రోమ్‌ ఓపెన్‌లోనూ షరపోవాకు వైల్డ్‌ కార్డు... | Sharapova, a wild card to open in Rome | Sakshi
Sakshi News home page

రోమ్‌ ఓపెన్‌లోనూ షరపోవాకు వైల్డ్‌ కార్డు...

Published Thu, Mar 2 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM

రోమ్‌ ఓపెన్‌లోనూ షరపోవాకు వైల్డ్‌ కార్డు...

రోమ్‌ ఓపెన్‌లోనూ షరపోవాకు వైల్డ్‌ కార్డు...

రష్యా టెన్నిస్‌ స్టార్‌ మరియా షరపోవాకు మరో టోర్నమెంట్‌లో వైల్డ్‌ కార్డు ఎంట్రీ లభించింది. ఇప్పటికే స్టుట్‌గార్ట్, మాడ్రిడ్‌ ఓపెన్‌ టోర్నీ నిర్వాహకులు షరపోవాకు వైల్డ్‌ కార్డు కేటాయించగా... తాజాగా రోమ్‌ ఓపెన్‌లోనూ ఆమెకు ఈ అవకాశం దక్కింది. నిషేధిత ఉత్ప్రేరకం మెల్డోనియం వాడినట్లు తేలడంతో 2016 జనవరిలో షరపోవాపై అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) రెండేళ్లపాటు నిషేధం విధించింది.

అయితే కోర్టు ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ జోక్యంతో ఈ రష్యా స్టార్‌ నిషేధాన్ని ఐటీఎఫ్‌ 15 నెలలకు కుదించింది. నిషేధం గడువు పూర్తయిన వెంటనే... ఏప్రిల్‌ 26న మొదలయ్యే స్టుట్‌గార్ట్‌ ఓపెన్‌లో షరపోవా పునరాగమనం చేయనుంది. ఆ తర్వాత మే 6 నుంచి 13 వరకు జరిగే మాడ్రిడ్‌ ఓపెన్‌లో, మే 15 నుంచి 21 వరకు జరిగే రోమ్‌ ఓపెన్‌లో ఆమె ఆడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement