జబర్దస్త్ నటి రీతూ చౌదరి మరోసారి తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. ఇటీవల తండ్రి మరణాన్ని తలుచుకుంటూ వరుస పోస్టులు పెట్టింది రీతూ. నువ్వు లేని ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నానంటూ సోషల్ మీడియాలో భావోద్యేగ పోస్టులు చేసింది రీతూ చౌదరి. ఇటీవలే ఆమె తండ్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తన తండ్రితో దిగిన చివరి ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. తాజాగా మరోసారి ఎమోషనల్ పోస్ట్ చేసింది. రీతూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ ఆడియోను పంచుకుంది. ప్రస్తుతం ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
అందులో ఏముందంటే..
' జీవితం చాలా చిన్నది. ఎప్పుడు ఏలా మలుపు తిరుగుతుందో నీ కథతో అర్థమైంది. అలాంటిది ఈ ఉన్న కొన్ని రోజులు మనసుకు నచ్చనట్లు బతకడమే. నీ నుంచి నేర్చుకున్నా. చివరకు మిగిలేది ఏంటి? మనం పంచిన ప్రేమ. మనం చేసుకున్న జ్ఞాపకాలు. నువ్వు ఎప్పుడు ఇదే చెప్పేవాడివి డాడీ. నీ జ్ఞాపకాలతో బతికేస్తా.'అంటూ సమంత ఫోటో ఉన్న ఆడియో క్లిప్‌ను తన స్టోరీస్‌లో పోస్ట్ చేసింది రీతూ చౌదరి.
Comments
Please login to add a commentAdd a comment