బయట ఎండలు మండిపోతుంటే... గొంతులోకి చల్లగా ఐస్‌క్రీమ్ జారడం అద్భుతమైన అనుభూతి. పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు ఐస్‌క్రీమ్స్ ఇష్టపడని వారు ఉండరు. ఇలాంటి హిమక్రీమ్‌ల ప్రేమికుల కోసమే... రెస్టారెంట్స్, ఐస్‌క్రీమ్ పార్లర్స్, మాల్స్... డిఫరెంట్ ఐస్‌క్రీమ్స్‌ను మార్కెట్‌లోకి తెస్తున్నాయి. ఇక ఈ సమ్మర్ స్పెషల్‌గా అందరి నోరూరించనుంది సండీ. చాక్లెట్ ైబె ట్స్, కలర్‌ఫుల్ జెమ్స్, సీజనల్ ఫ్రూట్స్, డ్రై-ఫ్రూట్స్, చెర్రీస్, డేట్స్, వాల్‌నట్స్, సేమియా ఇలా అనేక రకాల కాంబినేషన్స్‌తో తయారు చేసి.. దానికి ఓరియో, వేపర్, చాక్లెట్ అండ్ కారమేల్ స్ప్రింకిల్స్, పైన్ ఆపిల్, ఆపిల్ క్రష్డ్ పీసెస్.. వంటి వాటితో డెకరేట్ చే స్తున్నారు. కోల్డ్ కాఫీ, ఐస్‌క్రీమ్ పంచ్, మాక్‌టైల్స్, కోక్‌ఫ్లోట్, ఫ్రూట్ సలాడ్ వంటి తినుబ ండారాల్లో సైతం కలుపుతున్నారు. నోరు తీపి చేసే గులాబ్‌జామూన్, హల్వా, ఖుర్బానీ-కా-మీటా, డబుల్-కా-మీటాల్లో సైతం ఈ సండీని కాంబినేషన్‌గా వాడుతున్నారు. ‘డిఫరెంట్ టైప్ ఆఫ్ డిషెస్ ఇష్టపడుతున్నట్టే... ఐస్‌క్రీమ్స్‌లోనూ వెరైటీలను కోరుకుంటున్నారు. అలాంటి ఐస్‌క్రీమ్ లవర్స్ వీటిని ఇష్టంగా టేస్ట్ చేస్తారు’ అని చెబుతున్నారు హాజెల్ ఐస్‌క్రీమ్ కెఫే మేనేజర్ రాకేష్ కుమార్.
- శిరీష చల్లపల్లి
చిన్నారుల కోసం..
రొటీన్ సమ్మర్ క్యాంపులకు భిన్నంగా తాహెర్ అలీ బేగ్ థియేటర్ గ్రూప్ పిల్లల కోసం ప్రత్యేక వర్క్‌షాపు నిర్వహిస్తోంది. ‘స్కెచ్చింగ్, క్రియేటివ్‌గా ఆలోచించడం’ అనే అంశాలపై నిర్వహించే శిక్షణకు మూడు నుంచి ఏడేళ్లలోపు చిన్నారులు అర్హులు. మే 2 నుంచి 23 వరకు వారాంతాల్లో తరగతులు ఉంటాయి.
వివరాలకు
taher@
flickrollers.com
ఠండీ సండీ
Published Mon, Apr 27 2015 11:23 PM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM
Advertisement