ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న ఆశతో ఎంతోమందిలాగే ఇతడూ కృష్ణానగర్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. అవకాశాలు రాకపోయినా చిన్నచిన్న ప్రోగ్రాంలతో జీవితాన్ని గడిపాడు. అనుకోకుండా ఓ కామెడీ షోలో ఛాన్స్ రావడంతో అతడి దశ తిరిగిపోయింది. ఎనిమిదేళ్లలోనే టీం లీడర్‌గా ఎదిగాడు. చిన్నప్పటి నుంచే మిమిక్రీలు చేసే ఈ జగిత్యాలవాసికి బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో ఆఫర్ వచ్చింది. ఇదే విషయం కామెడీ షో నిర్వాహకులకు చెబితే.. ఇంకా రెండేళ్ల అగ్రిమెంట్ ఉందని, మధ్యలో వెళ్తే రూ.10 లక్షలు కట్టాలని హెచ్చరించారు.
అప్పటికే అమ్మ అనారోగ్యం, కొత్త ఇంటి లోన్ వల్ల పీకల్లోతు అప్పులో ఉన్నాడు. ఈ అప్పులు తీర్చడం కోసం ఆ ఫైన్ కట్టి మరీ బిగ్‌బాస్‌కు వెళ్లాడు. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన అవినాష్.. 12 వారాలు హౌస్‌లో ఉన్నాడు. ఎంటర్‌టైనర్ అని నిరూపించుకున్నాడు. బిగ్‌బాస్ ద్వారా అప్పులు తీర్చేసి మరింత ఎదిగాడు. ఇప్పుడు మరోసారి బిగ్‌బాస్ 8లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచి తానేంటో నిరూపించుకున్న అవినాష్ ఫినాలేలో ఐదో స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment