Bigg Boss 6 Telugu: Sudigali Sudheer To Enter As Wild Card Contestant, Details Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌ 6లోకి సుడిగాలి సుధీర్‌? వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో హౌజ్‌లో హంగామా!

Published Mon, Oct 3 2022 3:38 PM | Last Updated on Mon, Oct 3 2022 4:13 PM

Bigg Boss 6 Telugu: Sudigali Sudheer to Enter as Wild Card contestant - Sakshi

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ ప్రస్తుతం 6వ సీజన్‌ను జరుపుకుంటోంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్‌కు ప్రేక్షకాదరణ కాస్తా దగ్గిందననే చెప్పొచ్చు.  ఆడియన్స్‌కి పెద్దగా పరిచయం లేని వారే ఈ సీజన్‌లో ఎక్కువ ఉన్నారు. బాలాదిత్య, సింగర్‌ రేవంత్‌ మిగతావారేవరు పెద్దగా పరిచయం లేనివారే. దీంతో ఈ సీజన్‌పై  ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అలాగే హౌజ్‌లో కంటెస్టెంట్స్‌ తీరు కూడా అలాగే ఉంది. ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడం, వ్యక్తిగతంగా ద్వేషించుకోవడం తప్పా ఎవరి మధ్యా పెద్దగా సఖ్యత కనిపించడం లేదు. టాస్క్‌లో సైతం టీం మెంబర్స్‌ మద్దతుగా నిలవకపోగా ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్‌గానే ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఫలితంగా గత సీజన్ల కంటే ఈ సీజన్‌కు ప్రేక్షకాదరణ కరువైంది. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ డోస్‌ను పెంచేందుకు బుల్లితెర సూపర్‌ స్టార్‌ సుడిగాలి సుధీర్‌ను బిగ్‌బాస్‌ నిర్వహకులు రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. కమెడియన్‌గా వచ్చి యాంకర్‌గా ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్‌ వైల్డ్‌కార్డ్‌ ద్వారా బిగ్‌బాస్‌లోకి తీసుకువస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వారం చివరిలో సుధీర్ స‌డ‌న్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్టు సమాచారం.ప్రస్తుతం సుధీర్‌ క్వారంటైన్‌లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇది తెలిసి బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.  

వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సుడిగాలి సుధీర్‌కి కచ్చితంగా మంచి ఆద‌ర‌ణ ల‌భించే అవ‌కాశం ఉంటుంద‌ంటున్నారు అతడి ఫ్యాన్స్‌. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఒక్క కంటెస్టెంట్లు అంతగా వినోదాన్ని అందించ‌లేక‌పోతున్నారు. అందుకే ఈ స‌మ‌యంలో సుధీర్ హౌస్‌లోకి వస్తే ప్రేక్షకులకు మంచి వినోదంతో పాటు మంచి టాప్‌ టీఆర్‌పీ రేటింగ్‌ కూడా నమోదయ్యే అవకాశం ఉందని బిగ్‌బాస్‌ నిర్వహకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం సుధీర్‌కు భారీగా పారితోషికం కూడా ఇస్తున్నారట. అయితే అది ఎంత అనేది స్పష్టత లేదు. ఇక సుధీర్‌ హౌజ్‌లో వస్తాడా? రాడా? తెలియాలంటే ఈ వారం చివరి వరకు వేచి చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement