
చిత్ర పరిశ్రమ ఏదైనా సరే.. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన చిత్రాలు కచ్చితంగా చర్చనీయాంశంగా మారతాయి. అయితే సమాజంలో జరుగుతున్న ఘటనలనే తాము చిత్రాల్లో చూపిస్తున్నామన్నది దర్శక నిర్మాతల వాదనగా ఉంటుంది. కాగా లెస్బియన్ల ఇతి వృత్తంతో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. వాటి తరహాలో తాజాగా కోలీవుడ్‌లో రూపొందిన చిత్రం 'కాదల్ ఎన్నబదు పొదువుడమై'.. గతంలో లెన్స్ వంటి వైవిధ్యభరిత కథా చిత్రానికి జయప్రకాశ్ దర్శకత్వం వహించారు. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన తాజా చిత్రమే 'కాదల్ ఎన్నబదు పొదువుడమై'.. అయితే, ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైనప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఓటీటీలోకి సడెన్‌గా ఎంట్రీ ఇచ్చేసింది.
గ్లోవింగ్ టంగ్ట్‌న్, మ్యాన్‌కైండ్ సినిమాస్, నిత్స్ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో జై భీమ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న లిజోమోల్ జోస్ లెస్బియన్‌గా నటించింది. తెలుగులో మంచి గుర్తింపు ఉన్న నటుడు వినీత్, రోహిణి కూడా ఈ మూవీలో కీలక పాత్రలలో కనిపించారు. ప్రేమికుల రోజు సందర్బంగా ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. 'టెంట్‌కొట్ట' ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, సబ్ టైటిల్స్‌తో కేవలం తమిళ వర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ చిత్రంపై నటి జ్యోతిక ప్రశంసలు కురిపించారు. మంచి సందేశంతో ఉన్న చిత్రాన్ని నిర్మించారంటూ ఆమె పేర్కొన్నారు.

ఈ సిఇనమా లెస్బియన్ ఇతి వృత్తంతో కూడిన కథ కావడంతో చాలామంది హీరోయిన్లు నటించేందుకు ముందుకు రాలేదని దర్శకుడు జయప్రకాశ్ గతంలో తెలిపారు. అదే విధంగా మరి కొందరైతే దీన్ని మలయాళం, హిందీ భాషల్లో చేయమని, తమిళంలో వద్దని చెప్పారు. అలాంటి సమయంలో నిర్మాత జియోబేబీ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈయన ఇంతకు ముందు ది గ్రేట్ ఇండియన్ కిచ్చన్ వంటి హిట్ చిత్రాన్ని నిర్మించినట్లు దర్శకుడు తెలిపారు. ఇద్దరు యువతుల మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు. అయితే, సినిమా విడదల తర్వాత చాలా వివాదస్పదంగా మారింది. సినిమాను బ్యాన్ చేయాలంటూ కూడా కొందరు కోరారు. ఇలా వివాదం చుట్టూ వైరల్ అయిన కాదల్ ఎన్నబదు పొదువుడమై చిత్రాన్ని టెంట్‌కొట్ట ఓటీటీ యాప్‌లో చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment