కూల్ చేశారు. ఆ తర్వాత అభిజిత్.. కోపం తగ్గించుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చింది. లాస్య సెన్సిటివ్ అని చెప్పగా తాను అలాంటిదాన్ని కానని కొట్టిపారేసింది. హారిక అందరినీ నువ్వు అని సంబోధిస్తుంది, కాకపోతే కొందరికైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే మంచిదని చెప్పింది. (చదవండి: బిగ్‌బాస్: ఫస్ట్ వీక్ నామినేషన్స్..) మోనాల్ చిన్నదానికి కూడా ఏడుస్తుందని, కాబట్టి ప్రతిదానికి ఏడవద్దని సూచించింది. దేవి నాగవల్లి అప్పుడే హైపర్‌గా ఉంటారు, మళ్లీ అప్పుడే డల్ అయిపోతారు. కాబట్టి ఎనర్జీ ఎప్పుడూ ఒకేలా ఉంచుకోవాలని తెలిపింది. నోయల్ పాయింట్ మాట్లాడుతున్నాడు. కాకపోతే అది ముందే ప్లాన్ చేసుకున్నట్టు ఉంది. కల్యాణి కొన్నిట్లో ఓవర్ చేస్తున్నారు. అది తగ్గించి, తొందరపడకుండా ఉంటే మంచిది. సూర్య కిరణ్.. ప్రతీది పర్ఫెక్ట్గా చెప్తున్నారు. కానీ నా మాటనే వినడం అనేది తగ్గించాలి అనగానే నేను తగ్గించను అంటూ ఒక్కసారిగా కోప్పడినట్లు బిల్డప్ ఇచ్చి నవ్వేశాడు. అమ్మ రాజశేఖర్.. అందరికీ నచ్చిన పర్సన్. కానీ కుళ్లు జోకులు ఆపేస్తే మంచిదని చెప్పుకొచ్చింది. (చదవండి: బిగ్‌బాస్: 'అతను ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది') లగ్జరీ బడ్జెట్ చెడగొట్టిన కట్టప్ప ఎవరు? ఆ తర్వాత బిగ్‌బాస్.. అరియానా, సోహైల్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. కట్టప్ప వెన్నుపోటు పొడిచి నిన్న లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ను చెగడొట్టాడని చెప్పాడు. ఇంటి సభ్యులు ఎవరిని కట్టప్ప అనుకుంటున్నారో, అందుకు కారణాలేంటో తెలుసుకోవాలన్నాడు. అయితే ఇదే విషయాన్ని సోహైల్ ఇంటి సభ్యులకు చెప్పగా వారు ఈ మాటలను నమ్మలేదు. ఇదేదో కొత్త టాస్క్ అని అనుమానపడ్డారు. నిన్ననే కట్టప్ప ఎవరనేది చీటీ రాసామని, ఇప్పుడు మళ్లీ కొత్తగా చెప్పమని తేల్చి చెప్పారు. అయితే ఇంటి సభ్యుల ఆలోచనను కట్టప్ప ప్రభావితం చేస్తున్నాడని సూర్యకిరణ్ గ్రహించాడు. దీంతో అరియానా, సోహైల్ దగ్గరకు వెళ్లి అఖిల్ కట్టప్ప అనుకుంటున్నానని చెప్పాడు. ఆ తర్వాత గంగవ్వ కూడా అఖిల్ పేరే చెప్పింది. అమ్మ రాజశేఖర్.. నోయల్ పేరును, దివి, మెహబూబ్.. లాస్య పేరు చెప్పారు. అసలు ఇంట్లో కట్టప్ప ఎవరూ లేరని దేవి అభిప్రాయపడింది. కానీ మిగతా ఇంటిసభ్యులు ఎవరూ తమ అబిప్రాయాలు చెప్పేందుకు ముందుకు రాలేదు. ఆ తర్వాత నోయల్ బిగ్‌బాస్ ర్యాప్ సాంగ్ పాడుతుంటే మిగతా ఇంటి సభ్యులు చప్పట్లు కొట్టారు. హౌస్‌లో ఫస్ట్ ఫిజికల్ టాస్క్ బిగ్‌బాస్ ఫిజికల్ టాస్క్ ఇచ్చాడు. అరియానా, సోహైల్ క్వాలిటీ చెక్ మేనేజర్లుగా ఉండగా, వారికి గంగవ్వ అసిస్టెంటుగా వ్యవహరించింది. సూర్య కిరణ్ సంచాలకుడుగా పని చేశాడు. మెహబూబ్, దివి, దేవి ఎల్లో టీమ్, మోనాల్, లాస్య, అఖిల్ గ్రీన్ టీమ్, నోయల్, హారిక, అమ్మ రాజశేఖర్ ఆరెంజ్ టీమ్, అభిజిత్, సుజాత, కల్యాణి బ్లూ టీమ్‌లుగా ఏర్పడ్డారు. సైరన్ మోగగానే గార్డెన్ ఏరియాలో కన్వేయర్ బెల్ట్ ద్వారా వచ్చే వస్తువుల కోసం టీమ్ సభ్యులు ఎగబడ్డారు. అమ్మ రాజశేఖర్, అఖిల్ తెలివిగా ఆడగా, అభిజిత్ ఆటలో కాస్త తడబడ్డాడు. నోయల్, లాస్య కూడా టమాటాల కోసం కొట్టుకున్నంత పని చేశారు. మరి ఈ ఆటలో ఎవరు గెలిచారో రేపు తెలుస్తుంది. మరోవైపు కట్టప్ప ఎపిసోడ్ రేపు కూడా కొనసాగనుంది. కాకపోతే కట్టప్ప తానే అని నోయల్ ముందుకు రావడం కొసమెరుపు. అది నిజమేనా? ట్విస్టులు ఉన్నాయా? అనేది తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే. (చదవండి: బిగ్‌బాస్: నోరు విప్పిన దివి వైద్య) -
బిగ్‌బాస్: సూర్య కిరణ్‌తో దివి ఫైట్!
బిగ్‌బాస్ హౌస్‌లో టాస్క్‌లు ప్రారంభం కాకముందే గొడవలు, ఏడుపులు స్టార్ట్ అయ్యాయి. ఇక నేటి నుంచి బిగ్‌బాస్ శారీరక టాస్క్‌లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశాడు. ఇందుకోసం కంటెస్టెంట్లను టీమ్స్‌గా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఒకరినొకరు తోసుకుంటూ మొదటి టాస్క్‌లోనే కంటెస్టెంట్లు తమ ప్రతాపం చూపించినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు స్టార్ మా ప్రోమోను విడుదల చేసింది. ఈ టాస్క్‌లో పాల్గొన్న ఇంటి సభ్యులు చేతులతోనే టమాటాలు పిసికి జ్యూస్ చేశారు. ఒకరిని మించి మరొకరు ఎక్కువ బాటిళ్లు నింపాలని తహతహలాడారు. అయితే ఈ టాస్క్‌లో గంగవ్వ ఎక్కడా పాల్గొన్నట్లు కనిపించలేదు. ఆమె ప్రత్యేకమని నాగార్జునే చెప్పాడు కాబట్టి బిగ్‌బాస్ కూడా ఈ టాస్క్‌లో ఆమెకు మినహాయింపు ఇచ్చారో, లేదా ఆడించారో నేటి ఎపిసోడ్లో తెలుస్తుంది. (చదవండి: బిగ్‌బాస్: 'అతను ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది') ఇదిలా వుంటే స్టార్ మా విడుదల చేసిన మరో ప్రోమోలో దివి, సూర్య కిరణ్ మధ్య గొడవ మొదలైనట్లు కనిపిస్తోంది. ఈ మూడు రోజుల్లో తను కంటెస్టెంట్లను ఏ మేరకు పరిశీలించో చెప్పుకొచ్చింది. మోనాల్.. ఊరికే ఏడుస్తుందని, లాస్య సెన్సిటివ్ అని చెప్పింది. సూర్య.. నా మాటే విను అనడం తగ్గించుకుంటే మంచిదని హితవు పలికింది. దీంతో సూర్య కిరణ్ కోపం నషాళాన్ని తాకింది. తాను తగ్గించుకోనని తేల్చి చెప్పాడు. దీంతో హౌస్‌లో మరోసారి అగ్గి రాజేసుకున్నట్లు కనిపిస్తోంది. First physical task ki rangam siddham with so much fun 😀 #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/AtZIZM8lVw — starmaa (@StarMaa) September 10, 2020 ఈ ప్రోమోతో దివి మౌనం వెనక పరమార్థాలను వెలికి తీస్తున్నారు నెటిజన్లు. ఆమె ఇన్ని రోజులు మౌనం వహించడం.. తన స్ట్రాటజీలో భాగమని కొందరు అభిప్రాయపడుతున్నారు. మిగతా కంటెస్టెంట్లను నిశ్శబ్ధంగా గమనించి ఆ తర్వాత తన అసలు సిసలైన ఆట మొదలుపెట్టే సమయం కోసం వేచి చూస్తోందని అంటున్నారు. అయితే దివి తన అభిప్రాయాలను వెల్లడించడం బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగమేనని తెలుస్తోంది. అసలు దివికి, సూర్యకిరణ్‌కు మధ్య నిజంగానే గొడవ జరిగిందా? లేదా అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. (చదవండి: ఆర్జీవీ మెచ్చిన యాంకర్ అరియానా) From #Divi point of view...Correct ye antara??#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/bNN0lVJhl8 — starmaa (@StarMaa) September 10, 2020 -
బిగ్‌బాస్: 'అతను ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది'
వినోదాన్ని పంచేందుకు సినిమాలు, సీరియళ్లు ఉండనే ఉన్నాయి. కానీ అంతకు మించి వినోదాన్ని కోరుకునేవారికి మాత్రం బిగ్‌బాస్ తప్పనిసరి. అంతలా ఆదరాభిమానాలను చూరగొన్న బిగ్‌బాస్ కంటెస్టెంట్ల ఎంపిక నుంచి వారి షో ముగిసేవరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకుల బెడద వారిని ముప్పు తిప్పలు పెడుతోంది. దీంతో ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన కంటెస్టెంట్లే బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టారు. కానీ చాలామంది కంటెస్టెంట్ల ముఖాలు ప్రేక్షకులకు అంతగా తెలీవు. పోనీలే ఈసారి కంటెస్టెంట్ల ప్రతిభ, పనితీరు ఆధారంగానే ఓటు వేద్దామని అందరూ డిసైడ్ అయ్యారు. అయితే బిగ్‌బాస్ ఇంట్లోకి ప్రవేశించిన తొలిరోజు నుంచే దర్శకుడు సూర్య కిరణ్‌పై వ్యతిరేకత మొదలైంది. (చదవండి: బిగ్‌బాస్: ఫస్ట్ వీక్ నామినేషన్స్.. ) పోటాపోటీగా కయ్యానికి రెడీ అవుతున్నారు ఇతర కంటెస్టెంట్లకు మాట్లాడే చాన్స్ ఇవ్వకపోవడం, దుందుడుకుగా వ్యవహరించడం, తను చెప్పేదాన్ని అందరూ అంగీకరించాలన్న భావనతోపాటు చిర్రుబుర్రు కోపాలను ప్రదర్శించడం అతనికి మైనస్‌గా మారుతున్నాయి. దీంతో బిగ్‌బాస్ ప్రేమికులు అతడిని ఇంటి నుంచి బయటకు పంపించడానికి డిసైడ్ అవుతున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అతనిపై సెటైర్లు విసురుతున్నారు. "నీ ఓవర్ యాక్షన్ చూడలేక చస్తున్నాం.. అది తగ్గించుకుంటే మంచిది, లేదంటే మొదటి వారంలోనే బిగ్‌బాస్ ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది" అని హెచ్చరిస్తున్నారు. మరోవైపు సూర్యకిరణ్‌తో పోటీపడుతూ కయ్యానికి కాలు దువ్వుతున్న కరాటే కల్యాణిని కూడా ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు చాలామందే ఎదురు చూస్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్: దేత్తడి హారికపై నెటిజన్ల ఫైర్!) బాబూ బిగ్‌బాస్.. కాస్త చూడవయ్యా కానీ ఈ వారం ఆమె నామినేట్ అవకపోవడంతో ఈసారికి ఎలిమినేషన్ గండం నుంచి బయటపడింది. వీరిద్దరూ ఎదుటి వాళ్లకు మాట్లాడే అవకాశమిస్తే హౌస్‌లో అనవసరమైన గొడవలు ఉండవని నెటిజన్లు అంటున్నారు. మరో ముఖ్య విషయమేంటంటే.. బిగ్‌బాస్ హౌస్‌లో తెలుగులోనే మాట్లాడాలన్న నిబంధన ఉంది. దీన్ని ఎవరూ పెద్దగా లెక్క చేస్తున్నట్లు కనిపించడం లేదు. అమ్మ రాజశేఖర్, సూర్య కిరణ్ తమిళ పాటలు పాడటం, మోనాల్ గజ్జర్ ఇంగ్లీషు, హిందీలో మాట్లాడటం ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది. వీళ్లు ఇంత చేస్తున్నా బిగ్‌బాస్ హెచ్చరించకపోవడంతో బిగ్‌బాస్ ఏమైనా నిద్ర పోతున్నాడా? అని ఛలోక్తులు విసురుతున్నారు. (చదవండి: గంగవ్వకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు) -
'సత్యం' దర్శకుడు సూర్య కిరణ్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి.. రచయిత, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించాడు సూర్య కిరణ్. సత్యం, ధన 51, రాజుభాయ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునే ముందు పలు సీరియళ్లకు కథను అందించాడు, దర్శకత్వం సైతం వహించాడు. ఇతను హీరోయిన్ కళ్యాణిని పెళ్లి చేసుకున్నప్పటికీ మనస్పర్దలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. గత కొన్నేళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ దర్శకుడు తాజాగా బిగ్‌బాస్‌లోకి రెండో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. బాబా మాస్టర్లా సరదాగా ఉంటూ అందరితోనూ కలిసిపోతున్న ఇతను ముందు ముందు ఎలా ఉంటాడో చూడాలి.