TV Actress Sujitha Dhanush House Warming Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Sujitha: బుల్లితెర నటి గృహ ప్రవేశం.. సోషల్ మీడియాలో వైరల్

Published Wed, Mar 29 2023 4:16 PM | Last Updated on Wed, Mar 29 2023 4:34 PM

Tv Actress Sujitha Dhanush House Warming Photos Goes Viral - Sakshi

సుజిత ధనుశ్ దక్షిణాది భాషల్లో పలు సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో పాటు టీవీ సీరియల్స్‌లోనూ నటించింది. గతంలో  స్టార్ మాలో ప్రసారమైన ‘వదినమ్మ’ సీరియల్‌లో కీలక పాత్రలో నటించింది. ప్రస్తుతం జెమిని టీవీలో ప్రసారమవుతున్న గీతాంజలి సీరియల్‌లో సుజిత నటిస్తోంది. 

చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ పసివాడి ప్రాణం చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది సుజిత. ఆ తర్వాత జై చిరంజీవ సినిమాలోనూ హీరో చిరంజీవికి చెల్లెలిగా నటించింది. సుజిత చిన్నప్పుడు దాదాపు ఐదు భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. నటనలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవితోపాటు తెలుగులో వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది.

తాజాగా ఆమె తన గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తన భర్తతో కలిసి కొత్తింట్లో పూజలు చేస్తున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. సుజిత ఫోటోలు షేర్ చేస్తూ గెస్ ద ఈవెంట్ అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన పలువురు అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. 

సుజిత ఎవరంటే..
1983 జూలై 12న కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది. ఆమె ప్రముఖ డైరెక్టర్ సూర్యకిరణ్ సోదరి. ధనుష్ అనే నిర్మాతను వివాహమాడింది. ప్రస్తుతం చెన్నైలో నివాసముంటున్న సుజిత తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది. మలయాళ సిరీస్ స్వాంతం మలూట్టీలో మొట్టమొదటి సారిగా ప్రధాన పాత్రలో కనిపించింది. ఆ తర్వాత టీవీ సీరియల్స్ వైపు అడుగులు వేసింది. ‘మారుతని’ సీరియల్ ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. చివరిసారిగా ‘దియా’, కణం అనే సినిమాల్లో నటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement