Bigg Boss 8: ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఎవరో గుర్తుపట్టారా? | Bigg Boss 8 Telugu First Wild Card Entry Details | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Wild Card: వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. హంగామా మొదలు

Published Tue, Oct 1 2024 6:23 PM | Last Updated on Tue, Oct 1 2024 7:01 PM

Bigg Boss 8 Telugu First Wild Card Entry Details

బిగ్‌బాస్ 8 మరీ చప్పగా సాగుతోంది. రీసెంట్‌గా సోనియా ఎలిమినేట్ అయిపోయింది. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ఇప్పటికే బాంబు పేల్చారు. అందుకు తగ్గట్లే ఈసారి నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది సస్పెన్స్‌గా మారింది.

మరోవైపు గత కొన్నిరోజుల నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి సోషల్ మీడియాలో తెగ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్లే ఇప్పుడు తొలి కంటెస్టెంట్ ఎవరో చెప్పుకోండి చూద్దాం అని నిర్వహకులు నీడతో ఉన్న ఫొటోని రిలీజ్ చేశారు. అయితే ఇది గత సీజన్‌లో పాల్గొన్న టేస్టీ తేజనే అని కామెంట్స్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: అంబటి రాయుడిని అప్పట్లో నెక్ట్స్ సచిన్ అన్నారు: హీరో శ్రీ విష్ణు)

తేజతో పాటు ముక్కు అవినాష్, హరితేజ, రోహిణి, యాంకర్ రవి, నయని పావని.. ఇలా పలువురు పేర్లయితే వినిపిస్తున్నాయి. వీళ్లలో ఎవరు వస్తారనేది ఈ వీకెండ్ లేదంటే వచ్చే వీకెండ్ కల్లా తెలిసిపోతుంది.

మంగళవారం ఎపిసోడ్‌లో 'జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు' అనే టాస్క్ పెట్టారు. ఇందుకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. తొలుత ఈ టాస్క్‌ ఎవరు ఆడాలి? అనే విషయమై కాంతార క్లాన్‌లో చాలా డిస్కషన్ నడిచింది. నామినేషన్స్‌లో ఉన్నామని చెప్పి నైనిక రిక్వెస్ట్ చేసింది.  ప్రేరణకు ఆరోగ్యం బాలేదని, సీత చీఫ్ కాబట్టి సేఫ్ అని, చివరికి మణికంఠను ఈ టాస్క్‌లో నిలబెట్టారు. మరోవైపు యష్మి కూడా పోటీ పడింది. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచారు? చివరకు ఏమైందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాలి.

(ఇదీ చదవండి: నాలుగో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి.. డేట్ ఫిక్స్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement