Shriya sharma
-
నాడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడో ప్రముఖ లాయర్
'జై చిరంజీవ' చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైన శ్రియా శర్మ గుర్తుందా..? ఆ సినిమాతో ఆమెకు భారీగా అవకాశాలు వచ్చాయి. ఒకే ఒక్క చిత్రంతో ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది. దీనికి ప్రధాన కారణం జై చిరంజీవా చిత్రంలో ఆమె మెగాస్టార్‌కు మేనకోడలిగా నటించడమే అని చెప్పవచ్చు. మరుసటి ఏడాదే 'నువ్వు నేను ప్రేమ'(సిల్లును ఒరు కాదల్) మూవీలో యాక్ట్ చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో బాల నటిగా రాణించింది. 'చిల్లర్ పార్టీ' సినిమాకు గానూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డు అందుకుంది. మహేశ్‌బాబు- శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన దూకుడు మూవీలో సమంత చెల్లెలిగా నటించి ఆకట్టుకుంది. రచ్చ, తూనీగ తూనీగ, ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాల్లో టీనేజ్ గర్ల్‌గా కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో భూమిక, సమీరారెడ్డి కీలక పాత్రల్లో నటించారు. మెగాస్టార్ మేనకోడలిగా శ్రియా శర్మ నటించింది. తన చిన్ని చిన్ని మాటలతో, చిలిపి చేష్టలతో అలరించిన ఈమె చిరును మావయ్యా.. అంటూ ప్రేమగా పిలిచేది. ఈ మూవీలో చలాకీ నటనతో అందరి మనసులు దోచిన ఈ పాప వయసు ఇప్పుడు 26 ఏళ్లు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలైన తన ప్రయాణం హీరోయిన్గా తన మొదటి చిత్రం గాయకుడుతో ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ ఫేం అలీ రెజా ఇందులో హీరోగా నటించాడు. ఇది అంతగా విజయం సాధించలేదు. ఆ తర్వాత శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన నిర్మల కాన్వెంట్లో హీరోయిన్గా చేసింది. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది కానీ అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. 2016లో నిర్మలా కాన్వెంట్ రిలీజవగా ఆ తర్వాత మరే సినిమాలో కనిపించలేదు శ్రియా శర్మ. కానీ పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. న్యాయవిద్యను అభ్యసించిన శ్రియా శర్మ ప్రస్తుతం పెద్దపెద్ద కార్పోరేట్ కంపెనీలకు అడ్వకేట్‌గా కొనసాగుతుంది. View this post on Instagram A post shared by Shriya Sharma (@shriyasharma9) -
'జై చిరంజీవ' చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో జై చిరంజీవ ఒకటి. ఈ సినిమాలో భూమిక, సమీరారెడ్డి కీలక పాత్రల్లో నటించారు. మెగాస్టార్ మేనకోడలిగా శ్రియా శర్మ నటించింది. తన చిన్ని చిన్ని మాటలతో, చిలిపి చేష్టలతో అలరించిన ఈమె చిరును మావయ్యా.. అంటూ ప్రేమగా పిలిచేది. ఈ మూవీలో చలాకీ నట ఇంచి అందరి మనసులు దోచిన ఈ పాప వయసు ఇప్పుడు 25 ఏళ్లు. మరి ఇప్పుడా బ్యూటీ ఎలా ఉంది? ఇప్పటిదాకా ఏయే సినిమాలు చేసింది? ఇప్పుడేం చేస్తుందో చూద్దాం.. 'జై చిరంజీవ' చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైంది శ్రియా శర్మ. మరుసటి ఏడాదే 'నువ్వు నేను ప్రేమ'(సిల్లును ఒరు కాదల్) మూవీలో యాక్ట్ చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో బాల నటిగా రాణించింది. 'చిల్లర్ పార్టీ' సినిమాకు గానూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డు అందుకుంది. మహేశ్‌బాబు- శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన దూకుడు మూవీలో సమంత చెల్లెలిగా నటించి ఆకట్టుకుంది. రచ్చ, తూనీగ తూనీగ, ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాల్లో టీనేజ్ గర్ల్‌గా కనిపించింది. అయితే హీరోయిన్గా తన మొదటి చిత్రం గాయకుడు. బిగ్‌బాస్ ఫేం అలీ రెజా ఇందులో హీరోగా నటించాడు. ఇది అంతగా విజయం సాధించలేదు. ఆ తర్వాత శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన నిర్మల కాన్వెంట్లో హీరోయిన్గా చేసింది. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది కానీ అవకాశాలు మాత్రం రానట్లే కనిపిస్తోంది. 2016లో నిర్మలా కాన్వెంట్ రిలీజవగా ఆ తర్వాత మరే సినిమాలో కనిపించలేదు శ్రియా శర్మ. ఓపక్క సినిమాలు చేసుకుంటూనే మరోపక్క కొన్ని సీరియల్స్‌లోనూ తళుక్కుమని మెరిసింది శ్రియా. ఇవే కాకుండా అనేక వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. న్యాయవిద్యను అభ్యసించిన శ్రియా శర్మ ప్రస్తుతం అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Shriya Sharma (@shriyasharma9) చదవండి: అభిమాని ఫోన్ విసిరేసిన హీరో, బాలయ్యలా ఉన్నాడే! -
తమిళ 'అర్జున్ రెడ్డి'కి జోడి ఎవరు..!
తెలుగులో సంచలన విజయం సాదించిన అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాను బాల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నట్టుగా ఇటీవలే విక్రమ్ ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటులు ఎంపిక జరుగుతోంది. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. లోకనాయకుడు కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర్ హాసన్ తో పాటు బాలనటిగా సత్తా చాటి ఇటీవల నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోయిన్ గా మారిన శ్రియ శర్మల్లో ఒకరిని హీరోయిన్ గా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం జ్యోతిక, జీవి ప్రకాష్ కాంబినేషన్ లో రూపొందుతున్న నాచియార్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న బాలా, ఆ సినిమా రిలీజ్ తరువాత డిసెంబర్ నుంచి అర్జున్ రెడ్డి రీమేక్ పై దృష్టి పెట్టనున్నాడు. ఈ లోగా హీరోయిన్ ను ఫైనల్ చేసే అవకాశం ఉంది. -
లవ్ ఇన్ హైదరాబాద్
శ్రీయాశర్మ. సినిమా లవర్స్‌కే కాదు... బుల్లి తెర ప్రేక్షకులకూ చిర పరిచితమైన పేరు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎప్పుడో తెలుగు తెరకు పరిచయమైనా... గుర్తింపు వచ్చింది దూకుడులో సుశాంతిగానే. ఇప్పుడు ‘గాయకుడు’తో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన శ్రీయాశర్మను సిటీప్లస్ పలకరించింది. ఆ బ్యూటిఫుల్ టీన్ పరిచయం ఆమె మాటల్లోనే... - శిరీష చల్లపల్లి మాది హిమాచల్ ప్రదేశ్‌లోని పాలంపూర్. నాన్న వికాస్ శర్మ ఇంజనీర్. అమ్మ రీతూ శర్మ డైటీషియన్. తమ్ముడు యజత్ శర్మ. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చేస్తున్నా. ఎప్పడూ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నా... స్టడీస్‌ను నెగ్లెక్ట్ చేయలేదు. మార్కులెప్పుడూ నైన్టీ పర్సెంట్‌కు తగ్గలేదు. నేను ఇండస్ట్రీలోకి రావడం వెనుక నా పేరెంట్స్ ప్రోత్సాహం ఉంది. మా అంకుల్ మేజర్ విశాల్ శర్మ నా మోటివేటర్. ఇక నాకు నచ్చే ప్రాంతం అంటే మా అమ్మమ్మ వాళ్ల ఊరు సులాహ్. అక్కడి తేయాకు తోటలు.. మంచుతో కప్పి ఉండే ఎత్తై కొండలు.. ఐ లవ్ ఇట్. నాన్నమ్మ పెట్టే పచ్చళ్లని ఇష్టంగా తింటాను. అలా మొదలైంది... మూడేళ్ల వయసులో మొదటిసారిగా జీటీవీలో ‘కన్నయ్య’ సీరియల్లో నటించా. అందరి ఆదరాభిమానాలు తెచ్చిపెట్టింది మాత్రం ‘కసౌటీ జిందగీ కీ’ సీరియల్. ‘బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్’, ‘ఇండియన్ టెలీ అవార్డు’తోపాటు ‘స్టార్ పరివార్ అవార్డు’ కూడా వచ్చింది. ఇక తెలుగులో నా మొదటి సినిమా జై చిరంజీవ. చిరంజీవిగారితో నటించడం మరిచిపోలేని అనుభూతి. మళ్లీ ఆరేళ్ల తరువాత 2011లో దూకుడు, ఆ తరువాత ‘రచ్చ’, ‘తూనీగ తూనీగ’, ఇప్పుడు ‘గాయకుడు’... అలా బాలనటిగా మొదలైన జర్నీ ఇలా కంటిన్యూ అవుతోంది. ‘గాయకుడు’నీ ఆదరించండి.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హైదరాబాద్ స్పెషల్. ఈ ఇండస్ట్రీకి నేను చైల్డ్ ఆర్టిస్ట్‌గానే పరిచయం. ఇప్పుడు హీరోయిన్గా చేస్తున్నా. ఇక్కడ అందరూ ఆప్యాయంగా ట్రీట్ చేస్తారు. ఆ పలకరింపు నాకు ఇష్టం. హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీ నుంచే నా ప్రయాణం మొదలవుతోంది. కొత్త డెరైక్టర్, కొత్త హీరోలతో ‘గాయకుడు’ సినిమాతో మళ్లీ మీ ముందుకొస్తున్నా. ఇది హైదరాబాద్ బేస్డ్ లవ్‌స్టోరీ. గతంలోలాగే తెలుగు ప్రేక్షకులు నా ఈ సినిమానూ ఆదరిస్తారని, మీకు మరింత చేరువవుతానని ఆశిస్తున్నా!.