
డ్యాన్స్ అంటే పిచ్చి.. యాక్టింగ్ అంటే కూడా అంతే ఇష్టం. ఎప్పటికైనా స్క్రీన్‌పై కనిపించాలనే కోరిక.. అందుకోసం మెహబూబ్ చేయని ప్రయత్నం లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల సాఫ్ట్‌వేర్ కొలువులో చేరినా కళను వదిలేయలేకపోయాడు. వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్, టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.
అలా తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో అడుగుపెట్టిన మెహబూబ్ టాస్కుల్లో సత్తా చూపించాడు. కండబలం బాగానే ఉన్నా బుద్ధి బలం తక్కువగా ఉండటంతో ఫినాలే వరకు వెళ్లకుండానే వెనుదిరిగాడు. ఇప్పుడు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. కానీ దురదృష్టం తోడుగా రావడం వల్ల నాలుగో సీజన్‌లో దీపావళికి ఎలిమినేట్ అయినట్లే ఈసారీ అదే పండగకు బయటకు వచ్చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment