
నామినేషన్స్.. ఈసారి అన్నీ రివేంజ్ నామినేషన్సే పడ్డాయి. ప్రైజ్‌మనీ తగ్గినా తనకేం పర్వాలేదన్నట్లు ప్రవర్తించాడు నబీల్. ఇంతకీ నామినేషన్స్‌కు, ప్రైజ్‌మనీకి ఏం సంబంధం? ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే నేటి (అక్టోబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..
నామినేషన్స్ షురూ
ఇంట్లో ఉండేందుకు అర్హత లేని ఇద్దరు ఇంటిసభ్యుల దిష్టిబొమ్మలపై కుండ పెట్టి పగలగొట్టాలని బిగ్‌బాస్ చెప్పాడు. నామినేషన్ షీల్డ్ ఎవరిదగ్గరైతే ఉంటుందో వారిని నామినేట్ చేసినప్పుడల్లా ప్రైజ్‌మనీలో నుంచి రూ.50 వేలు పోతాయని హెచ్చరించాడు. మెగా చీఫ్ గౌతమ్.. ఈ నామినేషన్ షీల్డ్‌ను హరితేజకు ఇచ్చాడు.

పృథ్వీ మీద ప్రేమతో..
పోయినవారం తేజకు బదులుగా పృథ్వీని నామినేట్ చేయడం నచ్చలేదని పరోక్షంగా చెప్తూ ప్రేరణను నామినేట్ చేసింది విష్ణు. గేమ్ స్లో అయిపోతుందంటూ, లైటర్ కోసం పాయింట్ ఇవ్వడం నచ్చలేదని నిఖిల్ దిష్టిబొమ్మపై కుండ పగలగొట్టింది. అలాగైతే నువ్వు అందరికంటే ముందు బ్రేక్‌ఫాస్ట్ చేసి పాయింట్ ఇచ్చేశావ్‌గా అని నిఖిల్ అనడంతో విష్ణు నీళ్లు నమిలింది. తర్వాత రోహిణి.. ఆటలో ఫిజికల్ అవడం నచ్చలేదని నిఖిల్‌ను నామినేట్ చేసింది. సెల్ఫిష్‌గా ఆలోచిస్తావ్, గేమ్‌లో అగ్రెసివ్ అవుతున్నావంటూ పృథ్వీని నామినేట్ చేసింది.

బాడీ షేమింగ్
పృథ్వీ.. పోయినవారం కిల్లర్ గర్ల్‌గా తనను నామినేట్ చేసినందుకు ప్రేరణ కుండ పగలగొట్టి తనపై ప్రతీకారం తీర్చుకున్నాడు. టాస్క్‌లో వీక్, ఆటలో జీరో.. నీకు రన్నింగ్ కూడా రావాలి, అది అంత ఈజీ కాదు అని రోహిణిని పై నుంచి కింది వరకు చూశాడు. తనను బాడీ షేమింగ్ చేయడంతో రోహిణికి చిర్రెత్తుకొచ్చింది. ఆ చూపేంటి? బాడీ షేమింగా? ఓవరాక్షన్ చేయకు.. తొక్కలో నామినేషన్స్ చేయకు అని ఇచ్చిపడేసింది.

సెల్ఫిష్ గేమ్
నయని పావని.. బ్యాటరీ టాస్కులో సెల్ఫిష్‌గా ఆడారంటూ మెహబూబ్, నిఖిల్‌ను నామినేట్ చేసింది. హరితేజ వంతురాగా.. ప్రేరణను నామినేట్ చేస్తూ కొంపలు మునిగాక రావడం మానేయమని సలహా ఇచ్చింది. సెల్ఫిష్‌గా ఆడావంటూ మెహబూబ్‌ను నామినేట్ చేసింది.

ప్రైజ్‌మనీ తగ్గినా పర్లేదంటూ..
నబీల్.. నన్ను ఇమ్మెచ్యూర్ అనడం నచ్చలేదు, అలాగే వేరేవాళ్ల పనుల్లో దూరకు అంటూ ప్రేరణ దిష్టిబొమ్మపై కుండ పగలగొట్టాడు. ప్రైజ్‌మనీలో నుంచి రూ.50 వేలు పోయినా పర్లేదంటూ హరితేజను నామినేట్ చేశాడు. మీకు డెసిషన్ తీసుకోవడం రావట్లేదు. అలాగే నాకు ఇంట్లో ఉండేందుకు అర్హత లేదని నా సూట్‌కేస్ బయటపెట్టడం నచ్చలేదని కుండ పగలగొట్టాడు.





Comments
Please login to add a commentAdd a comment