హారిక విష ‌స‌ర్పం, అఖిల్ దున్న‌పోతు.. | Bigg Boss 4 Telugu: Surya Kiran Eliminated, Sai Kumar Wild Card Entry | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: సూర్య‌కిర‌ణ్ అవుట్, ఆమెపై బిగ్‌బాంబ్‌!

Published Sun, Sep 13 2020 10:50 PM | Last Updated on Mon, Sep 14 2020 2:52 PM

Bigg Boss 4 Telugu: Surya Kiran Eliminated, Sai Kumar Wild Card Entry - Sakshi

సండేను ఫండే చేసేందుకు బిగ్‌బాస్ మంచి ప్లానే వేశాడు. అబ్బాయిలు, అమ్మాయిల మ‌ధ్య డ్యాన్స్ పోటీ పెట్టాడు. అమ్మ రాజ‌శేఖ‌ర్, ‌నాగ్ జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రించారు. జిగేల్ రాణి పాట‌కు మోనాల్‌, మెహ‌బూబ్ నువ్వా నేనా అన్న రీతిలో స్టెప్పులేశారు. కానీ మెహ‌బూబ్‌కే ఎక్కువ పాయింట్లు వ‌చ్చాయి. పెద్ద‌పులి పాట‌కు సోహైల్, క‌ల్యాణి అద‌ర‌గొట్టారు. ప్రేక్ష‌కులు ఈలలు కొట్టేలా జోష్‌గా డ్యాన్స్ చేశారు. ఈ ఇద్ద‌రిలో క‌ల్యాణికి ఎక్కువ మార్కులు ప‌డ్డాయి. నోయ‌ల్‌, హారిక మ‌ధ్య పోటీ రంజుగా సాగింది. హోరాహోరీగా త‌ల‌ప‌డ్డిన ఈ ఇద్ద‌రికీ స‌మానంగా మార్కులు ప‌డ్డాయి. దేవి నాగ‌వ‌ల్లి, అభిజిత్ మ‌ధ్య డ్యాన్స్ ఆస‌క్తిక‌రంగా సాగింది. హీరో అభి ఎలాగో త‌న స్టెప్పుల‌తో ఊపేయ‌గా దేవి ఎక్స్‌ప్రెష‌న్స్‌, స్టెప్పులు క‌లిపి వీర లెవ‌ల్లో డ్యాన్స్ చేసింది. దీంతో దేవికి ఎక్కువ మార్కులు ప‌డ్డాయి. 

రెచ్చిపోయిన దివి, త‌డ‌బ‌డ్డ అఖిల్‌
మైండ్ బ్లాక్ పాట‌కు డ్యాన్స్ చేయ‌డంలో అఖిల్ కాస్త త‌డ‌బ‌డ్డాడు. కానీ దివి మాత్రం చూపు తిప్పుకోనివ్వకుండా స్టెప్పులేయ‌డంతో ఆమెకే ఎక్కువ మార్కులు ప‌డ్డాయి. నాది నెక్క‌లేసు గొలుసు పాట‌కు సూర్య‌కిర‌ణ్‌, లాస్య రెచ్చిపోయి మ‌రీ చిందులేశారు. చొక్కా విప్పేసి మ‌రీ డ్యాన్స్ చేసినందుకు సూర్య‌కిర‌ణ్‌కు అధిక పాయింట్లు ల‌భించాయి. ఆ త‌ర్వాత మాస్ట‌ర్ గంగ‌వ్వ‌తో డ్యాన్స్ చేయించాడు. వ‌య‌సు మ‌ర్చిపోయి మ‌రీ అవ్వ రెట్టింపు జోష్‌తో గంతులేసింది. మొత్తంగా ఈ టాస్క్‌లో అమ్మాయిల‌కు 91 పాయింట్లు రాగా, అబ్బాయిల‌కు 88 పాయింట్లు వ‌చ్చాయి. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ : గంగవ్వ తోపు.. ‘బకరా’ అయిన లాస్య)

సూర్య‌కిర‌ణ్ అవుట్‌
ఆ త‌ర్వాత అఖిల్ సేవ్ అయ్యాడ‌ని పాట రూపంలో తెలిపారు. ఆ త‌ర్వాత బొమ్మ గీసి దాని ద్వారా అది ఏ ప‌ద్య‌మో క‌నుక్కోవాల‌ని ఆటాడించారు. అయితే అంద‌రూ ప‌ద్యాలు చెప్తే.. గంగ‌వ్వ మాత్రం చెవుల‌కింపైన‌ జోల పాట పాడింది. అనంత‌రం మెహ‌బూబ్ సేవ్ అయ్యాడ‌ని స్కెచ్ చూపించారు. ఇంకా ఇద్ద‌రు డేంజ‌ర్ జోన్‌లో ఉన్నార‌ని నాగ్ చెప్ప‌గానే ఇంటి స‌భ్యులు ఎలిమినేష‌న్స్ వ‌ద్దంటూ ర్యాప్ సాంగ్‌తో వేడుకున్నారు. కానీ అలాంటి ప‌ప్పులు ఉడ‌క‌వ‌ని నాగ్‌ తేల్చి చెప్పారు. మొద‌టి నుంచీ ఊహించినట్టుగానే సూర్య కిర‌ణ్ ఎలిమినేట్ అయ్యాడ‌ని ప్ర‌క‌టించారు. కాగా త‌ను నీళ్లు ఇవ్వ‌డం వల్లే సూర్య కిర‌ణ్ వెళ్లిపోయాడ‌ని మోనాల్ క‌న్నీళ్లు పెట్టుకుంది. (చ‌ద‌వండి: నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత)

దేవిని మొస‌లి, సోహైల్‌ ఎలుక‌
అనంత‌రం సూర్యకిర‌ణ్‌తో నాగ్ ఓ టాస్క్ ఆడించారు. ఇందులో జంతువుల ఫొటోల‌ను కంటెస్టెంట్ల‌తో పోల్చ‌మ‌న్నారు. అలా మోనాల్‌ను నెమ‌లితో, గంగ‌వ్వ‌ను చీమ‌తో, దేవిని మొస‌లితో, సోహైల్‌ను ఎలుక‌తో, అభిజిత్‌ను పిల్లితో, దివిని తాబేలుతో, క‌ళ్యాణిని కోతితో, మెహ‌బూబ్‌ను గ‌ద్ద‌తో, హారిక‌ను పాముతో పోల్చాడు. విశ్వాస‌మున్నందుకు సుజాతను కుక్క‌తో, అతిగా ఆలోచిస్తున్నందుకు నోయ‌ల్‌ను న‌క్క‌తో, కెప్టెన్‌గా ఇంటి భారాన్ని మోస్తున్నందుకు లాస్య‌ను గాడిద‌తో, అరియానాను గుడ్ల‌గూబ‌తో, అఖిల్‌ను దున్న‌పోతుతో, అమ్మ రాజ‌శేఖ‌ర్‌ను సింహంతో పోల్చాడు. (చ‌ద‌వండి: నోయ‌ల్‌ సింప‌తీ కార్డ్ ప్లే చేస్తున్నాడు, ఓవ‌ర్ యాక్ష‌న్)

దేవిపై బిగ్‌బాంబ్‌
ఆ త‌ర్వాత‌ దేవికి ఒక‌రోజు మొత్తం ఏ ప‌ని చేయ‌న‌వ‌స‌రం లేద‌ని బిగ్‌బాంబ్ వేసి వీడ్కోలు తీసుకున్నాడు. అనంత‌రం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ సాయి కుమార్‌ను స్టేజీపైకి పిలిచారు. కుమార్‌ మాట్లాడుతూ.. షో గెల‌వాల‌న్న‌ ఆశ‌యం, హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసరికి కోవిడ్ అంతమైపోయి తిరిగి సాధార‌ణంగా ప‌ని చేసుకోవాల‌న్న‌ న‌మ్మ‌కం, నాగ్‌కు స్క్రిప్ట్ చెప్పాలన్న కోరిక‌.. ఈ మూడింట్లో ఒక్క‌టి జ‌రిగినా చాలు అని మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట పెట్టాడు. మ‌రి అత‌డు హౌస్‌లోకి వెళ్లి ఎంత‌లా ఎంట‌ర్‌టైన్ చేస్తాడ‌నేది రేప‌టి నుంచి చూడాల్సిందే! (చ‌ద‌వండి: గంగ‌వ్వ 10 వారాల పైనే ఉంటుంది)


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement