గౌతమ్ కృష్ణ.. బిగ్‌బాస్‌కు రావడానికి ముందు పలు సినిమాలు చేశాడు. కానీ జనాలకు సుపరిచితుడైంది మాత్రం బిగ్‌బాస్ ఏడో సీజన్‌తోనే! చిన్నప్పటినుంచే డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. కానీ పేరెంట్స్ కోరిక మేరకు డాక్టర్ అయ్యాడు. తన కోరికను చంపుకోలేక 2018లో దర్శకత్వంలో శిక్షణ పొందాడు. ఆ మరుసటి ఏడాది ఆకాశవీధుల్లో సినిమాకు సొంతంగా కథ రాసుకుని తనే డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించాడు.
బాలీవుడ్‌లోనూ సిద్దూ: ది రాక్‌స్టార్ సినిమా చేశాడు. సినిమాలపైనే ఫోకస్ పెట్టిన ఈ డాక్టర్ బాబు గత సీజన్‌లో సీక్రెట్ రూమ్‌కు వెళ్లి మరీ హౌస్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. అశ్వత్థామ 2.0 అంటూ భారీ డైలాగులతో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఫినాలే వరకు రాలేక మధ్యలోనే మళ్లీ ఎలిమినేట్ అయ్యాడు. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ వైల్డ్‌ఫైర్‌లా మారిపోయి ఏకంగా ఫినాలేలో చోటు దక్కించుకున్నాడు. గెలుపుకు అడుగు దూరంలో ఆగిపోయి రన్నరప్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment