బిగ్‌బాస్ నాల్గవ సీజన్ ప్రస్తుతం నీరసంగా సాగుతోంది. ప్రోమోలతో ఆకాశమంత హైప్ క్రియేట్ చేసినా ఎపిసోడ్‌లు మాత్రం చప్పగా సాగుతున్నాయి. అసలే ఐపీఎల్ గండం ముంచుకొస్తుంది. ఆటను రంజుగా మార్చకపోతే ప్రేక్షకులు షోతో డిస్‌కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బిగ్‌బాస్ ప్లాన్ మారుస్తే తప్ప ప్రేక్షకులు షోలో లీనమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇదిలా వుంటే గంగవ్వ, అభిజిత్, మెహబూబ్ దిల్‌సే, అఖిల్ సార్థక్, సూర్య కిరణ్, సుజాత, దివి వైద్య మొదటి వారం ఎలిమినేషన్ రౌండ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు వచ్చిన ఓట్ల ఆధారంగా ఇద్దరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. (చదవండి: బిగ్‌బాస్: 'అతను ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది')
ఒక్క ఎపిసోడ్‌తో పెరిగిన దివి క్రేజ్
50 శాతానికిపైగా ఓట్లతో గంగవ్వ ఎప్పుడో సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయింది. ఆమె తర్వాత ఎక్కువ ఓట్లు గెలుచుకున్న అభిజిత్ కూడా ఎలిమినేషన్ గండం నుంచి బయటపడ్డాడు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న అఖిల్, మెహబూబ్ కూడా ఈసారికి ఎలిమినేషన్ నుంచి బతికి బట్టకట్టారు. మిగిలింది దివి, సుజాత, సూర్యకిరణ్.. నిన్నటి ఎపిసోడ్ ముందు వరకు దివికి తక్కువ ఓట్లు పడ్డాయి. కానీ ఒక్క ఎపిసోడ్ ఆమె రాతనే మార్చేసింది. దివి సైలెంట్ కిల్లర్ అని, ఆమె హౌస్‌లో ఉండాల్సిందేనంటూ ఓట్లు గుద్దుదుతున్నారు. సుజాత.. తొందరపాటు, తత్తరపాటు చర్యలతో ఆమెకు తక్కువ ఓట్లు వచ్చాయి. (చదవండి: బిగ్‌బాస్: సూర్య కిరణ్‌తో దివి ఫైట్!)
తన కోపమె తన శత్రువు
తొలి రోజు నుంచే ఎవరి మీద పడితే వారిమీద తన కోపాగ్నిని ప్రదర్శించి సూర్య కిరణ్ అప్రతిష్ట మూట గట్టుకున్నాడు. ఎదుటివారిని మాట్లాడనివ్వకపోవడం, తన మాటే వినాలనేలా మూర్ఖత్వంగా ప్రవర్తించడమే ఓట్ల గండికి ప్రధాన కారణం. 'తన కోపమె తన శత్రువు' అన్న మాట ఇతని విషయంలో అక్షరాలా నిజమయ్యేట్లు కనిపిస్తోంది. కోపావేశాల కారణంగా హౌస్‌లో విలన్‌గా మారిపోయిన సూర్య కిరణ్‌ను బ్యాగు సర్దేసి బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు పంపిచాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే చివరి స్థానాల్లో ఉన్న కంటెస్టెంట్ల మధ్య ఓట్ల వ్యత్యాసంలో పెద్ద తేడా కూడా లేదు. పైగా నేడు రాత్రి 12 గంటల వరకు ఓటింగ్ వేసేందుకు అవకాశం ఉండటంతో చివరి రెండు స్థానాలు తారుమారైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది నాగార్జున వచ్చి చెప్పేవరకు వెయిట్ చేయక తప్పదు. (చదవండి: అమ్మ రాజశేఖర్ కుళ్లు జోకులు మానేయండి)
Comments
Please login to add a commentAdd a comment