
బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారు? ఇంకెవరు నయని పావని అని సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం జరుగుతోంది. అది నిజమేనని కన్ఫామ్ చేసేశాడు కింగ్ నాగార్జున. బిగ్‌బాస్ రిలీజ్ చేసిన ప్రోమోలో నాగ్.. నయని, యూ ఆర్ ఎలిమినేట్ అనేశాడు.
లీక్ చేసిన నాగ్
సరిగ్గా 1 నిమిషం 17 సెకన్ల వద్ద ఈ మాటన్నాడు. ఇది చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. నయని ఎలిమినేట్ అని నాగ్ సారే చెప్పేశారు, ఎలాగో ఈ వార్త లీకైపోయిందని లైట్ తీసుకున్నారా? ఎడిటర్ మరీ ఇంత ఘోర తప్పిదం ఎలా చేశాడబ్బా?, ఏదైనా గేమ్‌లో నయని ఎలిమినేట్ అయి ఉండవచ్చు.. బహుశా అందుకే అలా చెప్పాడేమో? అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఎలా ఓదారుస్తారో?
ఈ ఎలిమినేషన్ లీక్స్ వల్ల ఉత్కంఠ లేకుండా పోయింది. ఇకపోతే సాధారణంగానే ఏడ్చే నయని ఎలిమినేట్ అయినందుకు ఇంకెంత ఏడుస్తుందో! ఆమెను అటు హౌస్‌మేట్స్, ఇటు నాగ్ ఎలా ఓదారుస్తారో, తన కన్నీటికి ఆనకట్ట ఎలా కడతారో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment