Know What Jai Chiranjeeva Movie Child Actress Shriya Sharma Doing Now - Sakshi
Sakshi News home page

Shriya Sharma: 'జై చిరంజీవ'లో నటించిన పాప గుర్తుందా? ఇప్పుడేం చేస్తుందంటే?

Published Sat, Jan 28 2023 3:22 PM | Last Updated on Sun, Jan 29 2023 8:37 AM

Know What Jai Chiranjeeva Movie Child Actress Shriya Sharma Doing Now - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో జై చిరంజీవ ఒకటి. ఈ సినిమాలో భూమిక, సమీరారెడ్డి కీలక పాత్రల్లో నటించారు. మెగాస్టార్‌ మేనకోడలిగా శ్రియా శర్మ నటించింది. తన చిన్ని చిన్ని మాటలతో, చిలిపి చేష్టలతో అలరించిన ఈమె చిరును మావయ్యా.. అంటూ ప్రేమగా పిలిచేది. ఈ మూవీలో చలాకీ నట ఇంచి అందరి మనసులు దోచిన ఈ పాప వయసు ఇప్పుడు 25 ఏళ్లు. మరి ఇప్పుడా బ్యూటీ ఎలా ఉంది? ఇప్పటిదాకా ఏయే సినిమాలు చేసింది? ఇప్పుడేం చేస్తుందో చూద్దాం..

'జై చిరంజీవ' చిత్రంతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైంది శ్రియా శర్మ. మరుసటి ఏడాదే 'నువ్వు నేను ప్రేమ'(సిల్లును ఒరు కాదల్‌) మూవీలో యాక్ట్‌ చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో బాల నటిగా రాణించింది. 'చిల్లర్‌ పార్టీ' సినిమాకు గానూ బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డు అందుకుంది. మహేశ్‌బాబు- శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వచ్చిన దూకుడు మూవీలో సమంత చెల్లెలిగా నటించి ఆకట్టుకుంది. రచ్చ, తూనీగ తూనీగ, ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాల్లో టీనేజ్‌ గర్ల్‌గా కనిపించింది. అయితే హీరోయిన్‌గా తన మొదటి చిత్రం గాయకుడు. బిగ్‌బాస్‌ ఫేం అలీ రెజా ఇందులో హీరోగా నటించాడు. ఇది అంతగా విజయం సాధించలేదు. 

ఆ తర్వాత శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటించిన నిర్మల కాన్వెంట్‌లో హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది కానీ అవకాశాలు మాత్రం రానట్లే కనిపిస్తోంది. 2016లో నిర్మలా కాన్వెంట్‌ రిలీజవగా ఆ తర్వాత మరే సినిమాలో కనిపించలేదు శ్రియా శర్మ. ఓపక్క సినిమాలు చేసుకుంటూనే మరోపక్క కొన్ని సీరియల్స్‌లోనూ తళుక్కుమని మెరిసింది శ్రియా. ఇవే కాకుండా అనేక వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. న్యాయవిద్యను అభ్యసించిన శ్రియా శర్మ ప్రస్తుతం అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

చదవండి: అభిమాని ఫోన్‌ విసిరేసిన హీరో, బాలయ్యలా ఉన్నాడే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement