శ్రీయాశర్మ. సినిమా లవర్స్‌కే కాదు... బుల్లి తెర ప్రేక్షకులకూ చిర పరిచితమైన పేరు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎప్పుడో తెలుగు తెరకు పరిచయమైనా... గుర్తింపు వచ్చింది దూకుడులో సుశాంతిగానే. ఇప్పుడు ‘గాయకుడు’తో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన శ్రీయాశర్మను సిటీప్లస్ పలకరించింది. ఆ బ్యూటిఫుల్ టీన్ పరిచయం ఆమె మాటల్లోనే...
- శిరీష చల్లపల్లి
మాది హిమాచల్ ప్రదేశ్‌లోని పాలంపూర్. నాన్న వికాస్ శర్మ ఇంజనీర్. అమ్మ రీతూ శర్మ డైటీషియన్. తమ్ముడు యజత్ శర్మ. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చేస్తున్నా. ఎప్పడూ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నా... స్టడీస్‌ను నెగ్లెక్ట్ చేయలేదు. మార్కులెప్పుడూ నైన్టీ పర్సెంట్‌కు తగ్గలేదు. నేను ఇండస్ట్రీలోకి రావడం వెనుక నా పేరెంట్స్ ప్రోత్సాహం ఉంది. మా అంకుల్ మేజర్ విశాల్ శర్మ నా మోటివేటర్. ఇక నాకు నచ్చే ప్రాంతం అంటే మా అమ్మమ్మ వాళ్ల ఊరు సులాహ్. అక్కడి తేయాకు తోటలు.. మంచుతో కప్పి ఉండే ఎత్తై కొండలు.. ఐ లవ్ ఇట్. నాన్నమ్మ పెట్టే పచ్చళ్లని ఇష్టంగా తింటాను.
అలా మొదలైంది...
మూడేళ్ల వయసులో మొదటిసారిగా జీటీవీలో ‘కన్నయ్య’ సీరియల్‌లో నటించా. అందరి ఆదరాభిమానాలు తెచ్చిపెట్టింది మాత్రం ‘కసౌటీ జిందగీ కీ’ సీరియల్. ‘బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్’, ‘ఇండియన్ టెలీ అవార్డు’తోపాటు ‘స్టార్ పరివార్ అవార్డు’ కూడా వచ్చింది. ఇక తెలుగులో నా మొదటి సినిమా జై చిరంజీవ. చిరంజీవిగారితో నటించడం మరిచిపోలేని అనుభూతి. మళ్లీ ఆరేళ్ల తరువాత 2011లో దూకుడు, ఆ తరువాత ‘రచ్చ’, ‘తూనీగ తూనీగ’, ఇప్పుడు ‘గాయకుడు’... అలా బాలనటిగా మొదలైన జర్నీ ఇలా కంటిన్యూ అవుతోంది.
‘గాయకుడు’నీ ఆదరించండి..
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హైదరాబాద్ స్పెషల్. ఈ ఇండస్ట్రీకి నేను చైల్డ్ ఆర్టిస్ట్‌గానే పరిచయం. ఇప్పుడు హీరోయిన్‌గా చేస్తున్నా. ఇక్కడ అందరూ ఆప్యాయంగా ట్రీట్ చేస్తారు. ఆ పలకరింపు నాకు ఇష్టం. హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీ నుంచే నా ప్రయాణం మొదలవుతోంది. కొత్త డెరైక్టర్, కొత్త హీరోలతో ‘గాయకుడు’ సినిమాతో మళ్లీ మీ ముందుకొస్తున్నా. ఇది హైదరాబాద్ బేస్డ్ లవ్‌స్టోరీ. గతంలోలాగే తెలుగు ప్రేక్షకులు నా ఈ సినిమానూ ఆదరిస్తారని, మీకు మరింత చేరువవుతానని ఆశిస్తున్నా!.
లవ్ ఇన్ హైదరాబాద్
Published Sun, Feb 22 2015 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM
Advertisement
Advertisement