టాలీవుడ్ రచయిత, దర్శకుడు సూర్య కిరణ్ (48) మార్చి 11న కన్నుమూశారు. పచ్చ కామెర్ల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఆయన మరణించారు. నేడు చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయిన సూర్యకిరణ్ మరణించడంతో ఆయన సన్నిహితులు షాక్‌కు గురయ్యారు. బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా కొనసాగిన విషయం తెలిసిందే. అదే సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న సీనియర్ నటి కరాటే కళ్యాణి ఆయన మృతి పట్ల పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
హీరోయిన్ కళ్యాణిని ప్రేమ పెళ్లి చేసుకున్న సూర్యకిరణ్ పలు మనస్పర్దలు రావడంతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆయన చాలా వరకు కుంగిపోయాడని కరాటే కళ్యాణి తెలిపారు. 'భార్యతో విడిపోయిన తర్వాత ఇక తనకు జీవితంలో ఏమీ మిగలలేదని ఆయన అనుకునే వాడు.. ఈ క్రమంలో ఎక్కువగా మద్యానికి బానిస అయ్యాడు. దీంతో ఆయన లివర్ బాగా దెబ్బతింది. ఈ క్రమంలో ఆయనకు పచ్చ కామెర్లు రావడంతో దానిని ఆయన గుర్తించలేకపోయాడు.
ఆపై ప్రతి రోజూ మద్యం సేవించడంతో ఆ సమస్య ఎక్కువ అయింది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినా ఉపయోగం లేకుండా పోయింది. సూర్య కిరణ్ నుంచి భార్య విడిపోయిన తర్వాత ఆమె మళ్లీ ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఆశించాడు. అది ఎప్పటికీ జరగదేమో అనే ఆలోచనలతో రాత్రంతా మద్యం,సిగరెట్స్ తాగుతూ గడిపేవాడు. జాండిస్ ఉన్న సమయంలో ఎక్కువగా మద్యం తీసుకోవడం వలనే సూర్యకిరణ్ మరణించారని కరాటే కళ్యాణి తెలిపారు.
(మాజీ సతీమణి కళ్యాణితో సూర్యకిరణ్)
టాలీవుడ్‌లో సత్యం, ధన 51, రాజుభాయ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన సూర్యకిరణ్ 'మాస్టర్ సురేష్' పేరుతో 200లకు పైగా చిత్రాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించాడు. సూర్యకిరణ్ టి.ఎస్.మణి, రాధాలకు చెన్నైలో జన్మించారు. వీరి స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. ఆయన సోదరి సుజిత కూడా బుల్లితెరతో పాటు పలు సినిమాల్లో నటిగా రాణిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment