వయసైపోయాక ఏ పనీ చేతకాక ఓ మూలన కూర్చోవాల్సిందే అని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పని నిరూపించింది గంగవ్వ. టాలెంట్ ఉంటే ఏ వయసులోనైనా రాణించవచ్చని నిరూపించింది. జగిత్యాల జిల్లా లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ ఒకప్పుడు దినసరి కూలీ. కానీ ఇప్పుడు తన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఆమె ఐదేళ్లకే పెళ్లి చేసుకుంది. కష్టాల నీడలోనే పెరిగిన మిల్కూరి గంగవ్వ మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ పరిచయమైంది. తన కట్టుబొట్టు, అమాయకత్వం, గడుసుతనం.. జనాలకు నచ్చేశాయి. బిగ్‌బాస్ నుంచి పిలుపు రావడంతో నాలుగో సీజన్‌లో అడుగుపెట్టింది.
స్వచ్ఛమైన పల్లెలో బతికిన మట్టిమనిషికి ఏసీలు పడలేదు. ఈ గోస నావల్ల కాదంటూ దండం పెట్టి బయటకు వచ్చేసింది. అయితే సొంతింటి కలను నెరవేర్చుకుంది. తర్వాత సినిమాల్లోనూ నటించింది. ఇప్పుడు మరోసారి ధైర్యం చేసి బిగ్‌బాస్ 8లోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఈసారి వెళ్లగొట్టేదాకా ఉంటానంటోంది. మరి హౌస్‌లో ఎన్ని వారాలు ఉంటుందో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment