డాడీ నా వల్ల కావడం లేదు.. ప్లీజ్‌ తిరిగి రా: రీతూ చౌదరి ఆవేదన | Actress Rithu Chowdary Pens Emotional Note on Her Father Sudden Demise | Sakshi
Sakshi News home page

Ritu Chowdary: డాడీ నా వల్ల కావడం లేదు.. ప్లీజ్‌ తిరిగి రా: రీతూ భావోద్వేగ పోస్ట్‌

Jan 26 2023 8:02 PM | Updated on Jan 26 2023 8:16 PM

Actress Rithu Chowdary Pens Emotional Note on Her Father Sudden Demise - Sakshi

కామెడీ షో జబర్దస్త్‌ నటి రీతూ చౌదరి ఇంట ఇటీవల తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. తన తండ్రి చనిపోయిన విషయాన్ని తెలుపుతూ రీతూ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది. తన తండ్రితో దిగిన చివరి ఫొటో ఇదేనంటూ భావోద్వేగానికి గురయ్యింది. తాజాగా తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రీతూ మరోసారి సోషల్‌ మీడియా వేదికగా కన్నీటి పర్యంతమైంది. 

చదవండి: ఈ ఒక్క వారమే ఓటీటీలోకి 20 చిత్రాలు.. అవేంటంటే!

‘డాడీ నా వల్ల కావడం లేదు. ఎంత ట్రై చేసినా నువ్వు లేకుండా ఉండలేకపోతున్నా, నువ్వు లేవన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. నీ అంత ప్రేమ ఎవరూ నాకు చూపించలేరు. నీలా ఎవరూ నన్ను బుజ్జగించలేరు. నేను అలిగితే బ్రతిమలాడేది నువ్వు. నాకు కోపం వచ్చినప్పుడు చిరాకు పడినా, మళ్లీ ప్రేమతో నవ్వుతావ్. ఎవరైనా నన్ను ఒక్కమాట అంటే ఫీల్ అయి తిట్టేసేవాడివి. అలాంటిది ఎలా డాడీ నన్ను వదిలి వెళ్లిపోవాలని అనిపించింది. చెప్పు డాడీ ఇప్పుడు నాకు అన్నం తినిపించేది ఎవరు. నన్ను మోటివేట్ చేసేది, యాక్టివ్‌గా ఉంచేది ఎవరు చెప్పు డాడీ’ అంటూ హార్ట్‌ బ్రేక్‌ ఎమోజీని జత చేసింది. 

చదవండి: అక్కినేని వివాదం: మరోసారి బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

అలాగే చివరగా ‘ప్లీజ్ డాడీ.. తిరిగి రా మనం రీల్స్ చేసుకుందాం. నువ్వు చెప్పినట్లు అన్ని జ్యూస్‌లు తాగుతాను. మంచి ఫుడ్ తింటా. త్వరగా నిద్రపోతా. నువ్వు చెప్పినట్టే ఉండాను. ప్లీజ్ రా డాడీ, నీ కూతురు పులి అన్నావు కదా డాడీ, నీ పులిని వదిలేసి వెళ్లిపోతావా? అమ్మ, అన్నయ్య ఉండలేకపోతున్నారు డాడీ, ప్లీజ్ రా డాడీ’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ పలువురి కదిలిస్తోంది. ఆమె ఆవేదన చూసి ‘ధైర్యంగా ఉండు’ అంటూ ఆమె పోస్ట్‌పై నెటిజన్లు, బుల్లితెర నటీనటులు కామెంట్స్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement