వినోదాన్ని పంచేందుకు సినిమాలు, సీరియళ్లు ఉండనే ఉన్నాయి. కానీ అంతకు మించి వినోదాన్ని కోరుకునేవారికి మాత్రం బిగ్‌బాస్ తప్పనిసరి. అంతలా ఆదరాభిమానాలను చూరగొన్న బిగ్‌బాస్ కంటెస్టెంట్ల ఎంపిక నుంచి వారి షో ముగిసేవరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకుల బెడద వారిని ముప్పు తిప్పలు పెడుతోంది. దీంతో ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన కంటెస్టెంట్లే బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టారు. కానీ చాలామంది కంటెస్టెంట్ల ముఖాలు ప్రేక్షకులకు అంతగా తెలీవు. పోనీలే ఈసారి కంటెస్టెంట్ల ప్రతిభ, పనితీరు ఆధారంగానే ఓటు వేద్దామని అందరూ డిసైడ్ అయ్యారు. అయితే బిగ్‌బాస్ ఇంట్లోకి ప్రవేశించిన తొలిరోజు నుంచే దర్శకుడు సూర్య కిరణ్‌పై వ్యతిరేకత మొదలైంది. (చదవండి: బిగ్‌బాస్: ఫస్ట్ వీక్ నామినేషన్స్.. )
పోటాపోటీగా కయ్యానికి రెడీ అవుతున్నారు
ఇతర కంటెస్టెంట్లకు మాట్లాడే చాన్స్ ఇవ్వకపోవడం, దుందుడుకుగా వ్యవహరించడం, తను చెప్పేదాన్ని అందరూ అంగీకరించాలన్న భావనతోపాటు చిర్రుబుర్రు కోపాలను ప్రదర్శించడం అతనికి మైనస్‌గా మారుతున్నాయి. దీంతో బిగ్‌బాస్ ప్రేమికులు అతడిని ఇంటి నుంచి బయటకు పంపించడానికి డిసైడ్ అవుతున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అతనిపై సెటైర్లు విసురుతున్నారు. "నీ ఓవర్ యాక్షన్ చూడలేక చస్తున్నాం.. అది తగ్గించుకుంటే మంచిది, లేదంటే మొదటి వారంలోనే బిగ్‌బాస్ ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది" అని హెచ్చరిస్తున్నారు. మరోవైపు సూర్యకిరణ్‌తో పోటీపడుతూ కయ్యానికి కాలు దువ్వుతున్న కరాటే కల్యాణిని కూడా ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు చాలామందే ఎదురు చూస్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్: దేత్తడి హారికపై నెటిజన్ల ఫైర్!)
బాబూ బిగ్‌బాస్.. కాస్త చూడవయ్యా
కానీ ఈ వారం ఆమె నామినేట్ అవకపోవడంతో ఈసారికి ఎలిమినేషన్ గండం నుంచి బయటపడింది. వీరిద్దరూ ఎదుటి వాళ్లకు మాట్లాడే అవకాశమిస్తే హౌస్‌లో అనవసరమైన గొడవలు ఉండవని నెటిజన్లు అంటున్నారు. మరో ముఖ్య విషయమేంటంటే.. బిగ్‌బాస్ హౌస్‌లో తెలుగులోనే మాట్లాడాలన్న నిబంధన ఉంది. దీన్ని ఎవరూ పెద్దగా లెక్క చేస్తున్నట్లు కనిపించడం లేదు. అమ్మ రాజశేఖర్, సూర్య కిరణ్ తమిళ పాటలు పాడటం, మోనాల్ గజ్జర్ ఇంగ్లీషు, హిందీలో మాట్లాడటం ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది. వీళ్లు ఇంత చేస్తున్నా బిగ్‌బాస్ హెచ్చరించకపోవడంతో బిగ్‌బాస్ ఏమైనా నిద్ర పోతున్నాడా? అని ఛలోక్తులు విసురుతున్నారు. (చదవండి: గంగవ్వకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు)
Comments
Please login to add a commentAdd a comment