మాడ్రిడ్: సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. 15 ఏళ్ల తర్వాత రష్యా జట్టు మూడోసారి డేవిస్‌కప్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో మెద్వెదేవ్ సారథ్యంలోని రష్యా జట్టు 2–0తో క్రొయేషియాపై నెగ్గింది. గతంలో 2002, 2006లలో కూడా రష్యా విజేతగా నిలిచింది. తొలి మ్యాచ్‌లో రుబ్లెవ్ 6–4, 7–6 (7/5)తో బొర్నా గోజోపై నెగ్గి రష్యాకు 1–0 ఆధిక్యాన్నిచ్చాడు. ఆ తర్వాత జరిగిన రెండో సింగిల్స్‌లో మెద్వెదేవ్ 7–6 (9/7), 6–2తో సిలిచ్‌పై విజయం సాధించి రష్యాకు డేవిస్ కప్‌ను అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment