భారత క్రికెట్ వీరుడు మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ లో బిజిబిజీగా ఉన్నా.. ఆయన భార్య సాక్షి సింగ్ మాత్రం.. తమ ముద్దుల కూతురు, చిట్టి పొట్టి అందాల చిన్నారి జివాతో పూర్తి సమయాన్ని గడుపుతూ మాతృత్వాన్ని ఆస్వాదిస్తుందన్న విషయం తెలిసిందే. . అదే నేపథ్యంలో అభిమానులకోసం సాక్షీ... జివా ఫోటోలను ఎన్నోసార్లు షేర్ చేశారు. ఇప్పుడు తాజాగా థోనీ... తన ముద్దుల కూతురు జివాతో ఆటపాటల్లో మునిగిపోయిన అద్భుత క్షణాల వీడియోను సాక్షీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జివా మాటల మూటలతో కూడిన వీడియో ఇప్పుడు అందర్నీ కట్టి పడేస్తోంది.
Published Wed, Jul 27 2016 6:43 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM