Daddy
-
Anushka Malhotra: చిరంజీవి డాడీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత అందంగా ఉందో చూశారా? (ఫోటోలు)
-
ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? మెగాస్టార్ చిరంజీవి రీల్ డాటర్!
చైల్డ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుంటే దాదాపు ఇండస్ట్రీలోనే కొనసాగుతారు. లక్ కలిసొస్తే హీరోయిన్లు కూడా అయిపోతారు. కీర్తి సురేశ్, నిత్యా మేనన్.. ఇలా లిస్ట్ చూస్తే చాలా పెద్దగానే ఉంటుంది. అయితే ఈ అమ్మాయి మెగాస్టార్ చిరంజీవికి కూతురిగా నటించింది. ఆ సినిమా రిజల్ట్ గురించి పక్కనబెడితే బోలెడంత పేరు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత సినిమాలకు దూరమైపోయింది. ఇప్పుడేమో హీరోయిన్లకే పోటీ ఇచ్చేలా మారిపోయింది. ఆమె ఎవరో గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా? చిరంజీవి ఇప్పుడంటే కమర్షియల్ చిత్రాలు చేస్తున్నారు గానీ అప్పట్లో డిఫరెంట్ సబ్జెక్ట్లతో సినిమాలు చేస్తూ ఎంటర్టైన్ చేసేవారు. అలా తండ్రి-కూతురు అనుబంధం స్టోరీతో 'డాడీ'. ఇందులో చిరుకి హీరోయిన్గా సిమ్రన్ నటించినప్పటికీ.. ఎక్కువగా చైల్డ్ ఆర్టిస్ అనుష్క మల్హోత్రానే కనిపించింది. చిరుతో ఈమె సీన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఆడియెన్స్ కి ఆకట్టుకున్నాయి. ఈ పాపకు 'డాడీ' తర్వాత పలు సినిమాల్లో అవకాశాలొచ్చినా నటించలేదు. (ఇదీ చదవండి: నటుడిగా పనికిరాడన్నారు.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నాడు!) ముంబయిలో పుట్టి పెరిగిన అనుష్క మల్హోత్రా.. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని బర్మింగ్హమ్లో కుటుంబంతో కలిసి ఉంటోంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ చిన్నది.. ప్రస్తుతం మార్కెటింగ్ స్టేటజిస్ట్ అనే ఉద్యోగం పనిచేస్తోంది. ఇన్ స్టాలోనూ అప్పుడప్పుడు వీడియోలు, పోస్ట్ చేసే ఈమెని చూసి చాలామంది తొలుత గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా మంచి అందంగా తయారైంది. ఈమె ఫొటోలు చూస్తే మీరు ఇది నిజమేనంటారు. అయితే ఈమెకు ప్రస్తుతం బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయట. కానీ ఎందుకో యాక్టింగ్ వైపు ఆసక్తి చూపించట్లేదు. కానీ సోషల్ మీడియాలో ఫొటోలు, డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ తనలోని టాలెంట్ ని చూపిస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఈమె ముక్కుపుడక అయితే.. ఈమె అందాన్ని మరింత హైలెట్ చేస్తుందని చెప్పొచ్చు. మరి ఇంకెందుకు లేటు. దిగువన ఫొటోలపై మీరు ఓ లుక్ వేసేయండి. View this post on Instagram A post shared by Anushka Malhotra (@anush.malhotra) View this post on Instagram A post shared by Anushka Malhotra (@anush.malhotra) (ఇదీ చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) -
'నువ్వు ఎప్పుడు ఇదే చెప్పేవాడివి డాడీ.. వాటితోనే బతికేస్తా'
జబర్దస్త్ నటి రీతూ చౌదరి మరోసారి తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. ఇటీవల తండ్రి మరణాన్ని తలుచుకుంటూ వరుస పోస్టులు పెట్టింది రీతూ. నువ్వు లేని ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నానంటూ సోషల్ మీడియాలో భావోద్యేగ పోస్టులు చేసింది రీతూ చౌదరి. ఇటీవలే ఆమె తండ్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తన తండ్రితో దిగిన చివరి ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. తాజాగా మరోసారి ఎమోషనల్ పోస్ట్ చేసింది. రీతూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ ఆడియోను పంచుకుంది. ప్రస్తుతం ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అందులో ఏముందంటే.. ' జీవితం చాలా చిన్నది. ఎప్పుడు ఏలా మలుపు తిరుగుతుందో నీ కథతో అర్థమైంది. అలాంటిది ఈ ఉన్న కొన్ని రోజులు మనసుకు నచ్చనట్లు బతకడమే. నీ నుంచి నేర్చుకున్నా. చివరకు మిగిలేది ఏంటి? మనం పంచిన ప్రేమ. మనం చేసుకున్న జ్ఞాపకాలు. నువ్వు ఎప్పుడు ఇదే చెప్పేవాడివి డాడీ. నీ జ్ఞాపకాలతో బతికేస్తా.'అంటూ సమంత ఫోటో ఉన్న ఆడియో క్లిప్‌ను తన స్టోరీస్‌లో పోస్ట్ చేసింది రీతూ చౌదరి. -
ఆ సినిమా నా కంటే వెంకటేశ్ చేస్తేనే బాగుండేది : చిరంజీవి
సినిమా కథలను ఎంచుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తాడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టుగా, ఫ్యాన్స్ అంచనాలను దృష్టిలో పెట్టుకొని సినిమాలను ఎంచుకుంటాడు. తన దగ్గరకు మంచి కథలు..తనకు కాకుండా వేరే వాళ్లకు బాగా సెట్ అవుతుందని భావిస్తే.. ఆ హీరో అయితేనే ఈ కథను న్యాయం చేస్తాడని సలహా ఇస్తుంటాడు. అలాంటి చిత్రాల్లో ‘డాడీ’ చిత్రం కూడా ఒకటి. 2001లో వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఈ కథ వినగానే, అది తనకంటే.. వెంకటేశ్‌కే బాగా సెట్ అవుతుందని చెప్పాడట. కానీ రచయిత భూపతి రాజాతో పాటు మరికొంతమంది తనను బలవంతంగా ఒప్పించడంతో ఆ సినిమాలో నటించానని చిరంజీవి అన్నారు. ఆచార్య సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘డాడీ కథ నాకు వినిపించగానే... నా కంటే వెంకటేశ్‌కు అయితే బాగుటుందనిపించింది. రచయిత భూపతి రాజాకు ఇదే విషయాన్ని చెప్పాను. కానీ ఆయన నేను చేస్తే ఫ్యామిలీ మెన్‌గా కాస్త వెరైటీ ఉంటుందని నన్ను కన్విన్స్ చేశారు. ఈ కథ విన్న వారంతా.. చిన్న పిల్లలతో మీరు చేస్తేనే బాగుంటుందని చెప్పారు. దీంతో బలవంతంగా ఈ సినిమా ఒప్పకున్నా. రిజల్ట్ కూడా అలానే వచ్చింది. కథ విన్నప్పుడు ఏం అనుకున్నానో.. అదే జరిగింది. సినిమా విడుదలైన తర్వాత వెంకటేశ్ నాకు ఫోన్ చేసి ‘భలే సినిమా అండీ.. నా మీద అయితే ఇంకా బాగా ఆడేదండీ’అన్నాడు. ‘నేను అదే చెప్పాను వెంకటేశ్.. కానీ వినలేదు’ అని నేను అన్నాను. ఇలాంటి కొన్ని ఫెయిల్యూర్స్ నా సినీ జీవితంలో ఉన్నాయి’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. -
'డాడీ' మూవీలో చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించిన సినిమా డాడీ. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించారు. 2001లో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా దగ్గరైంది.తండ్రి-కూతురి మధ్యనుండే ఎమోషన్ కథాంశంగా రూపొందించిన ఈ సినిమాలో చిన్నారి ఐశ్వర్య పాత్ర గుర్తింది కదా.. అదేనండీ చిరంజీవి, సిమ్రాన్‌ల కూతురిగా నటించిన పాప. చిరంజీవి తర్వాత అంతలా ప్రేక్షకులకు దగ్గరైన పాత్ర అది. ఐశ్వర్య, అక్షయలా ద్విపాత్రిభినయంతో ఆకట్టుకున్న ఆ చిన్నారి అసలు పేరు అనుష్క మల్హొత్ర. డాడీ సినిమా వచ్చి నేటికి 20 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆ చిన్నారి పాత్ర గుర్తుండిపోయింది. తొలి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న అనుష్క మల్హొత్రకు డాడీ విజయం తర్వాత చాలా ఆఫర్స్ ఆమెను వరించాయి. అయితే కొన్ని కారణాల వల్ల సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. డాడీ సినిమా తర్వాత స్క్రీన్‌పై ఎక్కడా కనిపించలేదు. అప్పటి చిన్నారి ఇప్పుడు కూడా ఎంతో అందంగా ఉంది. తాజాగా ఈమె ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం యూకేలో ఉంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒకప్పటి చిన్నారి పాపలంతా ఇప్పుడు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దేవుళ్ళు చిత్రంలో చిన్నారి పాత్రలో నటించిన నిత్య శెట్టి ఓ పిట్ట కథ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి అనుష్క మల్హొత్ర హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. చదవండి : ‘వల్లంగి పిట్ట’ చిన్నారి ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా! పావలా శ్యామలకు ఆర్థిక సహాయం చేసిన డైరెక్టర్ -
అదే జోరు
ప్రస్తుతం టాలీవుడ్లో సూపర్ బిజీ హీరోయిన్గా ఉన్నారు రష్మికా మందన్నా. ఇటీవలే తన తొలి హిందీ సినిమా కమిట్ అయిన ఆమె అక్కడా అదే జోరుని చూపిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కనున్న ‘మిస్టర్ మజ్ను’లో హీరోయిన్గా నటించనున్నారు రష్మిక. తాజాగా రెండో హిందీ సినిమా కూడా అంగీకరించారట. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలసి యాక్ట్ చేయనున్నారు రష్మిక. అమితాబ్ ప్రధాన పాత్రలో వికాస్ బాల్ దర్శకత్వంలో ‘డాడీ’ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో అమితాబ్ కుమార్తె పాత్రలో కనిపించనున్నారట ఆమె. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
నాడు...నేడు
నాటి నాన్న... ఎదురు పడితే భయం ... మాట్లాడాలంటే ‘అమ్మో’ ... కన్నెర్ర చేస్తే గజగజ ... గద్దిస్తే ఇక జ్వరమే పుస్తకం, పెన్ను, పెన్సిల్, ఏ అవసరమున్నా అమ్మే మధ్యవర్తి జిహ్వ చాపల్యం తీర్చుకోవాలన్నా, నేత్రానందం తీరాలన్నా కన్న తల్లే నిచ్చెన... . నాన్నకు కోపం వచ్చి కొట్టడానికి నా పైకి వస్తే అడ్డుకున్న పుణ్యానికి సగం దెబ్బలు అమ్మకే మిగిలిన అరకొరే నాపైకి... . నేటి డాడీ... . తరం మారింది... స్వరం మారిపోయింది అమ్మ కొడితే...తిడితే వెనుకేసుకొచ్చే డాడీలొచ్చేశారు . ఇన్నాళ్లూ వంతెనగా నిలిచిన అమ్మ పాత్ర అదృశ్యమైంది ఏ ఆనందమైనా చిటికెలో తీర్చే నాన్న అనురాగం సాక్షాత్కరించింది . అమ్మకు కోపం వస్తే నాన్నే అడ్డుపడి... గుండెలపై కాదు ... తన భుజాలపై కొలువుదీరనిచ్చి...ఆప్యాయతలు పంచి అనురాగాలతో పెంచిన కనిపించిన దేవుళ్లు నేటి మన డాడీలు... -
మంచి తండ్రిగా మీకు మార్కులెన్ని?
సెల్ఫ్ చెక్ ఇంట్లో వస్తువులు ఉన్నాయా? లేదా? పిల్లలు సరిగా చదువుతున్నారా? లేదా? కుటుంబానికి రక్షణగా ఉంటున్నామా? లేదా?... ఇలా అన్ని విషయాలనూ గమనిస్తూ ఫ్యామిలీకి చేదోడువాదోడుగా కుటుంబ యజమాని ఉంటాడు. ఇలా చేసినప్పుడే కుటుంబంలో అతనికి విలువ ఉంటుంది. పిల్లలు ‘‘మా నాన్న మంచివాడు’’ అనాలన్నా... ‘‘అవర్ డాడీ ఈజ్‌ది బెస్ట్’’ అనిపించుకోవాలన్నా వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవటం తప్పనిసరి. పరిశీలనా దృష్టి ఎక్కువగా ఉండే పిల్లలు ఇతరులతో మిమ్మల్ని పోల్చుకొని ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు కాబట్టి, వారనుకున్న విధంగా మీరు ఉండటం అవసరం. యజమానిగా మీరు పర్ఫెక్ట్ డాడీనో కాదో ఒకసారి చెక్ చేసుకోండి. 1. మీ పిల్లలు మిమ్మల్ని చాలా ఇష్టపడతారు. ఎ. అవును బి. కాదు 2. మీరెంత బిజీగా ఉన్నా మీ పిల్లలతో సమయాన్ని గడుపుతారు. ఎ. అవును బి. కాదు 3. పిల్లల భవిష్యత్ గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎ. అవును బి. కాదు 4. సెలవు దొరికితే మీ సమయాన్ని కుటుంబంతోనే గడుపుతారు. ఎ. అవును బి. కాదు 5. పిల్లలకు ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా చే స్తారు. ఎ. అవును బి. కాదు 6. పిల్లలను అనవసరంగా కోప్పడరు. వారిని శారీరకంగా దండించే ప్రయత్నం ఎప్పటికీ చేయరు. ఎ. అవును బి. కాదు 7. పాఠశాలలో జరిగే పేరెంట్– టీచర్ సమావేశాలకు తప్పక హాజరవుతారు. ఎ. అవును బి. కాదు 8. పిల్లలపై ప్రేమ చూపించటానికి మొహమాటపడరు. ఎ. అవును బి. కాదు 9. మీ పిల్లలు ‘ఫలానా కావాలి నాన్నా’ అని అడిగిన సందర్భాలు చాలా తక్కువ. వాళ్లు అడగక ముందే సిద్ధం చేసి ఉంటారు. ఎ. అవును బి. కాదు 10. పిల్లల అవసరాలు తీర్చడంతోపాటు వారిని క్రమశిక్షణగా ఎలా పెంచాలో మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు ఐదు వస్తే కన్నతండ్రిగా మీరు యావరేజ్. ‘ఎ’ లు ఏడు దాటితే మీరు పర్ఫెక్ట్ తండ్రి, పిల్లలను శ్రద్ధగా పెంచటంలో మీకు వందమార్కులు వచ్చినట్లు. మీ పిల్లలు మిమ్మల్ని ఎంత గౌరవిస్తారో అంతే ప్రేమిస్తారు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే పిల్లలని ప్రేమించి, వారిని సంరక్షించడం, బాధ్యత తీసుకోవడం విషయంలో మీరు తెలుసుకోవలసింది చాలా ఉంటుంది. -
గ్రేట్ మామ్స్
కానర్ కాక్స్ (18) పెన్సిల్వేనియా కాలేజ్‌లో చదువుతున్నాడు. క్లాసు రూములో ఉండగా కొరియర్లో అతడికి ఇంటి నుంచి రెండు ప్యాకెట్లు వచ్చాయి. ఒక ప్యాకెట్లో ఫుడ్ ఉంది. ‘వేళకు తిని, చక్కగా చదువుకో’ అని స్లిప్ ఉంది ఆ ప్యాకెట్లో. రెండో ప్యాకెట్ తెరిచాడు. అందుతో చెత్త ఉంది! వెంటనే వాళ్ల మమ్మీకి ఫోన్ చేశాడు. ‘సెలవులకు వచ్చినప్పుడు నువ్వు పడేయకుండా వెళ్లిన చెత్త ఇది. అక్కడే ఎక్కడైనా ట్రాష్ బిన్లో వెయ్’ అని చెప్పింది ఆమె! బాధ్యతను ఎంత బాగా గుర్తుచేసింది ఆ తల్లి! గ్రేట్. సెయింట్ జార్జి (యు.ఎస్.)లోని ఓ స్కూల్లో ‘డాడ్స్ అండ్ డోనట్స్’ బ్రేక్‌ఫాస్ట్ ఈవెంట్ జరుగుతోంది. ఆ ఈవెంట్‌కి పిల్లలు, వాళ్ల తండ్రులు మాత్రమే వెళ్లాలి. ఆ స్కూల్లో చదువుతున్న ఓ పిల్లాడికి తండ్రి లేడు. ఇంటికొచ్చి ఈవెంట్ గురించి తల్లికి చెప్పాడు. ‘సరే, డాడీతోనే వెళ్దువులే’ అంది. మర్నాడు ఉదయాన్నే ఆమె ‘డాడీ’లా తయారైంది. ప్యాంట్, షర్ట్ వేసుకుంది. పెట్టుడు మీసాలు పెట్టుంది. కొడుకును వెంట పెట్టుకుని బ్రేక్‌ఫాస్ట్ ఈవెంట్‌కి వెళ్లింది. కొడుకు సంతోషించాడు. అంతకన్నా ఎక్కువగా స్కూల్ స్టాఫ్! వాళ్ల కళ్లల్లో దాదాపుగా నీళ్లు తిరిగాయట ఆ తల్లిని చూసి. ఆమె పేరు విట్నీ కిట్రెల్. గ్రేట్ మామ్ అంటూ ఇప్పుడు ఆమె మీద ప్రపంచమంతటా ప్రసంశల జల్లు కురుస్తోంది. -
బుజ్జి ధోనీ.. పేర్లుపెట్టి పిలిచేస్తోంది!
భారత క్రికెట్ వీరుడు మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ లో బిజిబిజీగా ఉన్నా.. ఆయన భార్య సాక్షి సింగ్ మాత్రం.. తమ ముద్దుల కూతురు, చిట్టి పొట్టి అందాల చిన్నారి జివాతో పూర్తి సమయాన్ని గడుపుతూ మాతృత్వాన్ని ఆస్వాదిస్తుందన్న విషయం తెలిసిందే. . అదే నేపథ్యంలో అభిమానులకోసం సాక్షీ... జివా ఫోటోలను ఎన్నోసార్లు షేర్ చేశారు. ఇప్పుడు తాజాగా థోనీ... తన ముద్దుల కూతురు జివాతో ఆటపాటల్లో మునిగిపోయిన అద్భుత క్షణాల వీడియోను సాక్షీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జివా మాటల మూటలతో కూడిన వీడియో ఇప్పుడు అందర్నీ కట్టి పడేస్తోంది. అమ్మలాలన, నాన్నపానలో అత్యంత గారాలను ఒలకబోస్తూ... చిలకపలుకులు పలుకుతున్న జివా వీడియో సోషల్ మీడియాలో ఆకర్షణగా మారింది. భారత క్రికెట్ ఆటగాడు మహేంద్రసింగ్ థోనీ..అభిమానులకోసం తమ చిట్టితల్లి చిత్రాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేసే సాక్షీ థోనీ.. ఇటీవల చిన్నారి జివా తండ్రితో ఆడుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. లిటిల్ గాల్.. జివా.. వచ్చీ రాని మాటలతో నాన్న.. అమ్మలను.. తనదైన రీతిలో పేరుపెట్టి పిలుస్తుంటే... ఆ దంపతులు మురిసిపోవడం వీడియోలో అభిమానులను అత్యంత ఆకర్షిస్తోంది. పిల్లలు పక్కన ఉంటే ప్రపంచాన్ని మర్చిపోవచ్చన్న విషయం జివా వీడియోను చూస్తే అర్థమౌతుంది. చిన్నారుల కళ్ళలో చూస్తూ, వారికి వచ్చీరాని మాటలను వింటూ ఎంతకాలమైనా గడిపేయచ్చనిపిస్తుంది. దేశానికి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లుగా .. ఎంత సెలబ్రిటీలయినా చిన్నారుల విషయానికి వస్తే అంతేమరి... -
బుజ్జి ధోనీ.. పేర్లుపెట్టి పిలిచేస్తోంది!
-
మళ్లీ వచ్చేసిన 'ఓపెన్ గంగ్నమ్ స్టైల్'..
సై గుర్తున్నాడు కదా? 2012లో 'గంగ్నమ్ స్టైల్' పాటతో ప్రపంచవ్యాప్తంగా సునామీ సృష్టించిన ఈ కొరియన్ పాప్ సూపర్‌స్టార్ మరోసారి తనదైన డాన్సింగ్ స్టెపులతో ముంచెత్తాడు. తాజాగా అతను రూపొందించిన 'డాడీ' పాట.. యూట్యూబ్‌లో విశేషంగా ఆకట్టుకుంటోంది. సై మార్కు డాన్సులతో కొంత విచిత్రంగా, మరికొంత వినూత్నంగా ఉన్న 'డాడీ' పాటను యూట్యూబ్‌లో 24 గంటల్లోనే 42లక్షలమందికిపైగా వీక్షించారు. విలియమ్ తీసిన 'ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మై మమ్మ' పాటకు 'మేల్' వెర్షన్‌గా సై 'డాడీ' పాటను రూపొందించాడు. ఇందులో సై శిశువుగా, స్కూల్ విద్యార్థిగా, సల్సా డ్యాన్సర్‌గా వినూత్న అవతారాల్లో యానిమేటెడ్ లుక్‌తో కనిపిస్తాడు. ప్రసవ సన్నివేశంతో ఈ పాట ప్రారంభమవుతుంది. సంగీతం మొదలవ్వడంతో సై ముఖంతో కూడిన ఓ శిశువు జన్మిస్తాడు. దాంతో 'ఐ గాట్ ఇట్ ఫ్రమ్ డ్యాడీ' పాట మొదలవుతుంది. ఈ శిశువు పెద్దవాడై తన డ్యాన్స్ స్టెప్పులతో స్కూల్ విద్యార్థినులను, టీచర్‌ను, అమ్మాయిలను ఎలా ఆకర్షించి బుట్టలో వేసుకుంటాడు అనే థీమ్‌తో పాట సాగుతుంది. అంతేకాకుండా ఇందులో సై బాలుడిగా, తండ్రిగా, తాతగా త్రిపాత్రభినయంతో స్టెప్పులు వేసి ఉర్రూతలూగిస్తాడు. సై తీసిన డ్యాన్సింగ్ థ్రిల్లర్ 'గంగ్నమ్ స్టైల్'ను యూట్యూబ్‌లో 2.46 కోట్లమంది వీక్షించారు. పాప్ చరిత్రలోనే భారీ హిట్లలో ఒకటిగా నిలిచింది ఈ పాట. ఆ తర్వాత సై తీసిన పాప్ సాంగ్ కావడంతో సహజంగానే 'డ్యాడీ'కి కూడా భారీగానే హిట్లు వస్తున్నాయి. అయితే ఇది కూడా 'గాంగ్నమ్ స్టైల్' స్థాయిలో రికార్డులు సృష్టిస్తుందా? అనేది వేచి చూడాలి. -
ఆ ఏజిలో నేను కొంచెం తింగరిదాన్ని
చిన్నప్పుడు చేసిన అల్లరి గురించి అమ్మా నాన్న చెబుతుంటే వినడానికి తమాషాగా ఉంటుంది. టీనేజ్‌లో చేసిన హంగామా ఎప్పటికీ మురిపెంగా ఉంటుంది. 20 ఏళ్ల వయసులో చేసిన పనులు 30 ఏళ్ల వయసులో సిల్లీగా అనిపిస్తాయి. ఇటీవల ఓ సందర్భంలో కాజల్ అగర్వాల్ తన ట్వంటీస్ గురించి గుర్తు చేసుకున్నారు. ఆ జ్ఞాపకాల గురించి చెబుతూ - ‘‘ట్వంటీ ఇయర్స్ ఏజ్‌లో నేను కొంచెం తింగరదానిలా ఉండేదాన్ని. అప్పట్లో నేను చేసినవన్నీ పిచ్చి పనులే. మానసిక పరిపక్వత లేని ఆ పనులను మా అమ్మ ఎలా తట్టుకుందో అనిపిస్తోంది. అమ్మ గెడైన్స్ వల్లే మెల్లిగా నాలో మార్పొచ్చింది. ఇప్పుడు తెలివిగా ఆలోచించగలుగుతున్నాను. వయసు పెరిగే కొద్దీ సహజంగా మానసిక పరిణతి కూడా వస్తుంది కాబట్టి, ఇప్పుడు నేను తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను. అంతకు ముందు ప్రతిదానికీ ‘డాడీ’ అంటూ మా నాన్న చుట్టూ తిరిగేదాన్ని. ఇప్పుడు నా పనులన్నింటినీ నేనే చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు నాకు తెలివితేటలున్నాయి. డబ్బుంది. సమర్థవంతంగా బతికే తెలివితేటలున్నాయి. అన్నింటికీ మించి అమ్మా నాన్నలను జాగ్రత్తగా చూసుకునేంత పరిణతి వచ్చేసింది’’ అన్నారు. -
ఇలా అయితే... కష్టమే సుమీ!
గాసిప్ నటిగా మాత్రమే కాదు... మోడల్‌గా, దర్శక, నిర్మాతగా తన ప్రతిభ చాటుకుంది పూజాభట్. ‘డాడీ’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన పూజా... సడక్, ప్రేమ్ దివానే, బార్డర్... మొదలైన చిత్రాలతో చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ‘తమన్నా’ సినిమాకు జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. అయితే తెర వెనుక ఎన్ని పాత్రలు పోషించినా... తెర మీద కనిపించడానికే ఆమె ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ‘‘నేను నటించడానికి రెడీ’’ అని మళ్లీ పూజాభట్ ప్రకటించింది! నటించడం సరే, మరి ఆమె ఎలాంటి పాత్రల్లో కనిపించాలనుకుంటోంది? హీరోయిన్గా కష్టం! హీరో తల్లిగా నటించడానికి ఆమె ఒప్పుకోవడం కూడా కష్టం !!బాలీవుడ్ మాజీ హీరోయిన్ రీతూ శివపురి అయితే పదమూడు సంవత్సరాల తరువాత కూడా మళ్లీ తెరపై కనిపించడానికి రెడీ అయ్యింది. ‘‘తల్లిగా, అక్కగా, వదినగా... ఏ పాత్ర చేయడానికైనా నేను సిద్ధం’’ అని కూడా ప్రకటించింది.అయితే పూజాభట్ మాత్రం తాను ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటోందో... ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. దీంతో దర్శక, నిర్మాతలు కన్ఫ్యూజ్కు గురవుతున్నారట. ఒకరిద్దరు దర్శకులు తమ సినిమాలో నటించమని అడిగితే, పాత్ర నచ్చక చేయనని చెప్పిందట.‘‘మళ్లీ నటించడం సంగతేమిటోగానీ, ఆమెను ఒప్పించడానికి తలప్రాణం తోకకు వచ్చేలా ఉంది’’ అని గొణుక్కుంటున్నారట దర్శక, నిర్మాతలు. కొందరైతే- ‘‘ఇలా అయితే కష్టమే..’’ అని పూజా ముఖం మీదే చెప్పేస్తున్నారట. ఇంతకీ... ఎలాంటి పాత్రలు చేయడానికి పూజాభట్ ఇష్టపడుతుంది?! -
మా నాన్న బంగారం..
నేను నాన్న కూచిని అంటోంది బాలీవుడ్ నటి సోనమ్‌కపూర్. తామిద్దం క్లోజ్ ఫ్రెండ్స్‌లా ఉంటామంటోంది. తన తండ్రి అనిల్‌కపూర్‌తో అన్ని సంగతులు షేర్ చేసుకుంటానని చెబుతోంది. కెరీర్ విషయాలే కాదు లవ్ మ్యాటర్స్ కూడా దాపరికం లేకుండా నాన్నతో చెప్పేస్తానని తెలిపింది. ‘ నేను చెప్పిన సీక్రెట్స్ అన్నీ నాన్న మనసులోనే దాచుకుంటాడు. కనీసం అమ్మ దగ్గర కూడా ఓపెన్ చేయడు’ అని అంటున్న ఈ అమ్మడు.. అందుకే మా నాన్న బంగారం అని కితాబిచ్చింది.