సండే అంటే ఫన్‌డే.. ఆటలు, పాటలు, డ్యాన్సులు.. మొత్తం ఇవే ఉంటాయి. ఇలాంటి ఫన్ గేమ్‌తోనే ఎపిసోడ్ మొదలైంది. అంతకంటే ముందు గౌతమ్‌ను సేవ్ చేశాడు. తర్వాత ఏం జరిగిందో నేటి (నవంబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..
విష్ణుప్రియ టీమ్ గెలుపు
నిఖిల్, రోహిణి, ప్రేరణ, నయని పావని, విష్ణుప్రియ, తేజను టీమ్ 'A'గా మిగతావాళ్లందరినీ టీమ్ 'B'గా విభజించారు. ఈ గేమ్‌లో భాగంగా ఒక చీటీ తీసి అందులో ఇంగ్లీష్‌లో రాసి ఉన్న వాక్యాలు చదివి తెలుగులో పాటను గెస్ చేయాలి. చిన్నపిల్లలు కూడా ఆడగలిగేలా సింపుల్‌గా ఉన్న ఈ గేమ్‌లో విష్ణుప్రియ టీమ్ గెలిచింది. తర్వాత యష్మి సేవ్ అయినట్లు ప్రకటించాడు.
నిఖిల్ వెంటే గెలుపు
అనంతరం అందరూ పక్షుల్లా మారిపోయారు. ఆకాశం, సముద్రం, పర్వతాలు.. వీటిలో నాగ్ ఏ పేరు చెప్తే ఆ పేరు రాసున్న బోర్డ్‌పై కంటెస్టెంట్లు నిలబడాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో కూడా నిఖిలే ఆఖరివరకు చేరుకుని గెలిచాడు. అలాగే లక్ష రూపాయలు ప్రైజ్‌మనీలో యాడ్ చేయడంతో విన్నింగ్ ప్రైజ్‌మనీ రూ.42,16,000కు చేరింది.
జ్యూస్‌లకు మారు పేర్లు
తర్వాత కొన్ని జ్యూస్‌లకు స్వార్థం, కోపిష్టి, ఫేక్.. ఇలా పలురకాల పేర్లు ఇచ్చారు. అవి ఎవరికి సూట్ అవుతాయో వారితో ఆ జ్యూస్ తాగించాలన్నాడు. మొదటగా గౌతమ్.. ఆనియన్ (నకిలీ), టమాటో (స్వార్థం) జ్యూస్‌ను యష్మీకి ఇచ్చాడు. రోహిణి.. కీరా దోస(బాధ్యతారాహిత్యం), చిల్లీ (కోపిష్టి) జ్యూస్‌ను గౌతమ్‌కు ఇచ్చింది. విష్ణుప్రియ.. చిల్లీ, లెమన్ (నోటిదురుసు) జ్యూస్‌ను ప్రేరణకు ఇచ్చింది.
ఆమెకు నోటిదురుసు ఎక్కువ
హరితేజ.. చిల్లీ, ఆమ్ల జ్యూస్‌ను నిఖిల్‌తో తాగిపించింది. పృథ్వీ.. ప్రేరణకు జ్యూస్ ఇస్తూ తనకు నోటిదురుసు ఉందని, కోపిష్టి అన్నాడు. అవినాష్.. గౌతమ్‌కు నోటిదురుసు, బాధ్యతారాహిత్యం ఉందంటూ అతడితో లెమన్, కీరా జ్యూస్ తాగిపించాడు. తేజ.. ప్రేరణకు నోటిదురుసు, మందబుద్ధి ఉందన్నాడు. నబీల్.. అవినాష్ డంబ్ అండ్ టాక్సిక్ అన్నాడు. ప్రేరణ వంతు రాగా.. హరితేజ ఫేక్ అంటూ ఆనియన్, ఆమ్లా జ్యూస్ తాగిపించింది.
ఎక్కువ జ్యూస్‌లు ఎవరికంటే?
యష్మి.. గౌతమ్ ఫేక్ అంటూ ఆనియన్ జ్యూస్ ఇచ్చింది. గంగవ్వ.. రోహిణికి మందబుధ్ది, నోటిదురుసు ఉందని తెలిపింది. నయని కూడా ప్రేరణకు కోపమెక్కువ అంటూ నిమ్మ, మిర్చి జ్యూస్ కలిపిచ్చింది. నిఖిల్.. గౌతమ్ బాధ్యతారాహిత్యంగా ఉంటాడంటూ అతడికి లెమన్, కీర జ్యూస్ కలిపిచ్చాడు. అలా ప్రేరణ, గౌతమ్ అందరికంటే ఎక్కువ జ్యూస్‌లు తాగారు.
నయని ఎలిమినేట్
తర్వాత నాగ్ హరితేజను సేవ్ చేసి నయని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. ప్రతిదానికి కన్నీళ్లు పెట్టుకునే నయని ఈసారి తన దుఃఖాన్ని దిగమింగుకుని నవ్వుతూ అందరి దగ్గర వీడ్కోలు తీసుకోవడం విశేషం. స్టేజీపైకి వచ్చాక .. గంగవ్వ, రోహిణి, ప్రేరణ, గౌతమ్, విష్ణును డమ్మీ ప్లేయర్స్ అంది. హరితేజ, నిఖిల్, పృథ్వీ బెస్ట్ ప్లేయర్స్ అని కితాబిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment