Actress Kalyani Surya Kiran Divorce Reason In Telugu - Sakshi
Sakshi News home page

Actress Kalayani Divorce: ఆ భయంతోనే కల్యాణి విడాకులు అడిగింది..: సూర్య కిరణ్‌

Published Tue, Jul 19 2022 10:12 AM | Last Updated on Tue, Jul 19 2022 1:31 PM

Director Surya Kiran Open Up On Reason Behind Divorce With Kalyani - Sakshi

డైరెక్టర్‌, బిగ్‌బాస్‌ ఫేం సూర్య కిరణ్‌ గురించి ప్రత్యేకం పరిచయం అక్కర్లేదు. సుమంత సత్యం మూవీతో డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. ఈ క్రమంలో జౌను.. వాళ్లిద్దరు ఇష్టపడ్డారు మూవీతో పరిచయమైన వీరిద్దరూ 2005లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2020లో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే వీరి విడాకుల కారణాలేంటో ఎవరికి తెలియదు కానీ, సడెన్‌గా విడిపోతున్నామని ప్రకటించడంతో అందరు షాక్‌ అయ్యారు.

చదవండి: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..

ఈ నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించిన సూర్య కిరణ్‌.. కల్యాణితో విడాకులపై స్పందిచాడు. వారి విడాకులకు కారణాలపై నోరు విప్పాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘మేం 15 ఏళ్లు కాపురం చేశాం. మా మధ్య ఎన్నడు అభిప్రాయ భేదాలు కానీ, గొడవలు కానీ రాలేదు. ఎంతో అనోన్యంగానే ఉన్నాం. నేను చూసిన మంచి అమ్మాయిల్లో కల్యాణి ఒకరు. ఆవిడ చాలా మంచివారు. అయితే సొంత ప్రొడక్షన్‌ పెట్టి సినిమాలు తీయడం వల్ల ఆస్తుల పోయాయి. అప్పుల పాలయ్యాను, ఒకవేళ దానికి బయపడే ఆమె విడాకులు అడిగిరామో’ అని చెప్పుకొచ్చాడు. 

ఆ తర్వాత ‘‘మేం విడిపోవడానికి కారణమేంటని కోర్టు అడిగిన ప్రశ్నకు కూడా కల్యాణి ఏం సమాధానం చెప్పలేదు. విడాకుల కోసం మేం జడ్జిని సపరేట్‌ చాంబర్‌లో కలిశాం. అప్పుడు జడ్జి నన్ను చూపిస్తు ‘ఈయన కొడతారా? తిడతారా? మీ అత్తింటివారు ఇబ్బంది పెడుతున్నారా?’ అని కల్యాణిని అడిగారు. దానికి కల్యాణి లేదని సమాధానం ఇచ్చింది. మరెందుకు విడాకులు తీసుకుంటున్నారని అడిగినా తను ఎలాంటి సమాధానం చెప్పలేకపోయింది. ఆ వెంటనే జడ్జి మీరు డైవర్స్‌ తీసుకుంటే పిల్లల బాధ్యత ఎవరిది?’ అని ప్రశ్నించారు. వెంటనే నేను మాకు పిల్లలు లేరన్నాను.

చదవండి: మహేశ్‌ సినిమాలో ఆ పాత్రను అయిష్టంగానే చేశా: ప్రకాశ్‌ రాజ్‌

మీకు పిల్లలు లేకపోవడటమే విడాకులకు కారణమా? అని అడగంతో అవును అని చెప్పాను. ఛాంబర్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ‘వేయిట్‌ చేయండి. అప్పులు తీరిపోయిన తర్వాత మనం మళ్లీ పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాను’’ అన్నాడు. చివరగా తనకున్న అప్పుల కారణంగా అందరు తనని డబ్బులు అడిగి ఇబ్బంది పెడతారనే ఆందోళనతోనే కల్యాణి విడాకులు తీసుకుని ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా సూర్య కిరణ్‌ తమిళంలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పనిచేశాడు. బాల నటుడిగా ఆయన దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement