
బంగారం అక్రమరవాణా కేసులో అరెస్ట్ అయిన నటి రన్యా రావు స్నేహితుడు తరుణ్‌రాజ్‌కు 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విధిస్తూ బెంగళూరు ఆర్థిక నేరాల విభాగం కోర్టు ఆదేశించింది. తరుణ్‌రాజ్‌ను కస్టడీ గడువు ముగియడంతో డీఆర్‌ఐ అధికారులు అతన్ని కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించింది. ఆమె ఆప్తుడు, పారిశ్రామికవేత్త తరుణ్ రాజ్‌ను రిమాండ్‌కు తరలించడంతో ఆమెలో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది.
బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావు(34) వ్యవహారంపై మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ముమ్మరం చేసింది. బెంగళూరుతో పాటు ఆమెకు సంబంధించిన పలు చోట్ల దాడులు చేపట్టింది. ఈ రాకెట్‌లో భారీ కుట్ర దాగి ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈడీ అధికారులు కూడా ఆ దిశగానే దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో సీబీఐ కూడా ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. సౌదీ అరేబియాతో పాటు అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలలో కూడా రన్యారావు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో అంతర్జాతీయ రాకెట్ హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment