![Telugu Serial Actress Priyanka Jain New Home Ceremony Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/26/WhatsApp%20Image%202023-08-26%20at%2015.12.39.jpeg.webp?itok=gT38KEM4)
మౌనరాగం ఫేమ్ ప్రియాంక జైన్ గురించి పరిచయం అక్కర్లేదు. మాటలు రాని మూగ అమ్మాయిగా నటించి అద్భుతహ అనిపించింది. ముంబయికి చెందిన ముద్దుగుమ్మ తెలుగులో సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. జానకి కలగనలేదు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. చల్తే చల్తే, ఎవడు తక్కువ కాదు, వినరా సోదర వీర కుమార లాంటి చిత్రాల్లో కనిపించింది. అంతే కాకుండా మౌనరాగంతో పాటు ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్‌లో నటించింది.
అయితే మౌనరాగం ఫేమ్, సహనటుడు శివకుమార్ మరిహల్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. గతంలో వీరిద్దరు చాలా సార్లు హోమ్ టూర్స్ చేస్తూ జంటగా కనిపించారు. వారి మధ్య రిలేషన్ గురించి ఇప్పటికే చాలా వీడియోలు చేశారు.
(ఇది చదవండి: ఎమ్మెల్యేగా పోటీ అంటూ ఊహాగానాలు.. రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ)
అయితే వీరి పెళ్లి సంగతి పక్కనపెడితే ఆమె నటిస్తోన్న జానకి కలగనలేదు సీరియల్‌ను అర్ధాంతరంగా ఆపేశారు. కొంతకాలంగా ప్రేక్షకులకు తలభారంగా మారడంతో ఎలాగోలా 662 ఎపిసోడ్ వరకు అతి కష్టం మీద లాక్కొచ్చారు. కానీ చివరికీ ఇక నిర్మాతలు కూడా చేతులెత్తేయడంతో సీరియల్‌కు ఎండ్ కార్డ్ వేయక తప్పలేదు.
తాజాగా జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ తన యూట్యాబ్ ఛానెల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తాము కొత్త ఇంటిలో చేరబోతున్నట్లు వీడియోలో వెల్లడించింది. నూతన గృహ ప్రవేశానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఆ వీడియోలో చూపించింది. గృహ ప్రవేశానికి వచ్చిన వారందరికీ ప్రియాంక జైన్, శివ కుమార్ కానుకలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా తమ సొంతింటి కల సాకారమైందని ప్రియాంక ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. ఇక ప్రియాంక జైన్, శివ కుమార్.. ‘మౌనరాగం’ సీరియల్ అప్పటి నుంచి రిలేషన్‌లో ఉన్నారు.
(ఇది చదవండి: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇల్లు చూశారా? ఎంత బాగుందో!)
Comments
Please login to add a commentAdd a comment