కలవారి కోడలు... మళ్లీ వచ్చింది! | Kalavari got a daughter-in-law ... again! | Sakshi
Sakshi News home page

కలవారి కోడలు... మళ్లీ వచ్చింది!

Published Sat, Dec 5 2015 11:06 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

కలవారి కోడలు... మళ్లీ వచ్చింది!

కలవారి కోడలు... మళ్లీ వచ్చింది!

నటీనటులు ఎంతోమంది ఉన్నా, కొందరే ప్రేక్షకుల మనసుల్లోకి చొచ్చుకుపోతారు. ప్రేక్షకుల్ని తమ నటనతో ఫిదా చేసేసి, వాళ్ల మనసుల్లో సింహాసనం వేసుకుని కూర్చుంటారు. బుల్లితెర ప్రేక్షకులను అలా కట్టిపడేసిన నటి... సుజిత. కలవారి కోడలు, కలిసుందాం రా, గంగోత్రి వంటి సీరియల్స్‌తో ఆమె టెలివిజన్ సూపర్‌స్టార్ అయిపోయింది. అయితే ఎందుకనో గత కొంతకాలంగా ఆమె అంతగా కనిపించడం లేదు. దాంతో సుజిత ఏమైపోయిందా అనుకున్నవాళ్లూ ఉన్నారు.

అయితే ఈ మధ్య సడెన్‌గా ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సీరియల్‌తో బుల్లితెరపై ప్రత్యక్షమయ్యింది. దాంతో ఆమెను ఇన్ని రోజులూ మిస్ అయిన అభిమానులు సంబరపడుతున్నారు. ఆమె సీరియల్స్ ఎప్పుడూ ఆకట్టుకుంటాయి కాబట్టి టీవీ స్క్రీన్లకు కాన్ఫిడెంట్‌గా కళ్లప్పగించేస్తున్నారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement