
బిగ్‌బాస్ షో తమకు జీవితంలో వచ్చిన పెద్ద అవకాశం అని చాలామంది కంటెస్టెంట్లు చెప్తూ ఉంటారు. ప్రేక్షకులకు తమను దగ్గర చేసిన బిగ్‌బాస్ షోకు ఎప్పటికీ రుణపడి ఉంటామంటుంటారు. అయితే కొందరు మాత్రం ఈ రియాలిటీ షో వల్ల నెగెటివిటీ మూటగట్టుకున్నామని తిట్టిపోస్తుంటారు. ఇదంతా పక్కన పెడితే నేడు బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ గ్రాండ్ ఫినాలే.

నెగెటివిటీ మూటగట్టుకున్న హరితేజ
అంటే ఈ సీజన్ విజేతను తేల్చే ఆఖరి రోజు. ఇలాంటి పెద్ద ఈవెంట్‌కు ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ వస్తారు. అదేంటో కానీ ఈసారి ఏకంగా ముగ్గురు డుమ్మా కొట్టేశారు. వారే విష్ణుప్రియ, నయని పావని, హరితేజ. విచిత్రంగా సీజన్ 1లో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన హరితేజ ఈ సీజన్‌లో మాత్రం వైల్డ్‌కార్డ్‌గా అడుగుపెట్టి నెలరోజులకే బయటకు వచ్చేసింది. విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకుంది. బహుశా అందుకే గ్రాండ్ ఫినాలేను లైట్ తీసుకుని ఉండవచ్చు!

నిరూపించుకోలేకపోయిన నయని
అటు నయని పావని.. ఏడో సీజన్‌లో వైల్డ్‌కార్డ్‌గా వచ్చి వారం రోజులకే ఎలిమినేట్ అయిపోయింది. ఈ సీజన్‌లో తన సత్తా చూపించాలనుకున్నప్పటికీ అన్నింటికీ ఏడ్చేస్తూ మూడువారాలకే హౌస్ నుంచి వచ్చేసింది. బహుశా ఈ బాధతోనే తను రాకపోయి ఉండొచ్చు. ఇక విష్ణుప్రియ.. విన్నర్ అయ్యేంత దమ్మున్నా ఆటపై ఫోకస్ పెట్టకుండా పృథ్వీపై మనసు పారేసుకుంది.

గౌతమ్‌పై విష్ణు చిన్నచూపు
అతడు ఛీ కొట్టినా, చులకనగా చూసినా అతడు మాత్రమే కావాలంటూ పిచ్చిగా ప్రవర్తించింది. మనసులోని భావాలను నిర్మొహమాటంగా వ్యక్తపరిచిన ఆమె నిజాయితీ మెచ్చిన జనాలు ఆమెను దాదాపు 100 రోజులు హౌస్‌లో ఉండనిచ్చారు. అయితే గౌతమ్‌పై మొదటి నుంచీ ద్వేషం పెంచుకున్న ఆమె షో నుంచి వెళ్లేటప్పుడు కూడా అతడిని అవమానించింది.
ఆ కారణం వల్లే?
అసలు నువ్వేం ఆడావో చూస్తానంటూ గడ్డిపోచలా తీసిపారేసింది. కానీ ఇప్పుడేకంగా అతడు టైటిల్ రేసులో ఉన్నాడు. ఆ దృశ్యం చూడలేకే విష్ణు రాలేదని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. మరికొందరేమో తనపై వచ్చిన నెగెటివిటీ తట్టుకోలేకే ఈ ఈవెంట్‌కు డుమ్మా కొట్టి ఉండొచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment