Daddy Movie's Child Artist Anushka Malhotra Latest Photos - Sakshi
Sakshi News home page

Guess The Actress: చిరంజీవి రీల్ కూతురు ఇప్పుడేం చేస్తుంది?

Published Tue, Aug 8 2023 1:22 PM | Last Updated on Tue, Aug 8 2023 2:57 PM

Daddy Movie Child Artist Anushka Malhotra Details - Sakshi

చైల్డ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుంటే దాదాపు ఇండస్ట్రీలోనే కొనసాగుతారు. లక్ కలిసొస్తే హీరోయిన్లు కూడా అయిపోతారు. కీర్తి సురేశ్, నిత్యా మేనన్.. ఇలా లిస్ట్ చూస్తే చాలా పెద్దగానే ఉంటుంది. అయితే ఈ అమ్మాయి మెగాస్టార్ చిరంజీవికి కూతురిగా నటించింది. ఆ సినిమా రిజల్ట్ గురించి పక్కనబెడితే బోలెడంత పేరు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత సినిమాలకు దూరమైపోయింది. ఇప్పుడేమో హీరోయిన్లకే పోటీ ఇచ్చేలా మారిపోయింది. ఆమె ఎవరో గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా?

చిరంజీవి ఇప్పుడంటే కమర్షియల్ చిత్రాలు చేస్తున్నారు గానీ అప్పట్లో డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో సినిమాలు చేస్తూ ఎంటర్‌టైన్ చేసేవారు. అలా తండ్రి-కూతురు అనుబంధం స్టోరీతో 'డాడీ'. ఇందులో చిరుకి హీరోయిన్‌గా సిమ్రన్ నటించినప్పటికీ.. ఎక్కువగా చైల్డ్ ఆర్టిస్ అనుష్క మల్హోత్రానే కనిపించింది. చిరుతో ఈమె సీన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఆడియెన్స్ కి ఆకట్టుకున్నాయి. ఈ పాపకు 'డాడీ' తర్వాత పలు సినిమాల్లో అవకాశాలొచ్చినా నటించలేదు.

(ఇదీ చదవండి: నటుడిగా పనికిరాడన‍్నారు.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నాడు!)

ముంబయిలో పుట్టి పెరిగిన అనుష్క మల్హోత్రా.. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హమ్‌లో కుటుంబంతో కలిసి ఉంటోంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ చిన్నది.. ప్రస్తుతం మార్కెటింగ్ స్టేటజిస్ట్‌ అనే ఉద్యోగం పనిచేస్తోంది. ఇన్ స్టాలోనూ అప్పుడప్పుడు వీడియోలు, పోస్ట్ చేసే ఈమెని చూసి చాలామంది తొలుత గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా మంచి అందంగా తయారైంది. ఈమె ఫొటోలు చూస్తే మీరు ఇది నిజమేనంటారు.

అయితే ఈమెకు ప్రస్తుతం బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయట. కానీ ఎందుకో యాక్టింగ్ వైపు ఆసక్తి చూపించట్లేదు. కానీ సోషల్ మీడియాలో ఫొటోలు, డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ తనలోని టాలెంట్ ని చూపిస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఈమె ముక్కుపుడక అయితే.. ఈమె అందాన్ని మరింత హైలెట్ చేస్తుందని చెప్పొచ్చు. మరి ఇంకెందుకు లేటు. దిగువన ఫొటోలపై మీరు ఓ లుక్ వేసేయండి.

(ఇదీ చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement