ఒకప్పుడు సీరియల్స్‌లో మెప్పించిన రోహిణి.. ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ రచ్చ చేస్తోంది. ముఖ్యంగా సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌లో పనిమనిషిగా నటించి తెగ నవ్వించింది. తన కామెడీ టైమింగ్స్‌తో అందరికీ వినోదాన్ని పంచింది. ఆ మధ్య కాలు సర్జరీ వల్ల కొన్ని నెలలపాటు తెరపై కనిపించలేదు. కానీ కోలుకున్న వెంటనే మళ్లీ స్క్రీన్‌పై ప్రత్యక్షమై నవ్వుల జల్లు కురిపించింది.
వైజాగ్‌లో పుట్టిన రోహిణి ప్రస్తుతం హైదరాబాద్‌లో సెటిలైంది. బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాల్గొన్న ఈ లేడీ కమెడియన్.. మరోసారీ ఈ రియాలిటీ షోలో అడుగుపెట్టింది. కాకపోతే ఈసారి షో ప్రారంభమైన నెల రోజులకు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. రోహిణి ఈసారైనా ఫినాలేలో అడుగుపెట్టాలని గట్టిగా ప్రయత్నించింది. ప్రతి గేమ్‌లోనూ అల్లాడించింది. కానీ నామినేషన్స్‌లోకి రాకుండా పోయింది. ఒకే ఒక్కసారి పద్నాలుగోవారంలో నామినేషన్స్‌లోకి రావడం.. అదే వారం డబుల్ ఎలిమినేషన్ ఉండటంతో రోహిణి ఎలిమినేట్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment