
విష్ణుప్రియ- రోహిణి, గౌతమ్-పృథ్వీల గొడవలు పరిష్కరించడానికి నాగార్జున తలప్రాణం తోకకొచ్చింది. గేమ్‌లో మిమ్మల్ని వెనక్కు లాగుతుందెవరు? అన్నప్పుడు గౌతమ్, నిఖిల్ పేర్లే ఎక్కువమంది చెప్పడం గమనార్హం. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..

క్యారెక్టర్‌లెస్ అనలేదుగా: విష్ణు
నువ్వు జీరో, నీకు అర్హత లేదు.. అని నానామాటలన్నవారికి నీ విజయంతోనే సమాదానం చెప్పావంటూ నాగార్జున.. మెగా చీఫ్ రోహిణిని మెచ్చుకున్నాడు. ఆ వెంటనే రోహిణి, విష్ణును కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి వీళ్లిద్దరి గొడవకు సంబంధించిన వీడియో క్లిప్ చూపించాడు. క్యారెక్టర్ అని తన వ్యక్తిత్వం గురించి అన్నానే తప్ప క్యారెక్టర్‌లెస్ అనలేదంది విష్ణు. దీనికి నాగ్.. ఆ పదం వాడినప్పుడే నీ క్యారెక్టర్ కనిపించిందన్నాడు.

నిఖిల్‌కు ట్రై చేశా అనలేదు
నిఖిల్‌కు ట్రై చేశా వర్కవుట్ కాలేదు.. తర్వాత పృథ్వీకి ట్రై చేశా.. అని విష్ణు నిజంగానే అందా? అని రోహిణిని అడిగాడు. అందుకామె అవునని తలూపింది. అదే తన ప్లానా? అంటే కాదని చెప్పింది. దీనిపై విష్ణు స్పందిస్తూ.. నిఖిల్, నేను కలిసి బయట ఓ షో చేశాం. తన పర్సనాలిటీ అంటే ఇష్టమని చెప్పానే తప్ప ట్రై చేశాననలేదు అని క్లారిటీ ఇచ్చింది. ఏ ప్లాన్ వర్కవుట్ అయిందని విష్ణు హౌస్‌లో ఉంటోందన్నావని రోహిణిని అడగ్గా.. పృథ్వీతో లవ్ ట్రాక్ వల్లే ఆమె హౌస్‌లో ఉంటుందనిపిస్తోందని రోహిణి అభిప్రాయపడింది. తర్వాత ఇద్దరూ క్షమాపణలు చెప్పుకున్నారు.

గ్రూప్ గేమ్ ఆడితే తప్పేంటన్న నాగ్
పృథ్వీ, గౌతమ్ గొడవ గురించి నాగ్ చర్చించాడు. వైల్డ్‌కార్డ్స్‌ను పంపించేయాలని గ్రూప్ గేమ్ ఆడారని గౌతమ్ చెప్పగా.. అందులో తప్పేముందన్నాడు నాగ్. నా ఉద్దేశంలో తప్పేనంటూ హోస్ట్‌పైకే తిరగబడ్డాడు గౌతమ్. పెద్ద తప్పు చేసినవారినే నామినేట్ చేయాలే తప్ప వైల్డ్ కార్డ్ అన్న కారణంతో నామినేట్ చేయడం ముమ్మాటికీ తప్పేనని వాదించాడు. ఇంతలో పృథ్వీ.. అతడు ఇండివిడ్యువల్ ప్లేయర్ అని నిరూపించుకోవడానికి మమ్మల్ని బ్యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు.

నోర్మూయ్.. నాగ్ సీరియస్
ఆట అయిపోయాక కెమెరాలతో మాట్లాడతావు, నీ ఆట ఎవరూ నొక్కలేరు అని నాగార్జున గౌతమ్‌పై సెటైర్లు వేశాడు. అప్పటికీ గౌతమ్ మాట్లాడుతూనే ఉండటంతో బీపీ తెచ్చుకున్న నాగ్.. నోర్మూయ్, నేను మాట్లాడేటప్పుడు మధ్యలోకి రాకు అని తిట్టిపోశాడు. మనిషి పైపైకి వెళ్లడం తప్పని పృథ్వీని సైతం హెచ్చరించాడు. అనంతరం హౌస్‌మేట్స్‌తో ఓ గేమ్ ఆడించాడు.

నిచ్చెన- పాము
ఆటలో మిమ్మల్ని ముందుకు తోస్తున్నదెవరు?(నిచ్చెన), వెనక్కు లాగుతుందెవరు?(పాము) చెప్పాలన్నాడు. రోహిణి.. అవినాష్ నిచ్చెన అని, పృథ్వీ పాము అని పేర్కొంది. అవినాష్.. తేజ నిచ్చెన, పృథ్వీ పాము అని తెలిపాడు. నబీల్.. పృథ్వీ నిచ్చెన, నిఖిల్ పాము అని పేర్కొన్నాడు. పృథ్వీ.. నబీల్ నిచ్చెన, గౌతమ్ పాము అన్నాడు. గౌతమ్.. రోహిణి నిచ్చెన, నిఖిల్ పాము అని చెప్పాడు.

రెండు పాములు
నిఖిల్.. పృథ్వీ నిచ్చెన, గౌతమ్ పాము అంది. యష్మి.. ప్రేరణ నిచ్చెన, నిఖిల్ పాము అని తెలిపింది. తేజ.. అవినాష్ నిచ్చెన, విష్ణుప్రియ పాము అన్నాడు. విష్ణుప్రియ వంతురాగా పృథ్వీ వల్లే తనకు ఆక్సిజన్, కార్బండయాక్సైడ్ అందుతున్నాయంటూ.. చివరకు నబీల్‌కు నిచ్చెన ఇచ్చింది. రోహిణికి పాము ఇచ్చేసింది. ప్రేరణ.. రోహిణి నిచ్చెన, గౌతమ్ పాము అని పేర్కొంది. నిఖిల్, గౌతమ్‌కు పాముగా సమాన ఓట్లు పడ్డాయని, వీరిలో ఒకరిపై బిగ్‌బాంబ్ పడబోతుందన్నాడు నాగ్. నిఖిల్‌ను సేవ్ చేయడంతో నేటి ఎపిసోడ్ పూర్తయింది.





Comments
Please login to add a commentAdd a comment