బిగ్‌బాస్‌: 'నువ్వు ఇలా చేస్తావనుకోలేదు..నాతో రిలేషన్‌లో ఉండి'.. | Bigg Boss 15: Rajiv Adatia And Ieshan Sehgaal Relationship Trobles Miesha | Sakshi
Sakshi News home page

Bigg Boss: ఇషాన్‌ గురించి తెలుసుకున్న మీషా బ్రేకప్‌ చెప్పనుందా?

Oct 26 2021 2:21 PM | Updated on Sep 2 2022 3:27 PM

Bigg Boss 15: Rajiv Adatia And Ieshan Sehgaal Relationship Trobles Miesha - Sakshi

టెలివిజన్‌ చరిత్రలో బిగ్‌బాస్‌ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ భాషలో అయినా బిగ్‌బాస్‌ షో టీఆర్పీ రేటింగులో దూసుకుపోతుంది. ఇక హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 15 రోజురోజుకూ రసవత్తరంగా సాగుతుంది. తాజాగా మోడల్‌ రాజీవ్‌ అదాతియా వైల్డ్‌ కార్డ్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. రావడం రావడంతోనే కంటెస్టెంట్‌ ఇషాన్‌ సెహగాల్‌తో తన రిలేషన్‌షిప్‌ను చెప్పి బాంబు పేల్చాడు.


మీషా అయ్యర్‌తో సన్నిహితంగా ఉండటం ఏంటని నిలదీశాడు. ఏ కారణం వల్ల బిగ్‌బాస్‌ హౌస్‌కు వచ్చావ్‌? ఇక్కడ ఏం చేస్తాన్నావ్‌ అంటూ ఫైర్‌ అయ్యాడు. 'మనమిద్దరం చాలా కాలం పాటు రిలేషన్‌లో ఉన్నాం. ఇప్పుడు నువ్వు మీషాతో లవ్‌లో ఉండటం ఏంటి? అయినా 3రోజుల్లో ప్రేమ పుడుతుందా? నీ నుంచి ఇలాంటిది జరుగుతుందని నేను ఊహించలేదు. ఆ అమ్మాయికి నువ్వు అబద్దపు ప్రమాణాలు ఎందుకు చేస్తున్నావ్‌? నువ్వు నాకు ఏం ప్రామిస్‌లు చేశావో గుర్తింది కదా' అంటూ ఇ‍ద్దరి రిలేషన్‌కు సంబంధించిన డార్క్‌ సీక్రెట్‌ను బయటపెట్టాడు.


కాగా బిగ్‌బాస్‌ సీజన్‌15లో ఇషాన్‌- మీషా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఇషాన్‌ బై-సెక్సువల్‌ అని తెలిశాక మీషా-ఇషాన్‌ల లవ్‌కు బ్రేకప్‌ పడనుందా? లేక ఇది ట్రయాంగిల్‌గా మారనుందా అన్నది ఎంట్రెస్టింగ్‌గా మారింది. కాగా ఇటీవలె ఇషాన్‌ లవ్‌ ప్రపోజ్‌ చేయగా మీషా సైతం లవ్‌ యూ టూ అంటూ అతని ప్రేమను అంగీకరించింది. ఇక తెరపై వీళ్లిద్దరూ చేసే మితిమీరిన రొమాన్స్‌కు ఫ్యామిలీ ఆడియోన్స్‌ సైతం ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయంపై హోస్ట్‌ సల్మాన్‌ సైతం వీరిద్దరిని హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement