Anchor Anasuya Bharadwaj Open Up On Why She Left Jabardasth Comedy Show - Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: 'ఆ ఊబిలో చిక్కుకోవాలనుకోవట్లేదు.. చాలా స్ట్రగుల్‌ పడ్డాను'

Published Sun, Aug 14 2022 12:50 PM | Last Updated on Sun, Aug 14 2022 2:25 PM

Anchor Anasuya Bharadwaj Open Up On Why She Left Jabardasth Comedy Show - Sakshi

టాలీవుడ్‌ ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్​ గురించి పరిచయం అక్కర్లేదు. బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకుంది. యాంకరింగ్‌తో పాటు సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకుంది. అయితే కొన్నేళ్లుగా యాంకర్‌గా కొనసాగుతున్న అనసూయ ఇటీవలె ఓ కామెడీ షోకు గుడ్‌బై చెప్పేసిన సంగతి తెలిసిందే.

చదవండి: ఆస్కార్‌ బరిలో ఎన్టీఆర్‌.. లిస్ట్‌ బయటికొచ్చేసింది!

దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఆ షోకు యాంకర్‌గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ ఉన్నట్లుండి ఆ షో నుంచి ఎందుకు బయటకు వచ్చేసిందన్న దానిపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. తాజాగా తాను ఆ షోను ఎందుకు వీడాల్సి వచ్చిందన్న దానిపై తొలిసారిగా నోరు విప్పింది అనసూయ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'దాదాపు రెండేళ్ల నుంచే షో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నా. చాలా సందర్భాల్లో నాపై వేసే పంచులు నచ్చక సీరియస్‌గా రియాక్షన్స్‌ ఇచ్చాను. నాకు బాడీ షేమింగ్‌, వెకిలి చేష్టలు లాంటివి నాకు నచ్చవు. చాలాసార్లు పంచులు నచ్చక ముఖం మాడ్చుకున్నట్లు ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ అవి షోలో వేయరు.

క్రియేటివ్‌ ఫీల్డ్‌ అన్న తర్వాత ఇవన్నీ తప్పవు కానీ నేను మాత్రం ఆ ఊబిలో చిక్కుకోవాలని అనుకోవడం లేదు. ఈ విషయంలో నేను చాలా స్ట్రగుల్ పడ్డాను. మరో విషయం ఏంటంటే నాగబాబు, రోజాగారు వెళ్లిపోయారు కాబట్టే నేను కూడా వెళ్లిపోతున్నాను అనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. వాళ్లు వెళ్లిపోయారు కదా అని వెళ్లిపోవడానికి నేనెం గొర్రెల మంద టైప్‌ కాదు. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్‌ పెట్టాలనుకుంటున్నా' అంటూ చెప్పుకొచ్చింది. కామెడీ షో నుంచి బయటకు వచ్చిన అనంతరం అనసూయ చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. చదవండి: కావాలనే టార్గెట్‌ చేశారు.. అందుకే ఓపెనింగ్స్‌ తగ్గాయి: కరీనా కపూర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement