ఇలా అయితే... కష్టమే సుమీ! | Gossip | Sakshi
Sakshi News home page

ఇలా అయితే... కష్టమే సుమీ!

Published Mon, Jul 6 2015 10:28 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 AM

ఇలా అయితే... కష్టమే సుమీ!

ఇలా అయితే... కష్టమే సుమీ!

 గాసిప్

నటిగా మాత్రమే కాదు... మోడల్‌గా, దర్శక, నిర్మాతగా తన ప్రతిభ చాటుకుంది పూజాభట్. ‘డాడీ’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన పూజా...  సడక్, ప్రేమ్ దివానే, బార్డర్... మొదలైన చిత్రాలతో చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ‘తమన్నా’ సినిమాకు జాతీయ అవార్డ్ కూడా అందుకుంది.

 అయితే తెర వెనుక ఎన్ని పాత్రలు పోషించినా... తెర మీద కనిపించడానికే ఆమె ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ‘‘నేను నటించడానికి రెడీ’’ అని మళ్లీ పూజాభట్ ప్రకటించింది! నటించడం సరే, మరి ఆమె ఎలాంటి పాత్రల్లో కనిపించాలనుకుంటోంది?
 
హీరోయిన్‌గా కష్టం!
 హీరో తల్లిగా నటించడానికి ఆమె ఒప్పుకోవడం కూడా కష్టం !!బాలీవుడ్ మాజీ హీరోయిన్ రీతూ శివపురి అయితే పదమూడు సంవత్సరాల తరువాత కూడా మళ్లీ తెరపై కనిపించడానికి రెడీ అయ్యింది. ‘‘తల్లిగా, అక్కగా, వదినగా... ఏ పాత్ర చేయడానికైనా నేను సిద్ధం’’ అని కూడా ప్రకటించింది.అయితే పూజాభట్  మాత్రం తాను ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటోందో... ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. దీంతో దర్శక, నిర్మాతలు కన్‌ఫ్యూజ్‌కు గురవుతున్నారట. ఒకరిద్దరు దర్శకులు తమ సినిమాలో నటించమని అడిగితే, పాత్ర నచ్చక చేయనని చెప్పిందట.‘‘మళ్లీ నటించడం సంగతేమిటోగానీ, ఆమెను ఒప్పించడానికి తలప్రాణం తోకకు వచ్చేలా ఉంది’’ అని గొణుక్కుంటున్నారట దర్శక, నిర్మాతలు.
 
కొందరైతే-

 ‘‘ఇలా అయితే కష్టమే..’’ అని పూజా ముఖం మీదే చెప్పేస్తున్నారట.
 ఇంతకీ... ఎలాంటి పాత్రలు చేయడానికి పూజాభట్ ఇష్టపడుతుంది?!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement