బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ అంతా అన్‌లిమిటెడ్ ఫుడ్ కావాలన్నాడు నబీల్. అయితే ఇది గొంతెమ్మ కోరికగా భావించిన బిగ్‌బాస్ ఈ వారం మాత్రమే కావాల్సినంత ఫుడ్ ఇస్తానన్నాడు. కానీ ఓ తిరకాసు పెట్టాడు. అదేంటో తెలియాలంటే నేటి (అక్టోబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..
నా జీవితంలో జరిగిన ఘోరం
విష్ణుప్రియ తన మనసులోని బాధను చెప్పడంతో గంగవ్వ ఎమోషనలైంది. అమ్మకు ఇష్టం లేదని చిన్నప్పటినుంచి నాన్నతో మాట్లాడేవాళ్లం కాదు. నాన్నపై ఎంత ప్రేమ ఉన్నా, అమ్మ కోసం ఆయనతో మాట్లాడలేదు. చిన్నప్పుడే అమ్మానాన్న విడిపోయారు.. అది నా జీవితంలో జరిగిన ఘోరం.. ఇది ఎవరికీ జరగకూడదు. అమ్మ చనిపోయాక ఇప్పుడిప్పుడే తనతో మాట్లాడుతున్నాం అని చెప్పింది. ఇది విని గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది.
హౌస్‌మేట్స్ కోసం నబీల్ త్యాగం
ఇకపోతే ఇన్ఫినిటీ రూమ్‌లో నబీల్ అన్‌లిమిటెడ్ ఫుడ్ కావాలన్న సంగతి తెలిసిందేగా! దాని గురించి బిగ్‌బాస్ ప్రస్తావిస్తూ.. ఇంట్లో ఉన్నంతకాలం నబీల్ స్వీట్లు, కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు త్యాగం చేస్తే ఈ ఒక్క వారం అన్‌లిమిటెడ్ రేషన్ లభిస్తుందన్నాడు. ఇంటిసభ్యులందరికోసం ఆ కండీషన్‌కు నబీల్ ఓకే చెప్పాడు. దీంతో మెహబూబ్.. సూపర్ మార్కెట్‌లో ఉన్న రేషన్ అంతా ఊడ్చేశాడు.
బంగారం ఇస్తానన్న మణికంఠ
తర్వాత నాగమణికంఠ.. తాను నామినేషన్స్‌లో నుంచి సేవ్ అయితే గంగవ్వకు బంగారు ముక్కుపుడక ఇస్తానన్నాడు. సేవ్ అయిన ప్రతివారం అరతులం ఇస్తానంటూ గంగవ్వ మీద ఒట్టేశాడు. మరి నాకేం ఇస్తావని రోహిణి అనగా ఒక ముద్దిస్తానన్నాడు. ఇక అవినాష్-రోహిణి నామినేషన్స్‌ను రీక్రియేట్ చేసి నవ్వించారు. వీరి పర్ఫామెన్స్ మెచ్చిన బిగ్‌బాస్ కిచెన్‌లో మరో రెండు గంటలు ఎక్కువ సేపు వంటచేసుకునే ఛాన్సిచ్చాడు.
మెగా చీఫ్ కంటెండర్‌గా గంగవ్వ
అనంతరం రాయల్ టీమ్ గెలుపొందిన మెగా చీఫ్ కంటెండర్ షీల్డ్‌ను గంగవ్వకిచ్చారు. బిగ్‌బాస్.. రాయల్ టీమ్‌ను ఓవర్ స్టార్ట్‌ఫోన్లుగా, ఓజీ టీమ్‌ను ఓవర్ స్మార్ట్ చార్జర్లుగా విభజించారు. హౌస్ అంతా రాయల్ టీమ్ ఆధీనంలో, గార్డెన్ ఏరియా ఓజీ టీమ్ ఆధీనంలో ఉంటుందన్నాడు. కిచెన్, బెడ్‌రూమ్, వాష్‌రూమ్ వంటి వసతులు అందిస్తూ చార్జింగ్ పొందవచ్చని తెలిపాడు.
బెంబేలెత్తిపోయిన మణికంఠ
టాస్క్ పూర్తయ్యేలోపు బతికున్న సభ్యులే మెగాచీఫ్ కంటెండర్లవుతారన్నాడు. టాస్క్ ప్రారంభానికి ముందే మణి బెంబేలెత్తిపోయాడు. నాకంటూ ఫ్యామిలీ ఉంది. బొక్కలిరగ్గొట్టుకుని బయటకు వెళ్లలేను. ఆరోగ్యం ముఖ్యం.. టీమ్‌కు ఎంతవరకు సపోర్ట్ ఇవ్వాలో అంతే ఇస్తానని చెప్పాడు. ఆట మొదలవగానే అవినాష్.. నబీల్‌కు తెలియకుండా అతడి చార్జర్‌ను తన ప్లగ్‌కు కనెక్ట్ చేశాడు.
హరికథ చెప్పి చార్జింగ్
హరితేజ.. హరికథతో మణికంఠను మెప్పించి అతడి దగ్గర నిమిషం పాటు చార్జింగ్ పొందింది. నయని కూడా యష్మి దగ్గర బలవంతంగా చార్జ్ పొందడానికి ట్రై చేసింది. కానీ నిఖిల్ ఆమెను అడ్డుకుని అవతలకు విసిరేయడంతో కన్నీళ్లు పెట్టుకుంది. అలా నేటి ఎపిసోడ్ ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment