బిగ్‌బాస్‌లో మరో ట్విస్ట్‌: హీరోయిన్‌ ఎంట్రీ! | Heroine Hebah Patel Wild card Entry In Bigg Boss 2? | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 12 2018 6:11 PM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Heroine Hebah Patel Wild card Entry In Bigg Boss 2? - Sakshi

బిగ్‌బాస్‌ షోలో నాని తన పిట్టకథలతో ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఎపిసోడ్‌ చివరలో ఆ పిట్టకథలకు నీతి చెప్పడం ఎంతగానో అలరిస్తోంది. అంతేకాక బిగ్‌బాస్‌ 2 భారీ అంచనాల మధ్య మొదలైంది. 
కాకపోతే, ఈ సీజన్‌పై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోందని సమాచారం. కాగా, ఫేమస్‌ సెలబ్రిటిస్‌ లేకపోవడంతో అంతగా ఆకట్టుకోవడం లేదనే రూమర్స్‌ కూడా వినిపిస్తున్నాయి. దీంతో బిగ్‌బాస్‌ టీం వైల్డ్‌కార్డు ఎంట్రీ ద్వారా ఓ హీరోయిన్‌ హౌజ్‌లోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైల్డ్‌కార్డు ద్వారా నందిని షోలోకి వచ్చిన విషయం తెలిసిందే.

బిగ్‌ బాస్‌ 2 హోస్ట్‌ నాని ఏమైనా జరగవచ్చు అని చెబుతున్నట్లే షోలో ప్రస్తుతం జరుగుతున్నాయి. ఏవరూ ఊహించని విధంగా శ్యామల ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం బయట మరో రూమర్‌ హల్‌చల్‌ చేస్తోంది. హీరో రాజ్‌తరుణ్‌ సరసన నటించిన భామ బిగ్‌బాస్‌ 2లోకి వైల్డ్‌కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. కూమారి 21ఎఫ్‌ చిత్రంలో నటించి అందరి మనసుల్ని గెలిచిన హీరోయిన్‌ హెబ్బా పటేల్‌ను బిగ్‌బాస్‌లోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. దీనికి ఆ భామ అంగీకరించిందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. కానీ, దీనిపై అధికారకంగా ఏ విధమైన సమాచారం లేదు. ఈ వారం ఎండింగ్‌లో దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రూమర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఫస్ట్‌ సీజన్‌లో కేవలం సెలబ్రెటీలకు మాత్రమే షో యాజమాన్యం అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, లక్షల మందిలో నుంచి సామాన్యులైన సంజన, నూతన నాయుడు, గణేశ్‌లకు అవకాశం ఇచ్చారు. ఇప్పటికే షో నుంచి సంజన, నూతన నాయుడు, కిరిటీ దామరాజు, యాంకర్‌ శ్యామల ఎలిమినేట్‌ అయ్యారు. ప్రస్తుతం షోలో కొనసాగుతున్న గణేశ్‌ తనకు తాను సెల్ఫ్‌ నామినేట్‌ ​చేసుకున్నాడు. ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీకేండ్‌ వరకూ వేచి చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement