
నయని పావని.. ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అసలు పేరు సాయిరాజు పావని. టిక్‌టాక్ స్టార్‌గా ఫేమస్. ఎంత ఘాటు ప్రేమ, సమయం లేదు మిత్రమా, పెళ్లి చూపులు 2.0, బబ్లూ వర్సెస్ సుబ్బులు కేరాఫ్ అనకాపల్లి వంటి పలు షార్ట్ ఫిలింస్‌లో నటించింది. కవర్ సాంగ్స్, చిత్తం మహారాణి, సూర్యకాంతం వంటి చిత్రాల్లోనూ కనువిందు చేసిన ఈ బ్యూటీ బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది.
హౌస్‌కు వెళ్లగానే అందరితో ఇట్టే కలిసిపోయింది. కానీ దురదృష్టం కొద్దీ వారానికే ఎలిమినేట్ అయిపోయింది. హౌస్ నుంచి వచ్చాక అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు, ఇప్పుడు బయటకు వచ్చేసినా నెక్స్ట్ సీజన్‌లో రావడం పక్కా అనుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే ఈ సీజన్‌లో అడుగుపెట్టింది. కాకపోతే మరోసారి వైల్డ్‌కార్డ్ ద్వారానే ఎంట్రీ ఇచ్చింది. ఈసారి నెలరోజులు హౌస్‌లో ఉండి తొమ్మిదోవారం ఎలిమినేట్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment