![Girl Dead Body Found In East Godavari - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/14/sujitha.jpg.webp?itok=TRPa802F)
సుజిత (ఫైల్)
తూర్పు గోదావరి, మామిడికుదురు (పి.గన్నవరం): పెద్దలు నిరాకరించారన్న కారణంతో జీవితంపై విరక్తి చెంది పాశర్లపూడి వైనతేయ వారధిపై నుంచి దూకి ఆత్యహత్య చేసుకున్న పెదపట్నం గ్రామానికి చెందిన బాలిక ముత్యాల నాగసుజిత (14) మృతదేహం ఆదివారం లభ్యమైంది. అంబాజీపేట మండలం వాకలగురువు వైపు సుజిత మృతదేహాన్ని గుర్తించి మత్య్సకారులు పోలీసులకు సమాచారాన్ని తెలపడంతో మృతదేహాన్ని పాశర్లపూడి బ్రిడ్జి దగ్గరకు తీసుకు వచ్చారు. సుజిత మృతదేహం పూర్తిగా పాడైపోయింది.
నగరం ఎస్సై జి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నగరం గ్రామానికి చెందిన వెలిశెట్టి నాగదుర్గశివ (21) నాగసుజిత జంట శనివారం పాశర్లపూడి బ్రిడ్జిపై నుంచి వైనతేయ గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం, దుర్గాశివ మృతదేహం శనివారం సాయంత్రం లభ్యమైన సంగతి కూడా తెలిసిందే. అతడి మృతదేహానికి రాజోలు ఎస్సై లక్ష్మణ రావు ఆధ్వర్యంలో పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని బంధువులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment