చిరంజీవి, వెంకటేశ్ (పాత చిత్రం)
సినిమా కథలను ఎంచుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తాడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టుగా, ఫ్యాన్స్ అంచనాలను దృష్టిలో పెట్టుకొని సినిమాలను ఎంచుకుంటాడు. తన దగ్గరకు మంచి కథలు..తనకు కాకుండా వేరే వాళ్లకు బాగా సెట్ అవుతుందని భావిస్తే.. ఆ హీరో అయితేనే ఈ కథను న్యాయం చేస్తాడని సలహా ఇస్తుంటాడు. అలాంటి చిత్రాల్లో ‘డాడీ’ చిత్రం కూడా ఒకటి.
2001లో వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఈ కథ వినగానే, అది తనకంటే.. వెంకటేశ్‌కే బాగా సెట్ అవుతుందని చెప్పాడట. కానీ రచయిత భూపతి రాజాతో పాటు మరికొంతమంది తనను బలవంతంగా ఒప్పించడంతో ఆ సినిమాలో నటించానని చిరంజీవి అన్నారు. ఆచార్య సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించాడు.
‘డాడీ కథ నాకు వినిపించగానే... నా కంటే వెంకటేశ్‌కు అయితే బాగుటుందనిపించింది. రచయిత భూపతి రాజాకు ఇదే విషయాన్ని చెప్పాను. కానీ ఆయన నేను చేస్తే ఫ్యామిలీ మెన్‌గా కాస్త వెరైటీ ఉంటుందని నన్ను కన్విన్స్ చేశారు. ఈ కథ విన్న వారంతా.. చిన్న పిల్లలతో మీరు చేస్తేనే బాగుంటుందని చెప్పారు. దీంతో బలవంతంగా ఈ సినిమా ఒప్పకున్నా. రిజల్ట్ కూడా అలానే వచ్చింది. కథ విన్నప్పుడు ఏం అనుకున్నానో.. అదే జరిగింది. సినిమా విడుదలైన తర్వాత వెంకటేశ్ నాకు ఫోన్ చేసి ‘భలే సినిమా అండీ.. నా మీద అయితే ఇంకా బాగా ఆడేదండీ’అన్నాడు. ‘నేను అదే చెప్పాను వెంకటేశ్.. కానీ వినలేదు’ అని నేను అన్నాను. ఇలాంటి కొన్ని ఫెయిల్యూర్స్ నా సినీ జీవితంలో ఉన్నాయి’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment