Wild card entry
-
నిశేష్ X జొకోవిచ్
మెల్బోర్న్: తన కెరీర్లో ఆడుతున్న తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లోనే తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్ నిశేష్ బసవరెడ్డి దిగ్గజ ప్లేయర్‌ను ‘ఢీ’కొనబోతున్నాడు. ఈనెల 12 నుంచి మొదలయ్యే ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌కు సంబంధించి ‘డ్రా’ వివరాలను గురువారం విడుదల చేశారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను రికార్డుస్థాయిలో 10 సార్లు గెల్చుకున్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తొలి రౌండ్ ప్రత్యర్థిగా నిశేష్ ఎదురునిలువనున్నాడు. 37 ఏళ్ల జొకోవిచ్ ఇప్పటికే 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించాడు. మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధిస్తే జొకోవిచ్ కెరీర్లో 100 సింగిల్స్ టైటిల్స్ మైలురాయిని అందుకోవడంతోపాటు అత్యధికంగా 25 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా కొత్త చరిత్ర లిఖిస్తాడు. మరోవైపు అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్లో రైజింగ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్న 19 ఏళ్ల నిశేష్ ‘వైల్డ్ కార్డు’తో గ్రాండ్‌స్లామ్ అరంగేట్రం చేయనున్నాడు.సీజన్లో టాప్–8లో నిలిచిన 20 ఏళ్లలోపు ఆటగాళ్ల కోసం నిర్వహించే నెక్స్ట్ జనరేషన్ ఏటీపీ ఫైనల్స్‌లో గత ఏడాది నిశేష్ ఆడి ఆకట్టుకున్నాడు. దాంతో అతనికి ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆడేందుకు నిర్వాహకులు ‘వైల్డ్ కార్డు’ కేటాయించారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో రెండేళ్లపాటు డాటా సైన్స్ విద్యార్థిగా ఉన్న నిశేష్ నెల రోజుల క్రితమే ప్రొఫెషనల్‌గా మారాడు. బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో క్వాలిఫయర్‌గా మెయిన్ ‘డ్రా’లో ఆడి తొలి రౌండ్లో ఫ్రాన్స్ స్టార్ గేల్ మోన్‌ఫిల్స్‌కు గట్టిపోటీ ఇచ్చి ఓడిపోయాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో నిశేష్ తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ప్లేయర్లను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రస్తుతం నిశేష్ ఫామ్ చూస్తుంటే అతను జొకోవిచ్‌కు గట్టిపోటీ ఇవ్వడం ఖాయమనిపిస్తోంది. మరోవైపు జొకోవిచ్‌కు సులువైన ‘డ్రా’ ఎదురుకాలేదు. జొకోవిచ్ పార్శ్వంలోనే స్పెయిన్ స్టార్, ప్రపంచ 3వ ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్, జర్మనీకి చెందిన ప్రపంచ 2వ ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ఉన్నారు. అంతా సవ్యంగా సాగితే జొకోవిచ్‌కు క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ ఎదురవుతాడు. అల్కరాజ్ను దాటితే సెమీఫైనల్లో జ్వెరెవ్‌తో జొకోవిచ్ ఆడే అవకాశముంది. ఈ సెర్బియా స్టార్ తుది పోరుకు చేరితే మరో పార్శ్వంలో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ)తో టైటిల్ కోసం ఆడాల్సి రావచ్చు. సబెలాంకాకు క్లిష్టమైన ‘డ్రా’ మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకాకు కఠినమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్లో 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్, అమెరికా ప్లేయర్ స్లోన్ స్టీఫెన్స్‌తో సబలెంకా ఆడనుంది. గత రెండేళ్లలో ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సబలెంకా ఈసారీ గెలిస్తే ‘హ్యాట్రిక్’ పూర్తి చేసుకుంటుంది. స్విట్జర్లాండ్ స్టార్ మార్టినా హింగిస్ (1997, 1998, 1999) తర్వాత ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా సబలెంకా గుర్తింపు పొందుతుంది. సబలెంకాతోపాటు టైటిల్ ఫేవరెట్స్‌గా ఇగా స్వియాటెక్ (పోలాండ్), కోకో గాఫ్ (అమెరికా), కిన్వెన్ జెంగ్ (చైనా), రిబాకినా (కజకిస్తాన్) ఉన్నారు. నగాల్ ప్రత్యర్థి మెఖాచ్ భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ ఆ్రస్టేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 26వ ర్యాంకర్ టొమాస్ మెఖాచ్ (చెక్ రిపబ్లిక్)తో ఆడతాడు. ప్రస్తుతం 96వ ర్యాంక్‌లో ఉన్న నగాల్ తన ర్యాంక్ ఆధారంగా మెయిన్ ‘డ్రా’లో చోటు పొందాడు. గత ఏడాది ఇదే టోర్నీ తొలి రౌండ్లో ప్రపంచ 27వ ర్యాంకర్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)ను ఓడించి సంచలనం సృష్టించిన నగాల్ రెండో రౌండ్లో చైనా ప్లేయర్ జున్‌చెంగ్ చేతిలో ఓడిపోయాడు. -
బిగ్‌బాస్ సీజన్-8.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వీళ్లే (ఫొటోలు)
-
Bigg Boss 8: పదోవారం గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్
వయసైపోయాక ఏ పనీ చేతకాక ఓ మూలన కూర్చోవాల్సిందే అని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పని నిరూపించింది గంగవ్వ. టాలెంట్ ఉంటే ఏ వయసులోనైనా రాణించవచ్చని నిరూపించింది. జగిత్యాల జిల్లా లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ ఒకప్పుడు దినసరి కూలీ. కానీ ఇప్పుడు తన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఆమె ఐదేళ్లకే పెళ్లి చేసుకుంది. కష్టాల నీడలోనే పెరిగిన మిల్కూరి గంగవ్వ మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ పరిచయమైంది. తన కట్టుబొట్టు, అమాయకత్వం, గడుసుతనం.. జనాలకు నచ్చేశాయి. బిగ్‌బాస్ నుంచి పిలుపు రావడంతో నాలుగో సీజన్లో అడుగుపెట్టింది.స్వచ్ఛమైన పల్లెలో బతికిన మట్టిమనిషికి ఏసీలు పడలేదు. ఈ గోస నావల్ల కాదంటూ దండం పెట్టి బయటకు వచ్చేసింది. అయితే సొంతింటి కలను నెరవేర్చుకుంది. తర్వాత సినిమాల్లోనూ నటించింది. ఇప్పుడు మరోసారి ధైర్యం చేసి బిగ్‌బాస్ 8లోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఈసారి వెళ్లగొట్టేదాకా ఉండనంది. మనసు ఉండాలంటున్నా శరీరం వద్దని చెప్తుండటంతో చేసేదేం లేక మరోసారి స్వచ్ఛందంగా ఇంటినుంచి వెళ్లిపోయింది. -
Bigg Boss 8: టాప్ 5వ స్థానంలో అవినాష్ ఎలిమినేట్
ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న ఆశతో ఎంతోమందిలాగే ఇతడూ కృష్ణానగర్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. అవకాశాలు రాకపోయినా చిన్నచిన్న ప్రోగ్రాంలతో జీవితాన్ని గడిపాడు. అనుకోకుండా ఓ కామెడీ షోలో ఛాన్స్ రావడంతో అతడి దశ తిరిగిపోయింది. ఎనిమిదేళ్లలోనే టీం లీడర్‌గా ఎదిగాడు. చిన్నప్పటి నుంచే మిమిక్రీలు చేసే ఈ జగిత్యాలవాసికి బిగ్‌బాస్ నాలుగో సీజన్లో ఆఫర్ వచ్చింది. ఇదే విషయం కామెడీ షో నిర్వాహకులకు చెబితే.. ఇంకా రెండేళ్ల అగ్రిమెంట్ ఉందని, మధ్యలో వెళ్తే రూ.10 లక్షలు కట్టాలని హెచ్చరించారు.అప్పటికే అమ్మ అనారోగ్యం, కొత్త ఇంటి లోన్ వల్ల పీకల్లోతు అప్పులో ఉన్నాడు. ఈ అప్పులు తీర్చడం కోసం ఆ ఫైన్ కట్టి మరీ బిగ్‌బాస్‌కు వెళ్లాడు. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన అవినాష్.. 12 వారాలు హౌస్‌లో ఉన్నాడు. ఎంటర్టైనర్ అని నిరూపించుకున్నాడు. బిగ్‌బాస్ ద్వారా అప్పులు తీర్చేసి మరింత ఎదిగాడు. ఇప్పుడు మరోసారి బిగ్‌బాస్ 8లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచి తానేంటో నిరూపించుకున్న అవినాష్ ఫినాలేలో ఐదో స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు. -
Bigg Boss 8: రన్నరప్‌గా గౌతమ్ కృష్ణ
గౌతమ్ కృష్ణ.. బిగ్‌బాస్‌కు రావడానికి ముందు పలు సినిమాలు చేశాడు. కానీ జనాలకు సుపరిచితుడైంది మాత్రం బిగ్‌బాస్ ఏడో సీజన్‌తోనే! చిన్నప్పటినుంచే డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. కానీ పేరెంట్స్ కోరిక మేరకు డాక్టర్ అయ్యాడు. తన కోరికను చంపుకోలేక 2018లో దర్శకత్వంలో శిక్షణ పొందాడు. ఆ మరుసటి ఏడాది ఆకాశవీధుల్లో సినిమాకు సొంతంగా కథ రాసుకుని తనే డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించాడు.బాలీవుడ్‌లోనూ సిద్దూ: ది రాక్‌స్టార్ సినిమా చేశాడు. సినిమాలపైనే ఫోకస్ పెట్టిన ఈ డాక్టర్ బాబు గత సీజన్లో సీక్రెట్ రూమ్‌కు వెళ్లి మరీ హౌస్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. అశ్వత్థామ 2.0 అంటూ భారీ డైలాగులతో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఫినాలే వరకు రాలేక మధ్యలోనే మళ్లీ ఎలిమినేట్ అయ్యాడు. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ వైల్డ్‌ఫైర్‌లా మారిపోయి ఏకంగా ఫినాలేలో చోటు దక్కించుకున్నాడు. గెలుపుకు అడుగు దూరంలో ఆగిపోయి రన్నరప్‌గా నిలిచాడు. -
Bigg Boss 8: పద్నాలుగోవారం రోహిణి ఎలిమినేట్
ఒకప్పుడు సీరియల్స్‌లో మెప్పించిన రోహిణి.. ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ రచ్చ చేస్తోంది. ముఖ్యంగా సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌లో పనిమనిషిగా నటించి తెగ నవ్వించింది. తన కామెడీ టైమింగ్స్‌తో అందరికీ వినోదాన్ని పంచింది. ఆ మధ్య కాలు సర్జరీ వల్ల కొన్ని నెలలపాటు తెరపై కనిపించలేదు. కానీ కోలుకున్న వెంటనే మళ్లీ స్క్రీన్‌పై ప్రత్యక్షమై నవ్వుల జల్లు కురిపించింది.వైజాగ్‌లో పుట్టిన రోహిణి ప్రస్తుతం హైదరాబాద్‌లో సెటిలైంది. బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్న ఈ లేడీ కమెడియన్.. మరోసారీ ఈ రియాలిటీ షోలో అడుగుపెట్టింది. కాకపోతే ఈసారి షో ప్రారంభమైన నెల రోజులకు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. రోహిణి ఈసారైనా ఫినాలేలో అడుగుపెట్టాలని గట్టిగా ప్రయత్నించింది. ప్రతి గేమ్‌లోనూ అల్లాడించింది. కానీ నామినేషన్స్‌లోకి రాకుండా పోయింది. ఒకే ఒక్కసారి పద్నాలుగోవారంలో నామినేషన్స్‌లోకి రావడం.. అదే వారం డబుల్ ఎలిమినేషన్ ఉండటంతో రోహిణి ఎలిమినేట్ అయింది. -
Bigg Boss 8: ఎనిమిదో వారం మెహబూబ్ ఎలిమినేట్
డ్యాన్స్ అంటే పిచ్చి.. యాక్టింగ్ అంటే కూడా అంతే ఇష్టం. ఎప్పటికైనా స్క్రీన్‌పై కనిపించాలనే కోరిక.. అందుకోసం మెహబూబ్ చేయని ప్రయత్నం లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల సాఫ్ట్వేర్ కొలువులో చేరినా కళను వదిలేయలేకపోయాడు. వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్, టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.అలా తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్లో అడుగుపెట్టిన మెహబూబ్ టాస్కుల్లో సత్తా చూపించాడు. కండబలం బాగానే ఉన్నా బుద్ధి బలం తక్కువగా ఉండటంతో ఫినాలే వరకు వెళ్లకుండానే వెనుదిరిగాడు. ఇప్పుడు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. కానీ దురదృష్టం తోడుగా రావడం వల్ల నాలుగో సీజన్లో దీపావళికి ఎలిమినేట్ అయినట్లే ఈసారీ అదే పండగకు బయటకు వచ్చేశాడు. -
Bigg Boss 8: తొమ్మిదోవారం నయని ఎలిమినేట్
నయని పావని.. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అసలు పేరు సాయిరాజు పావని. టిక్‌టాక్ స్టార్‌గా ఫేమస్. ఎంత ఘాటు ప్రేమ, సమయం లేదు మిత్రమా, పెళ్లి చూపులు 2.0, బబ్లూ వర్సెస్ సుబ్బులు కేరాఫ్ అనకాపల్లి వంటి పలు షార్ట్ ఫిలింస్‌లో నటించింది. కవర్ సాంగ్స్, చిత్తం మహారాణి, సూర్యకాంతం వంటి చిత్రాల్లోనూ కనువిందు చేసిన ఈ బ్యూటీ బిగ్‌బాస్ ఏడో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది.హౌస్‌కు వెళ్లగానే అందరితో ఇట్టే కలిసిపోయింది. కానీ దురదృష్టం కొద్దీ వారానికే ఎలిమినేట్ అయిపోయింది. హౌస్ నుంచి వచ్చాక అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు, ఇప్పుడు బయటకు వచ్చేసినా నెక్స్ట్ సీజన్లో రావడం పక్కా అనుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే ఈ సీజన్లో అడుగుపెట్టింది. కాకపోతే మరోసారి వైల్డ్‌కార్డ్ ద్వారానే ఎంట్రీ ఇచ్చింది. ఈసారి నెలరోజులు హౌస్‌లో ఉండి తొమ్మిదోవారం ఎలిమినేట్ అయింది. -
బిగ్‌బాస్ 8 రీలోడ్: వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు ఇమ్యూనిటీ.. వాటే ట్విస్ట్
గత ఏడు సీజన్లకంటే కూడా ఈసారి బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు అత్యధిక టీఆర్పీ వచ్చింది. కానీ కంటెస్టెంట్లు ఆ రేటింగ్‌ను అలాగే కాపాడుకోలేకపోయారు. నెమ్మదిగా షో బోరింగ్‌గా మారుతుండటంతో బిగ్‌బాస్ ఇక లాభం లేదనుకుని పాత సీజన్లలో పాల్గొన్న పలువురినే వైల్డ్ కార్డ్ ఎంట్రీల పేరిట హౌసులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆదివారం.. 'బిగ్‌బాస్ గ్రాండ్ రీలోడ్' పేరిట ఎపిసోడ్ ప్రసారమైంది. ఇంతకీ హౌస్‌లోకి వచ్చిందెవరో చూసేయండి..నైనిక ఎలిమినేట్'జవాన్' టైటిల్ సాంగ్, 'గేమ్ ఛేంజర్' నుంచి రీసెంట్గా రిలీజైన 'రా మచ్చా' పాటలకు స్టెప్పులేసి ఆదివారం ఎపిసోడ్‌కి హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రాగానే డేంజర్ జోన్లో ఉన్న మణికంఠ, విష్ణుప్రియ, నైనికని నిలబెట్టారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలని ఎలా ఎదుర్కోబోతున్నారో ఎదుర్కోబోతున్నారని హౌస్‌మేట్స్‌ను అడగ్గా వారంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నైనిక ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించడంతో సీత ఎప్పటిలాగే కన్నీటి కుళాయిని ఓపెన్ చేస్తూ బోరున ఏడ్చేసింది.ఎవరికి ఏ ట్యాగ్?స్టేజీపైకి వచ్చిన నైనికని హౌసులో ఎవరు ఎలాంటి వారనేది నాగ్ అడగ్గా.. ప్రేరణ మ్యానిప్యులేటర్, మణికంఠ వెన్నుపోటు పొడిచే వ్యక్తి, విష్ణుప్రియ నకిలీ స్నేహితురాలు, పృథ్వీ అటెన్షన్ సీకర్, నబీల్ అవకాశవాది, సీత నిజమైన ఫ్రెండ్, నిఖిల్ గేమ్ ఛేంజర్, యష్మిది మంద బుద్ధి అని చెప్పుకొచ్చింది.ఉత్తరాలు వచ్చాయ్..ఈ వారం హౌస్మేట్స్ కోసం ఉత్తరాలు వచ్చాయి. కానీ అవి కొందరికి అందకుండానే వెనక్కు వెళ్లిపోయాయి. వాటిని నాగ్ తిరిగి తీసుకొచ్చాడు. సీత, నబీల్, యష్మి, మణికంఠ తమ లెటర్స్ అందుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక హౌస్‌లో ఉన్న ఎనిమిది మంది ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్) టీమ్‌గా, కొత్తగా వచ్చే ఎనిమిది వైల్డ్ కార్డ్స్ రాయల్ టీమ్‌గా ఉంటాయని నాగ్ వెల్లడించాడు.. తొలి వైల్డ్ కార్డ్‌గా హరితేజసీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్‌బాస్ మొదటి సీజన్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గలగలా మాట్లాడే ఈమె గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ షో తర్వాత సినిమాల్లో బిజీ అవడమే కాకుండా హోస్ట్‌గానూ అవతారమెత్తింది. అఆ, యూ టర్న్, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే, హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హరితేజ.. ఇటీవలే రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా మెప్పించింది. యాక్టింగ్, యాంకరింగ్ రెండింట్లోనూ ఆరితేరిన ఈమె ఇప్పుడు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. తనకు నవదీప్.. ఆల్ ది బెస్ట్ చెబుతున్న వీడియో పంపించారు. అలానే హౌసులోకి వెళ్లేముందు స్టేజీపైకి హరితేజ కూతురుని తీసుకురావడంతో ఆమె ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది.రెండో వైల్డ్ కార్డ్‌గా టేస్టీ తేజతేజ అసలు పేరు తేజ్‌దీప్. తెనాలో పుట్టిపెరిగిన ఇతడు 2017లో సాఫ్ట్వేర్ ఉద్యోగం హైదరాబాద్‌లో సెటిలయ్యాడు. చిన్నప్పటినుంచి నటన, సినిమాలంటే ఆసక్తి ఉన్న తేజకు కరోనా సెలవులు కలిసొచ్చాయి. 2020లో వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్నప్పుడు తెనాలిలో స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లి భోజనం చేశాడు. ఆ వీడియో యూట్యూబ్‌లో పెట్టగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదేదో బాగుందనిపించి హైదరాబాద్ వచ్చాక అదే కొనసాగించాడు. యూట్యూబర్‌గా తిండి వీడియోలు చేస్తూ బిజీ అయ్యాడు. అలా బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొన్నాడు. తొమ్మిదివారాలపాటు హౌస్‌లో ఉన్నాక షోకి టాటా బైబై చెప్పాడు. ఇప్పుడు ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అమ్మ చేసిన పాల తాళికలను నాగార్జున కోసం తీసుకొచ్చాడు. అలానే తేజకి శోభాశెట్టి బెస్ట్ విషెస్ చెప్పింది.మరో రూ.20 లక్షలుసెట్పైకి వచ్చిన స్వాగ్ టీమ్ (శ్రీవిష్ణు, రీతూ వర్మ, దక్ష నగార్కర్) తన సినిమా కబుర్లు చెప్పింది .తర్వాత హౌస్‌లోకి వెళ్లి హౌస్మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్‌తో గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లు హరి-తేజ గెలిచి రూ.20 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. అనంతరం మూడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా నయని పావని హౌస్‌లో అడుగుపెట్టింది.మూడో వైల్డ్ కార్డ్‌గా నయని పావనిఈమె అసలు పేరు సాయిరాజు పావని. టిక్‌టాక్ స్టార్‌గా ఫేమస్. షార్ట్ ఫిలింస్, కవర్ సాంగ్స్, చిత్తం మహారాణి, సూర్యకాంతం వంటి చిత్రాల్లోనూ కనువిందు చేసిన ఈ బ్యూటీ బిగ్‌బాస్ ఏడో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. దురదృష్టం కొద్దీ వారానికే ఎలిమినేట్ అయిపోయింది. అయితే నయని నెక్స్ట్ సీజన్లో రావడం పక్కా అనుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే ఈ సీజన్లో అడుగుపెట్టింది. కాకపోతే మరోసారి వైల్డ్‌కార్డ్ ద్వారానే ఎంట్రీ ఇచ్చింది. ఇక శివాజీ.. నయనికి బెస్ట్ విషెస్ చెప్పాడు.నాలుగో వైల్డ్ కార్డ్‌గా మెహబూబ్డ్యాన్స్, యాక్టింగ్ అంటే పిచ్చి. అందుకోసం మెహబూబ్ చేయని ప్రయత్నం లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల సాఫ్ట్వేర్ కొలువులో చేరినా కళను వదిలేయలేకపోయాడు. వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్, టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.అలా తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్లో అడుగుపెట్టిన టాస్కుల్లో సత్తా చూపించాడు. కండబలం బాగానే ఉన్నా బుద్ధి బలం తక్కువగా ఉండటంతో ఫినాలే వరకు వెళ్లకుండానే వెనుదిరిగాడు. ఇప్పుడు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. ఇక మెహబూబ్ కోసం సొహైల్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అలానే నాలుగో సీజన్లో ఎలా అయితే ఆడావో ఈసారి అంతకు మించి ఆడి గెలవాలన్నాడు.'జనక అయితే గనక' మూవీ ప్రమోషన్లో భాగంగా సుహాస్, దిల్ రాజ్ టీమ్ వచ్చారు. సుహాస్, హీరోయిన్ సంగీర్తన హౌసులోకి వెళ్లి ఓజీ, రాయల్ టీమ్స్‌తో గేమ్ ఆడించారు. ఇందులో గెలిచిన సీత-మణికంఠ.. బెడ్ రూమ్, రేషన్ కంట్రోల్ చేసే అధికారాన్ని సొంతం చేసుకున్నారు.ఐదో వైల్డ్ కార్డ్‌గా రోహిణిఒకప్పుడు సీరియల్స్‌లో మెప్పించిన రోహిణి.. ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ రచ్చ చేస్తోంది. తన కామెడీ టైమింగ్స్‌తో అందరికీ వినోదాన్ని పంచుతోంది. ఆ మధ్య కాలు సర్జరీ వల్ల కొన్ని నెలలపాటు తెరపై కనిపించలేదు. కానీ కోలుకున్న వెంటనే మళ్లీ స్క్రీన్‌పై ప్రత్యక్షమై నవ్వుల జల్లు కురిపిస్తోంది. బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్న రోహిణి.. మరోసారి ఈ రియాలిటీ షోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఇక శివజ్యోతి.. రోహిణి కోసం స్పెషల్ వీడియో పంపింది. హౌసులో కామెడీ లోటు బాగా ఉందని, దాన్ని ఫుల్ ఫిల్ చేయాలంది.ఆరో వైల్డ్ కార్డ్‌గా గౌతమ్ కృష్ణగౌతమ్ కృష్ణ.. బిగ్‌బాస్‌కు రావడానికి ముందు పలు సినిమాలు చేశాడు. కానీ జనాలకు సుపరిచితుడైంది మాత్రం బిగ్‌బాస్ ఏడో సీజన్‌తోనే! చిన్నప్పటినుంచే డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. కానీ పేరెంట్స్ కోరిక మేరకు డాక్టర్ అయ్యాడు. తన కోరికను చంపుకోలేక 2018లో దర్శకత్వంలో శిక్షణ పొందాడు. ఆ మరుసటి ఏడాది ఆకాశవీధుల్లో సినిమాకు సొంతంగా కథ రాసుకుని తనే డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించాడు.బాలీవుడ్‌లోనూ సిద్దూ: ది రాక్‌స్టార్ సినిమా చేశాడు. సినిమాలపైనే ఫోకస్ పెట్టిన ఈ డాక్టర్ బాబు గత సీజన్లో సీక్రెట్ రూమ్‌కు వెళ్లాడు. అశ్వత్థామ 2.0 అంటూ భారీ డైలాగులతో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఫినాలే వరకు రాలేకపోయాడు. తాజాగా మరోసారి వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చాడు.ఏడో వైల్డ్ కార్డ్‌గా అవినాష్ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న ఆశతో ఎంతోమందిలాగే ఇతడూ కృష్ణానగర్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. అవకాశాలు రాకపోయినా చిన్నచిన్న ప్రోగ్రాంలతో జీవితాన్ని గడిపాడు. అనుకోకుండా ఓ కామెడీ షోలో ఛాన్స్ రావడంతో అతడి దశ తిరిగిపోయింది. ఎనిమిదేళ్లలోనే టీం లీడర్‌గా ఎదిగాడు. చిన్నప్పటి నుంచే మిమిక్రీలు చేసే ఈ జగిత్యాలవాసికి బిగ్‌బాస్ నాలుగో సీజన్లో ఆఫర్ వచ్చింది. ఇదే విషయం కామెడీ షో నిర్వాహకులకు చెబితే.. ఇంకా రెండేళ్ల అగ్రిమెంట్ ఉందని, మధ్యలో వెళ్తే రూ.10 లక్షలు కట్టాలని హెచ్చరించారు.ఆర్థిక అవసరాల వల్ల స్నేహితుల సాయం తీసుకుని మరీ ఆ డబ్బు కట్టేసి బిగ్‌బాస్‌కు వెళ్లాడు. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన అవినాష్.. 12 వారాలు హౌస్‌లో ఉండి ఎంటర్టైనర్ అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి బిగ్‌బాస్ 8లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇతడికి శ్రీముఖి ఆల్ ది బెస్ట్ చెప్పింది. అలానే స్టేజీపై మణికంఠ, నబీల్, విష్ణుప్రియలా యాక్ట్ చేసి నవ్వించాడు.ఎనిమిదో వైల్డ్ కార్డ్‌గా గంగవ్వవయసైపోయాక ఏ పనీ చేతకాక ఓ మూలన కూర్చోవాల్సిందే అని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పని నిరూపించింది గంగవ్వ. టాలెంట్ ఉంటే ఏ వయసులోనైనా రాణించవచ్చని నిరూపించింది. జగిత్యాల జిల్లా లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ ఒకప్పుడు దినసరి కూలీ. కానీ ఇప్పుడు తన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.తన కట్టుబొట్టు, అమాయకత్వం, గడుసుతనం.. జనాలకు నచ్చేశాయి. బిగ్‌బాస్ నుంచి పిలుపు రావడంతో నాలుగో సీజన్లో అడుగుపెట్టింది. స్వచ్ఛమైన పల్లెలో బతికిన మట్టిమనిషికి ఏసీలు పడలేదు. ఈ గోస నావల్ల కాదంటూ దండం పెట్టి బయటకు వచ్చేసింది. అయితే సొంతింటి కలను నెరవేర్చుకుంది. తర్వాత సినిమాల్లోనూ నటించింది. ఇప్పుడు మరోసారి ధైర్యం చేసి బిగ్‌బాస్ 8లోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చింది.రాయల్ టీమ్‌కు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ టీమ్‌కు చివరగా మరో గేమ్ ఆడించారు. ఇందులో రాయల్ టీమ్ నుంచి అవినాష్, గంగవ్వ ఆడారు. ఓజీ టీమ్‌పై వీరు విజయం సాధించడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ఈ వారం ఇమ్యూనిటీ లభించింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈరోజే.. వారిద్దరి ఎంట్రీ ఖాయం!
నెల రోజులకు పైగా బిగ్‌బాస్ సీజన్-8 టాలీవుడ్ సినీ ప్రియులను అలరిస్తోంది. అయితే ఈ ఆదివారం ఈ షోపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ఎందుకంటే ఇప్పటికే హౌస్ నుంచి ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. దీంతో హోస్లో కాస్తా ఎంటర్టైన్మెంట్ తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీజన్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఎప్పటిలాగే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వీరిలో గతంలో హౌస్‌లోకి వచ్చినా వాళ్లు కూడా ఉన్నారు.తాజాగా ఈరోజు జరిగే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. కొత్త కంటెస్టెంట్స్‌పై హౌస్ సభ్యులందరినీ నాగార్జున అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. వారిని త్వరగా ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ హౌస్మేట్స్ అంతా సరదాగా మాట్లాడారు. అంతేకాకుండా మూవీ ప్రమోషన్లలో భాగంగా స్వాగ్ టీమ్, జనక అయితే గనక, మా నాన్న సూపర్ హీరో టీమ్స్ సందడి చేశాయి.(ఇది చదవండి: Bigg Boss 8 : మాజీలతో మసాలా వర్కౌట్ అయ్యేనా?)వారిపైనే ఆసక్తి?అయితే అందరి దృష్టి వారిపైనే ఉంది. ఇంతకీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరు ఎంట్రీ ఇస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరిగింది. ప్రోమో చూస్తే కొందరి పేర్లు కనిపెట్టేలా హింట్స్ కూడా ఇచ్చారు. ఈ రోజు హౌస్‌లోకి గతంలో మధ్యలోనే బయటికెళ్లిన గంగవ్వ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాకుండా యాంకర్ హరితేజ కూడా హౌస్‌లో అడుగుపెట్టనుంది. వీరితో పాటు మరికొంత ప్రముఖులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా రిలీజైన ప్రోమోను చూస్తే మీకు మరింత క్లారిటీ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి. -
Bigg Boss 8: ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఎవరో గుర్తుపట్టారా?
బిగ్‌బాస్ 8 మరీ చప్పగా సాగుతోంది. రీసెంట్గా సోనియా ఎలిమినేట్ అయిపోయింది. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ఇప్పటికే బాంబు పేల్చారు. అందుకు తగ్గట్లే ఈసారి నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది సస్పెన్స్‌గా మారింది.మరోవైపు గత కొన్నిరోజుల నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి సోషల్ మీడియాలో తెగ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్లే ఇప్పుడు తొలి కంటెస్టెంట్ ఎవరో చెప్పుకోండి చూద్దాం అని నిర్వహకులు నీడతో ఉన్న ఫొటోని రిలీజ్ చేశారు. అయితే ఇది గత సీజన్లో పాల్గొన్న టేస్టీ తేజనే అని కామెంట్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: అంబటి రాయుడిని అప్పట్లో నెక్ట్స్ సచిన్ అన్నారు: హీరో శ్రీ విష్ణు)తేజతో పాటు ముక్కు అవినాష్, హరితేజ, రోహిణి, యాంకర్ రవి, నయని పావని.. ఇలా పలువురు పేర్లయితే వినిపిస్తున్నాయి. వీళ్లలో ఎవరు వస్తారనేది ఈ వీకెండ్ లేదంటే వచ్చే వీకెండ్ కల్లా తెలిసిపోతుంది.మంగళవారం ఎపిసోడ్లో 'జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు' అనే టాస్క్ పెట్టారు. ఇందుకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. తొలుత ఈ టాస్క్ ఎవరు ఆడాలి? అనే విషయమై కాంతార క్లాన్లో చాలా డిస్కషన్ నడిచింది. నామినేషన్స్‌లో ఉన్నామని చెప్పి నైనిక రిక్వెస్ట్ చేసింది. ప్రేరణకు ఆరోగ్యం బాలేదని, సీత చీఫ్ కాబట్టి సేఫ్ అని, చివరికి మణికంఠను ఈ టాస్క్‌లో నిలబెట్టారు. మరోవైపు యష్మి కూడా పోటీ పడింది. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచారు? చివరకు ఏమైందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాలి.(ఇదీ చదవండి: నాలుగో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి.. డేట్ ఫిక్స్) View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushotstartelugu) -
బిగ్‌బాస్ 6లోకి సుడిగాలి సుధీర్? వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌజ్‌లో హంగామా!
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ ప్రస్తుతం 6వ సీజన్‌ను జరుపుకుంటోంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్‌కు ప్రేక్షకాదరణ కాస్తా దగ్గిందననే చెప్పొచ్చు. ఆడియన్స్‌కి పెద్దగా పరిచయం లేని వారే ఈ సీజన్లో ఎక్కువ ఉన్నారు. బాలాదిత్య, సింగర్ రేవంత్ మిగతావారేవరు పెద్దగా పరిచయం లేనివారే. దీంతో ఈ సీజన్‌పై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అలాగే హౌజ్‌లో కంటెస్టెంట్స్ తీరు కూడా అలాగే ఉంది. ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడం, వ్యక్తిగతంగా ద్వేషించుకోవడం తప్పా ఎవరి మధ్యా పెద్దగా సఖ్యత కనిపించడం లేదు. టాస్క్‌లో సైతం టీం మెంబర్స్ మద్దతుగా నిలవకపోగా ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్‌గానే ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా గత సీజన్ల కంటే ఈ సీజన్‌కు ప్రేక్షకాదరణ కరువైంది. దీంతో ఎంటర్టైన్మెంట్ డోస్‌ను పెంచేందుకు బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్‌ను బిగ్‌బాస్ నిర్వహకులు రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. కమెడియన్‌గా వచ్చి యాంకర్‌గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ వైల్డ్‌కార్డ్ ద్వారా బిగ్‌బాస్‌లోకి తీసుకువస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వారం చివరిలో సుధీర్ సడన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.ప్రస్తుతం సుధీర్ క్వారంటైన్లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇది తెలిసి బిగ్‌బాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న సుడిగాలి సుధీర్‌కి కచ్చితంగా మంచి ఆదరణ లభించే అవకాశం ఉంటుందంటున్నారు అతడి ఫ్యాన్స్. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఒక్క కంటెస్టెంట్లు అంతగా వినోదాన్ని అందించలేకపోతున్నారు. అందుకే ఈ సమయంలో సుధీర్ హౌస్‌లోకి వస్తే ప్రేక్షకులకు మంచి వినోదంతో పాటు మంచి టాప్ టీఆర్పీ రేటింగ్ కూడా నమోదయ్యే అవకాశం ఉందని బిగ్‌బాస్ నిర్వహకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం సుధీర్‌కు భారీగా పారితోషికం కూడా ఇస్తున్నారట. అయితే అది ఎంత అనేది స్పష్టత లేదు. ఇక సుధీర్ హౌజ్‌లో వస్తాడా? రాడా? తెలియాలంటే ఈ వారం చివరి వరకు వేచి చూడాల్సిందే. -
రామ్‌కుమార్‌కు ‘వైల్డ్ కార్డు’
‘టాటా ఓపెన్’ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్‌కు ‘వైల్డ్ కార్డు’ కేటాయించారు. దాంతో రామ్‌కుమార్ పురుషుల సింగిల్స్‌లో నేరుగా మెయిన్ ‘డ్రా’లో ఆడతాడు. టాటా గ్రూప్ స్పాన్సర్ చేస్తున్న ఈ టోర్నీ మహారాష్ట్రలోని పుణేలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరుగుతుంది. గత నవంబర్‌లో రామ్ బహ్రెయిన్ ఓపెన్ లో విజేతగా నిలిచి కెరీర్లో తొలి ఏటీపీ చాలెంజర్ టైటిల్‌ను సాధించాడు. చదవండి: IPL: వాళ్లిద్దరు నా ఫేవరెట్ ప్లేయర్లు... ఐపీఎల్లో ఆ జట్టుకు ఆడాలని ఉంది: దక్షిణాఫ్రికా యువ సంచలనం ఏబీడీ 2.0! -
బిగ్‌బాస్: 'నువ్వు ఇలా చేస్తావనుకోలేదు..నాతో రిలేషన్లో ఉండి'..
టెలివిజన్ చరిత్రలో బిగ్‌బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ భాషలో అయినా బిగ్‌బాస్ షో టీఆర్పీ రేటింగులో దూసుకుపోతుంది. ఇక హిందీ బిగ్‌బాస్ సీజన్ 15 రోజురోజుకూ రసవత్తరంగా సాగుతుంది. తాజాగా మోడల్ రాజీవ్ అదాతియా వైల్డ్ కార్డ్‌గా బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. రావడం రావడంతోనే కంటెస్టెంట్ ఇషాన్ సెహగాల్తో తన రిలేషన్‌షిప్‌ను చెప్పి బాంబు పేల్చాడు. మీషా అయ్యర్‌తో సన్నిహితంగా ఉండటం ఏంటని నిలదీశాడు. ఏ కారణం వల్ల బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చావ్? ఇక్కడ ఏం చేస్తాన్నావ్ అంటూ ఫైర్ అయ్యాడు. 'మనమిద్దరం చాలా కాలం పాటు రిలేషన్లో ఉన్నాం. ఇప్పుడు నువ్వు మీషాతో లవ్‌లో ఉండటం ఏంటి? అయినా 3రోజుల్లో ప్రేమ పుడుతుందా? నీ నుంచి ఇలాంటిది జరుగుతుందని నేను ఊహించలేదు. ఆ అమ్మాయికి నువ్వు అబద్దపు ప్రమాణాలు ఎందుకు చేస్తున్నావ్? నువ్వు నాకు ఏం ప్రామిస్‌లు చేశావో గుర్తింది కదా' అంటూ ఇద్దరి రిలేషన్‌కు సంబంధించిన డార్క్ సీక్రెట్‌ను బయటపెట్టాడు. కాగా బిగ్‌బాస్ సీజన్15లో ఇషాన్- మీషా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఇషాన్ బై-సెక్సువల్ అని తెలిశాక మీషా-ఇషాన్‌ల లవ్‌కు బ్రేకప్ పడనుందా? లేక ఇది ట్రయాంగిల్‌గా మారనుందా అన్నది ఎంట్రెస్టింగ్గా మారింది. కాగా ఇటీవలె ఇషాన్ లవ్ ప్రపోజ్ చేయగా మీషా సైతం లవ్ యూ టూ అంటూ అతని ప్రేమను అంగీకరించింది. ఇక తెరపై వీళ్లిద్దరూ చేసే మితిమీరిన రొమాన్స్‌కు ఫ్యామిలీ ఆడియోన్స్ సైతం ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయంపై హోస్ట్ సల్మాన్ సైతం వీరిద్దరిని హెచ్చరించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) -
హారిక విష సర్పం, అఖిల్ దున్నపోతు..
సండేను ఫండే చేసేందుకు బిగ్‌బాస్ మంచి ప్లానే వేశాడు. అబ్బాయిలు, అమ్మాయిల మధ్య డ్యాన్స్ పోటీ పెట్టాడు. అమ్మ రాజశేఖర్, నాగ్ జడ్జిలుగా వ్యవహరించారు. జిగేల్ రాణి పాటకు మోనాల్, మెహబూబ్ నువ్వా నేనా అన్న రీతిలో స్టెప్పులేశారు. కానీ మెహబూబ్‌కే ఎక్కువ పాయింట్లు వచ్చాయి. పెద్దపులి పాటకు సోహైల్, కల్యాణి అదరగొట్టారు. ప్రేక్షకులు ఈలలు కొట్టేలా జోష్‌గా డ్యాన్స్ చేశారు. ఈ ఇద్దరిలో కల్యాణికి ఎక్కువ మార్కులు పడ్డాయి. నోయల్, హారిక మధ్య పోటీ రంజుగా సాగింది. హోరాహోరీగా తలపడ్డిన ఈ ఇద్దరికీ సమానంగా మార్కులు పడ్డాయి. దేవి నాగవల్లి, అభిజిత్ మధ్య డ్యాన్స్ ఆసక్తికరంగా సాగింది. హీరో అభి ఎలాగో తన స్టెప్పులతో ఊపేయగా దేవి ఎక్స్ప్రెషన్స్, స్టెప్పులు కలిపి వీర లెవల్లో డ్యాన్స్ చేసింది. దీంతో దేవికి ఎక్కువ మార్కులు పడ్డాయి. రెచ్చిపోయిన దివి, తడబడ్డ అఖిల్ మైండ్ బ్లాక్ పాటకు డ్యాన్స్ చేయడంలో అఖిల్ కాస్త తడబడ్డాడు. కానీ దివి మాత్రం చూపు తిప్పుకోనివ్వకుండా స్టెప్పులేయడంతో ఆమెకే ఎక్కువ మార్కులు పడ్డాయి. నాది నెక్కలేసు గొలుసు పాటకు సూర్యకిరణ్, లాస్య రెచ్చిపోయి మరీ చిందులేశారు. చొక్కా విప్పేసి మరీ డ్యాన్స్ చేసినందుకు సూర్యకిరణ్‌కు అధిక పాయింట్లు లభించాయి. ఆ తర్వాత మాస్టర్ గంగవ్వతో డ్యాన్స్ చేయించాడు. వయసు మర్చిపోయి మరీ అవ్వ రెట్టింపు జోష్‌తో గంతులేసింది. మొత్తంగా ఈ టాస్క్‌లో అమ్మాయిలకు 91 పాయింట్లు రాగా, అబ్బాయిలకు 88 పాయింట్లు వచ్చాయి. (చదవండి: బిగ్‌బాస్ : గంగవ్వ తోపు.. ‘బకరా’ అయిన లాస్య) సూర్యకిరణ్ అవుట్ ఆ తర్వాత అఖిల్ సేవ్ అయ్యాడని పాట రూపంలో తెలిపారు. ఆ తర్వాత బొమ్మ గీసి దాని ద్వారా అది ఏ పద్యమో కనుక్కోవాలని ఆటాడించారు. అయితే అందరూ పద్యాలు చెప్తే.. గంగవ్వ మాత్రం చెవులకింపైన జోల పాట పాడింది. అనంతరం మెహబూబ్ సేవ్ అయ్యాడని స్కెచ్ చూపించారు. ఇంకా ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారని నాగ్ చెప్పగానే ఇంటి సభ్యులు ఎలిమినేషన్స్ వద్దంటూ ర్యాప్ సాంగ్‌తో వేడుకున్నారు. కానీ అలాంటి పప్పులు ఉడకవని నాగ్ తేల్చి చెప్పారు. మొదటి నుంచీ ఊహించినట్టుగానే సూర్య కిరణ్ ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించారు. కాగా తను నీళ్లు ఇవ్వడం వల్లే సూర్య కిరణ్ వెళ్లిపోయాడని మోనాల్ కన్నీళ్లు పెట్టుకుంది. (చదవండి: నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత) దేవిని మొసలి, సోహైల్ ఎలుక అనంతరం సూర్యకిరణ్‌తో నాగ్ ఓ టాస్క్ ఆడించారు. ఇందులో జంతువుల ఫొటోలను కంటెస్టెంట్లతో పోల్చమన్నారు. అలా మోనాల్‌ను నెమలితో, గంగవ్వను చీమతో, దేవిని మొసలితో, సోహైల్‌ను ఎలుకతో, అభిజిత్‌ను పిల్లితో, దివిని తాబేలుతో, కళ్యాణిని కోతితో, మెహబూబ్‌ను గద్దతో, హారికను పాముతో పోల్చాడు. విశ్వాసమున్నందుకు సుజాతను కుక్కతో, అతిగా ఆలోచిస్తున్నందుకు నోయల్‌ను నక్కతో, కెప్టెన్‌గా ఇంటి భారాన్ని మోస్తున్నందుకు లాస్యను గాడిదతో, అరియానాను గుడ్లగూబతో, అఖిల్‌ను దున్నపోతుతో, అమ్మ రాజశేఖర్‌ను సింహంతో పోల్చాడు. (చదవండి: నోయల్ సింపతీ కార్డ్ ప్లే చేస్తున్నాడు, ఓవర్ యాక్షన్) దేవిపై బిగ్‌బాంబ్ ఆ తర్వాత దేవికి ఒకరోజు మొత్తం ఏ పని చేయనవసరం లేదని బిగ్‌బాంబ్ వేసి వీడ్కోలు తీసుకున్నాడు. అనంతరం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ సాయి కుమార్‌ను స్టేజీపైకి పిలిచారు. కుమార్ మాట్లాడుతూ.. షో గెలవాలన్న ఆశయం, హౌస్ నుంచి బయటకు వచ్చేసరికి కోవిడ్ అంతమైపోయి తిరిగి సాధారణంగా పని చేసుకోవాలన్న నమ్మకం, నాగ్‌కు స్క్రిప్ట్ చెప్పాలన్న కోరిక.. ఈ మూడింట్లో ఒక్కటి జరిగినా చాలు అని మనసులోని మాటను బయట పెట్టాడు. మరి అతడు హౌస్‌లోకి వెళ్లి ఎంతలా ఎంటర్టైన్ చేస్తాడనేది రేపటి నుంచి చూడాల్సిందే! (చదవండి: గంగవ్వ 10 వారాల పైనే ఉంటుంది) -
బిగ్‌బాస్: నేడే వైల్డ్ కార్డ్ ఎంట్రీ
బిగ్‌బాస్ నాల్గవ సీజన్ మొదటి వారం ఎలిమినేషన్ స్టార్ట్ అయింది. ఎలిమినేషన్ జోన్లో ఉన్న ఏడుగురిలో కింగ్ నాగార్జున ఇప్పటికే గంగవ్వ, అభిజిత్, సుజాతను సేవ్ చేశారు. మెహబూబ్, అఖిల్, దివి ఇంకా డేంజర్ జోన్లోనే ఉన్నారు. అయితే ఇప్పటివరకు అందించిన సమాచారం ప్రకారం దర్శకుడు సూర్య కిరణ్ హౌస్ నుంచి బ్యాగు సర్దుకుని బయటకు వెళ్లనున్నాడని భోగట్టా. ఇదిలా వుంటే ఎలిమినేషన్ వద్దంటూ ఇంటి సభ్యులు ర్యాప్ సాంగ్‌తో నాగార్జునను అభ్యర్థించారు. కానీ బిగ్‌బాస్.. సీతయ్య, ఎవరిమాటా వినడని వారి వినతిని తిరస్కరించారు. దీంతో నామినేట్ అయిన కంటెస్టెంట్లు ఒక్కసారిగా డీలా పడిపోయారు. (చదవండి: బిగ్‌బాస్: వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు వీరే!) నటుడి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాగా షో ప్రారంభమై వారం రోజులు కావస్తున్నా ఆ సందడి, హడావుడి లేదని, చప్పగా సాగుతుందని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. దీంతో బిగ్‌బాస్ నిర్వాహకులు వైల్డ్ కార్డ్ అస్త్రాన్ని బయటకు తీశారు. ఈ మేరకు నేటి ఎపిసోడ్లో నాగ్ ఓ సర్ప్రైజ్ ఉండబోతోందని చెప్పారు. ఆ వెంటనే ఓ వైల్డ్ కార్డ్ కంటెస్టెంటును లోపలికి పంపిచారు. ఆ కంటెస్టెంటు నటుడు సాయి కుమార్ పంపన అని సమాచారం. "ఈ రోజుల్లో" చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సాయి కుమార్ "బస్టాప్" వంటి పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్ద బ్రేక్ అయితే రాలేదు. దీంతో బిగ్‌బాస్ షో ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మరి ఆయనకు బిగ్‌బాస్ ఎంతమేరకు కలిసివస్తుందో చూడాలి! (చదవండి: ఎన్నో వారాలు ఉండలేను: గంగవ్వ) Elimination day... Wait for the surprise!#BiggBossTelugu4 Today at 9 PM on @StarMaa pic.twitter.com/XnYgmekL4b — starmaa (@StarMaa) September 13, 2020 డ్యాన్సులతో అదరగొట్టిన దివి, దేవి మరోవైపు ఉదయం స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమోలో కంటెస్టెంట్లు అందరూ డ్యాన్సులతో రచ్చ రచ్చ చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా దివి, దేవి చేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఈలలు వేయించేలా ఉన్నాయి. ఆఖరుకు గంగవ్వ కూడా హుషారుగా స్టెప్పులేయడం విశేషం. కల్యాణి పాట అందుకోవడంతో తప్పించుకునే ఛాన్స్ లేక ఇంటి సభ్యులందరూ బిక్కముఖం వేసుకున్నారు. (చదవండి: గంగవ్వ 10 వారాల పైనే ఉంటుంది) Sunday is a Fun'day...Get ready for loads of entertainment.#BiggBossTelugu4 Today at 9 PM on @StarMaa pic.twitter.com/HBX5EbNmZU — starmaa (@StarMaa) September 13, 2020 -
వైల్డ్ కార్డ్ ఎంట్రీ: ఇద్దరా? ముగ్గురా?
సెప్టెంబర్ ఆరున గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో 16 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఇందులో ముందుగా ఊహించిన ఓ కంటెస్టెంటు మాత్రం మిస్సయ్యాడు. అతడే జబర్దస్థ్ కమెడియన్ ముక్కు అవినాష్. సోషల్ మీడియాలో ఎప్పటినుంచో అవినాష్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటరవుతున్నాడంటూ బోలెడన్ని వార్తలు వీరవిహారం చేశాయి. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో అతను ఎంట్రీ ఇవ్వకపోవడంతో అందరూ ఖంగు తిన్నారు. అలా అని అవినాష్ షో నుంచి తప్పుకున్నాడని చెప్పలేం. అతడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తగిన సమయం చూసి బిగ్‌బాస్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ బాణాన్ని వదలనున్నట్లు కనిపిస్తోంది. (చూడాలి: దేత్తడి హారిక: బెడిసి కొట్టిన పబ్లిసిటీ!) సాయికుమార్ బిగ్‌బాస్ హౌస్‌లోకి! అవినాష్‌తోపాటు ప్రజలకు పరిచయం ఉన్న మరో ముఖం కూడా త్వరలోనే బిగ్‌బాస్ హౌస్‌లో చూసే సూచనలు కన్పిస్తున్నాయి. 'ఈ రోజుల్లో' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్ కూడా హౌస్‌లో భాగం కానున్నాడు. అసలే హౌస్‌లో సెలబ్రిటీలు పెద్దగా లేరు, ఉన్నవాళ్లు కూడా యాక్టివ్‌గా లేకపోవడంతో షో రక్తికట్టడం లేదు. దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారానైనా బిగ్‌బాస్‌కు బిగ్ బ్రేక్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నారు. పనిలో పనిగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపించేందుకు ఓ అమ్మాయిని కూడా సెలక్ట్ చేసి పెట్టారు. 'జంప్ జిలానీ' హీరోయిన్ స్వాతి దీక్షిత్‌ను ఓ ఆప్షన్‌గా పెట్టుకున్నారు. ఈమె చిత్రాంగధ, లేడీస్ అండ్ జెంటిల్మెన్ చిత్రాల్లోనూ నటించింది (చూడాలి: రూ.50 లక్షలు వస్తే.. : గంగవ్వ) వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను ప్రేక్షకులు ఆదరిస్తారా? వైల్డ్ కార్డ్ ఎంట్రీల వల్ల బిగ్‌బాస్ షో ఎంత రచ్చరచ్చగా మారిందో గత సీజన్లలోనే చూశాం. మూడో సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా కంటెస్టెంట్లతో ఆడుకుని వారిని ఏడిపించిన విషయం తెలిసిందే. ఆమె అరాచకాలను చూడలేక ప్రేక్షకులు రెండు మూడు వారాల్లోనే తమన్నాను బయటకు పంపించారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా శిల్పా శెట్టిని కూడా లోనికి పంపించినప్పటికీ అటు కంటెస్టెంట్లతో పాటు ఇటు ప్రేక్షకులు కూడా ఆమెకు కనెక్ట్ అవలేదు. దీంతో ఆమె కూడా వచ్చినదారినే తిరుగుముఖం పట్టింది. ఇప్పటివరకు ఏ వైల్డ్ కార్డ్ కంటెస్టెంటు కూడా టైటిల్ గెలుచుకున్న దాఖలాలు లేవు. మరి ఈసారి వచ్చే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లైనా టైటిల్ కోసం పోరాడుతారా? వచ్చినదారినే వెళ్లిపోతారా? అసలు ప్రేక్షకులు వీరిని ఏమేరకు ఆదరిస్తారు అనేది చూడాల్సిందే. (చూడాలి: బిగ్‌బాస్ అనైతిక షో: నారాయణ) -
ఆడే సత్తా నాలో ఉంది: షరపోవా
బ్రిస్బేన్: మాజీ ప్రపంచ నంబర్‌వన్ మరియా షరపోవా తనలో ఇంకా టెన్నిస్ ఆడే సత్తా ఉందని చెప్పింది. ఈనెల 6 నుంచి బ్రిస్బేన్‌లో జరిగే ఈ టోర్నీలో మాజీ విజేత అయిన షరపోవాకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ రష్యా స్టార్ 2015లో ఇక్కడ టైటిల్ గెలిచింది. ఏటా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీకి ముందు సన్నాహక టోర్నీగా ఈ ఈవెంట్ జరుగుతుంది. ఇందులో పాల్గొంటానని చెప్పిన 32 ఏళ్ల షరపోవా కెరీర్ తొలినాళ్లలో 30 దాటాక కూడా ఆడతానని ఎప్పుడు అనుకోలేదని తెలిపింది. ‘కానీ నాలో ఆట మిగిలుంది. నా రాకెట్‌తో దూసుకెళ్లే సత్తా కూడా ఉంది. నేనిక్కడ ఎవరికైనా మేటి ప్రత్యర్థినే’ అని రష్యా స్టార్ వివరించింది. గత సీజన్ క్లిష్టంగా గడిచిన తనకు ఇది తాజా ఆరంభమని చెప్పుకొచ్చింది. ఆగస్టులో జరిగిన యూఎస్ ఓపెన్‌లో సెరెనాతో తొలి రౌండ్లో ఓడిపోయాక షరపోవా మళ్లీ బరిలోకి దిగలేదు. దీంతో డబ్ల్యూటీఏ ర్యాంకుల్లో ఆమె 133వ ర్యాంకుకు పడిపోయింది. బ్రిస్బేన్ ఈవెంట్లో ఆమెతో పాటు నయోమి ఒసాకా, యాష్లే బార్టీ, ప్లిస్కోవా, ఎలీనా స్వితొలినా, క్విటోవా, కికి బెర్టెన్స్ తదితర స్టార్ క్రీడాకారిణులు పాల్గొంటున్నారు. -
క్రికెట్లో దొంగాట...!
కడప స్పోర్ట్స్: క్రికెట్‌కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో తల్లిదండ్రుల బలహీనతలను క్రికెట్ అసోసియేషన్లు సొమ్ము చేసుకుంటున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సెలెక్షన్స్‌కు హాజరుకాకపోయినా వైల్డ్‌కార్డు ఎంట్రీగా నేరుగా మ్యాచ్‌ల్లో దించడంపై పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పారదర్శకంగా జట్లను ఎంపిక చేస్తున్నామని చెప్పుకుంటూ సెలెక్షన్ ట్రయల్స్‌కు పిలుస్తుంటారని, కానీ ఆయా కేటగిరీల్లో జిల్లా జట్లను ముందుగానే పేపర్‌పై రాసుకొని ఎంపిక చేస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇందుకు బలం చేకూరేలా తాజాగా కృష్ణా జిల్లా అండర్ –14 బాలుర క్రికెట్ జట్టులో 16 మందిని ప్రధాన జట్టుకు, మరో 5గురిని స్టాండ్‌బైగా ఎంపిక చేసినట్లు ఈ నెల 4వ తేదీన అధికారికంగా ప్రకటించి జట్టు ఎంపికకు సెలెక్షన్స్ ట్రయల్స్ నిర్వహించి అందులో నుంచి ప్రాబబుల్స్‌ను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ప్రాబబుల్స్‌ను నాలుగు జట్లుగా విభజించి సెలెక్షన్ మ్యాచ్‌లు కూడా నిర్వహించి తుదిజట్టును ఎంపిక చేసినట్లు సమాచారం. తాజాగా కడప నగరంలో నిర్వహిస్తున్న ఏసీఏ అండర్–14 బాలుర అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నీలో ఆడుతున్న కృష్ణా జిల్లా జట్టులో రెండు అక్షరాలు పేరుగల ఓ క్రీడాకారున్ని ఆడించడంపై విమర్శలు తలెత్తాయి. ఈ క్రీడాకారుడు సెలెక్షన్స్ ట్రయల్స్‌కు గానీ, మ్యాచ్‌లకు గాని హాజరుకాలేదు. కడపలో జరిగిన రెండు మ్యాచ్‌ల తర్వాత ఆ క్రీడాకారున్ని మూడో మ్యాచ్‌లో దించడంతో మిగిలిన జట్టు సభ్యులు, అలాగే వారి తల్లిదండ్రులు అవాక్కయ్యారు. 11 మంది ఆడే ఆటకు స్టాండ్‌బైతో కలిపి 21 మందిని ఎంపిక చేసినప్పుడు వాళ్లందర్నీ కాదని, సెలెక్షన్స్ ట్రయల్స్‌లో పాల్గొనని వారిని తీసుకొచ్చి ఆడించడం చర్చనీయాంశమైంది. ఈ 21 మందిలో ఎవరికి వారు తమకు కూడా అవకాశం వస్తుందనే ఆశతో ఉంటారు. అలాంటిది వారి ఆశలపై ఆదిలోనే చిన్న వయసులోనే నీళ్లు చల్లడం దుర్మార్గమని క్రీడాభిమానులు మండిపడుతున్నారు. సాక్షాత్తు బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్, బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఉన్న రాజధాని జిల్లాల నుంచే ఇటువంటి ఎంపికలు జరుగుతున్నప్పుడు మిగిలిన జిల్లాల పరిస్థితి వేరే చెప్పనక్కరలేదు. దీంతో పాటు ఓవర్ ఏజ్ క్రీడాకారులను సైతం తీసుకువచ్చి ఆడిస్తున్నారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. నైతికంగా ఏమేర కరెక్టో.. దేశీయ, అంతర్జాతీయస్థాయి మ్యాచ్‌లలో క్రీడాకారులు గాయాలపాలైనా.. లేదా కూర్పులో మార్పు అవసరమైనప్పుడు వారి స్థానంలో ఇతర క్రీడాకారులను రప్పించి ఆడటం మనందరికి తెలిసిందే. అయితే క్రికెట్‌కు పునాదిదశగా భావించే జోనల్‌స్థాయి అండర్–14 క్రికెట్ పోటీల్లో ఈస్థాయిలో ప్రత్యేకంగా అనుమతులు పొంది.. ఇక్కడికి రప్పించి ఆడించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. అసోసియేషన్ వారు ఎంపిక చేసిన స్టాండ్‌బై నుంచి తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ వాటన్నింటినీ పక్కన పెట్టి ఏసీఏ అనుమతి తీసుకుని ఆగమేఘాల మీద మ్యాచ్‌లో ఆడించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒక వేళ ఆ క్రీడాకారుడు రాష్ట్రస్థాయిలో రాణించిన ట్రాక్ రికార్డు ఉంటే ఆ క్రీడాకారుడి ఎంపికలకు రాకపోయినప్పటికీ సదరు క్రీడాకారుడు పేరును జట్టుతో పాటు ప్రకటించడం ఆనవాయితీ. అయితే అండర్–14 స్థాయి నుంచే అటువంటి సంప్రదాయాలన్నింటీ పక్కనపెట్టి ఆడించడం ఏమేర సబబో ఏసీఏ పెద్దలే ఆలోచించాలి. జట్టు అవసరాల దృష్ట్యా కూర్పులో భాగంగా క్రీడాకారులను ఆడించే అధికారం జిల్లా క్రికెట్ సంఘ కార్యదర్శులకు ఉన్నాయన్న ధైర్యమే వీరిని ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరించేలా చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కృష్ణా జిల్లా అసోసియేషన్‌నుంచి లేఖ వచ్చింది.. కృష్ణా జట్టు ఎంపికలు మా పరిధిలోవి కావు. కృష్ణా జిల్లా అసోసియేషన్ వారు రెండ్రోజుల క్రితం ఏసీఏ అనుమతితో క్రీడాకారున్ని జట్టులో చేర్చాలంటూ లేఖ రాశారు. దీంతో మ్యాచ్‌లకు మేము అనుమతించాం. ఈ విషయమై కృష్ణా జిల్లా కార్యదర్శితో మాట్లాడగా.. రెగ్యులర్ క్రీడాకారుడు కావడంతో ఏసీఏ అనుమతితో కడపలో జరిగే మ్యాచ్‌లకు పంపినట్లు తెలిపారు. అదే విధంగా ఓవర్‌ఏజ్ క్రీడాకారుల విషయంపై అన్ని జిల్లాల అసోసియేషన్లకు సమాచారం పంపించాం.– ఎం. వెంకటశివారెడ్డి, ఏసీఏఉపాధ్యక్షుడు, కడప -
బిగ్‌బాస్‌లో మరో ట్విస్ట్: హీరోయిన్ ఎంట్రీ!
బిగ్‌బాస్ షోలో నాని తన పిట్టకథలతో ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఎపిసోడ్ చివరలో ఆ పిట్టకథలకు నీతి చెప్పడం ఎంతగానో అలరిస్తోంది. అంతేకాక బిగ్‌బాస్ 2 భారీ అంచనాల మధ్య మొదలైంది. కాకపోతే, ఈ సీజన్‌పై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోందని సమాచారం. కాగా, ఫేమస్ సెలబ్రిటిస్ లేకపోవడంతో అంతగా ఆకట్టుకోవడం లేదనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. దీంతో బిగ్‌బాస్ టీం వైల్డ్‌కార్డు ఎంట్రీ ద్వారా ఓ హీరోయిన్ హౌజ్‌లోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైల్డ్‌కార్డు ద్వారా నందిని షోలోకి వచ్చిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ 2 హోస్ట్ నాని ఏమైనా జరగవచ్చు అని చెబుతున్నట్లే షోలో ప్రస్తుతం జరుగుతున్నాయి. ఏవరూ ఊహించని విధంగా శ్యామల ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం బయట మరో రూమర్ హల్చల్ చేస్తోంది. హీరో రాజ్‌తరుణ్ సరసన నటించిన భామ బిగ్‌బాస్ 2లోకి వైల్డ్‌కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. కూమారి 21ఎఫ్ చిత్రంలో నటించి అందరి మనసుల్ని గెలిచిన హీరోయిన్ హెబ్బా పటేల్‌ను బిగ్‌బాస్‌లోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. దీనికి ఆ భామ అంగీకరించిందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. కానీ, దీనిపై అధికారకంగా ఏ విధమైన సమాచారం లేదు. ఈ వారం ఎండింగ్లో దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రూమర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫస్ట్ సీజన్లో కేవలం సెలబ్రెటీలకు మాత్రమే షో యాజమాన్యం అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, లక్షల మందిలో నుంచి సామాన్యులైన సంజన, నూతన నాయుడు, గణేశ్‌లకు అవకాశం ఇచ్చారు. ఇప్పటికే షో నుంచి సంజన, నూతన నాయుడు, కిరిటీ దామరాజు, యాంకర్ శ్యామల ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం షోలో కొనసాగుతున్న గణేశ్ తనకు తాను సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీకేండ్ వరకూ వేచి చూడాల్సిందే. -
రోమ్ ఓపెన్‌లోనూ షరపోవాకు వైల్డ్ కార్డు...
రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాకు మరో టోర్నమెంట్లో వైల్డ్ కార్డు ఎంట్రీ లభించింది. ఇప్పటికే స్టుట్గార్ట్, మాడ్రిడ్ ఓపెన్ టోర్నీ నిర్వాహకులు షరపోవాకు వైల్డ్ కార్డు కేటాయించగా... తాజాగా రోమ్ ఓపెన్‌లోనూ ఆమెకు ఈ అవకాశం దక్కింది. నిషేధిత ఉత్ప్రేరకం మెల్డోనియం వాడినట్లు తేలడంతో 2016 జనవరిలో షరపోవాపై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) రెండేళ్లపాటు నిషేధం విధించింది. అయితే కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ జోక్యంతో ఈ రష్యా స్టార్ నిషేధాన్ని ఐటీఎఫ్ 15 నెలలకు కుదించింది. నిషేధం గడువు పూర్తయిన వెంటనే... ఏప్రిల్ 26న మొదలయ్యే స్టుట్గార్ట్ ఓపెన్‌లో షరపోవా పునరాగమనం చేయనుంది. ఆ తర్వాత మే 6 నుంచి 13 వరకు జరిగే మాడ్రిడ్ ఓపెన్‌లో, మే 15 నుంచి 21 వరకు జరిగే రోమ్ ఓపెన్‌లో ఆమె ఆడుతుంది. -
వైల్డ్‌కార్డ్ ఎంట్రీ!
మరాఠీ స్క్రిప్ట్ రైటర్‌కు బంపర్ ఆఫర్ తగిలినట్టుంది. బిగ్‌బాస్ 8లో అతడికి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ దక్కింది. అది కూడా అలా ఇలా కాదు... రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్‌తో కలసి నడుస్తూ..! ఇతగాడిని ఈ స్టారే పరిచయం చేస్తుందట. బిగ్ బాస్ హౌస్‌లో పాల్గొనేందుకు భారత్‌కు వస్తున్న కిమ్... తాను ఎంతో ఉత్సుకతకు లోనవుతున్నానని చెబుతోంది. ‘నమస్తే ఇండియా. నా పేరు కిమ్ కర్దాషియన్. భారత్‌కు వస్తున్నా’ అంటూ ఓ సందర్భంలో వ్యాఖ్యానించింది. ఆ క్రమంలోనే ఫైజల్‌ను ఆమె పరిచయం చేయబుతున్నట్టు సమాచారం.