దానికి ఇంకా టైముంది | chit chat with anchor anusha seshu | Sakshi
Sakshi News home page

దానికి ఇంకా టైముంది

Published Thu, Mar 19 2015 3:45 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

దానికి ఇంకా టైముంది - Sakshi

దానికి ఇంకా టైముంది

డాక్టర్ కావాలనుకున్న అనూష శేషు యాంకర్‌లా మారింది. బుల్లితెరపై కనువిందు చేస్తూ తెలుగువారికి దగ్గరైంది. తమిళం, ఆంగ్లం తప్ప మరో భాష రాని ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో అదరగొడుతోంది. టీవీలో గలగలా మాట్లాడే అనూష తన కెరీర్ ముచ్చట్లను మీ అంటూ సిటీప్లస్‌తో పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.
- శిరీష చల్లపల్లి
 
మీ..  అనూష శేషు

చాలా మందిలాగే నేనూ.. డాక్టర్ అయిపోవాలి, పల్లెలకు వెళ్లి సేవ చేయాలనే ఆశయంతో ఉండేదాన్ని. అందుకే ఇంటర్‌లో సైన్స్ గ్రూప్ తీసుకున్నా.  డిసెక్షన్స్ సమయంలో కప్పలను, పాములను కోయడానికి చాలా బాధపడేదాన్ని. డాక్టర్ వృత్తి నాకు సెట్ కాదనిపించింది. వేరే ప్రొఫెషన్‌లో ట్రై చేద్దామనుకుని మా టీవీ ఆడిషన్స్‌లో పాల్గొన్నాను. అప్పుడు నేను ఎనభై కిలోలు, బుగ్గలతో బొద్దుగా ఉండేదాన్ని. తెలుగు అస్సలు రాదు.

దీంతో చాలా సార్లు రిజెక్టయ్యాను. తర్వాత కాస్త గట్టిగా డైట్ మెయింటైన్ చేసి, వర్కవుట్స్ చేయడంతో రెండు మూడు నెలల్లోనే చాలా బరువు తగ్గాను. ఇప్పటికీ అదే వెయిట్ కంటిన్యూ అవుతోంది. అంతేకాదు ఇంటికి దగ్గర్లోనే ఉన్న తెలుగు పండిత్ దగ్గర ట్యూషన్‌కు వెళ్లి మరీ భాష నేర్చుకున్నాను.
 
ఎంతో మెచ్చుకున్నారు..
మొదట నన్ను రిజెక్ట్ చేసినవారే మళ్లీ ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు నా డెడికేషన్ చూసి మెచ్చుకున్నారు. అలా మొదటిసారి మా టీవీ ‘మీ స్టార్’ ప్రోగ్రామ్‌తో బుల్లితెరకు పరిచయం అయ్యాను. స్టార్టింగ్‌లోనే బన్నీ, ప్రభాస్, అల్లరి నరేష్.. పెద్ద పెద్ద హీరోలు, డెరైక్టర్‌లను ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. మొదటి ఎపిసోడ్‌కి కాస్త తడబడినా.. ఎర్లీగా సెట్ అయిపోయాను. లైవ్‌షోస్, రియాలిటీ షోస్, గేమ్‌షోస్.. సెలబ్రిటీ టాక్, కామిక్‌టానిక్, జెమినీ కామెడీ షో ఇలా ప్రోగ్రామ్స్ చేస్తూ హ్యాపీగా ఉన్నాను. సీరియల్స్, సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ నాకు యాంకరింగ్ అంటేనే ఇష్టం. యాంకరింగ్‌ను ఫుల్‌టైమ్ ప్రొఫెషన్‌గా మలచుకోలేం అని నాకు తెలుసు. అందుకే మంచి ‘బ్యూటీ స్పా’ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. అఫ్కోర్స్ దానికి ఇంకా చాలా టైమ్ ఉంది.
 
ఇన్నోసెంట్...
నేను చెన్నైలో పుట్టి పెరిగాను. మాతృభాష తమిళం. పదో తరగతి వరకు చెన్నైలోనే చదివాను. అప్పుడు నాకు తమిళ్, ఇంగ్లిష్ తప్ప వేరే లాంగ్వేజ్ వచ్చేది కాదు. చిన్నప్పటినుంచి నేను ‘రొంబ నల్ల పొన్ను’ని. చాలా కామ్ కూడా. సెలైంట్ అండ్ ఇన్నోసెంట్ కిడ్‌ని. బాగా చదివేదాన్ని. కానీ ఎవరితో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. కాకపోతే స్కూల్లో జరిగే ప్రతి ఈవెంట్‌లో క్లాసికల్ డ్యాన్సులు, ఫ్యూజిన్ డ్యాన్సులు నావే. అందుకే ఇప్పటికీ నా దగ్గర ఒక రూమ్ నిండా షీల్డ్స్, అవార్డ్స్, సర్టిఫికెట్స్ ఉన్నాయి. షూట్స్ లేని టైమ్‌లో ఫ్రెండ్స్‌కే ప్రిఫరెన్స్ ఇస్తాను. మాదాపూర్ చాక్లెట్ రూమ్‌లో కూర్చుని ఫ్రెండ్స్‌తో చిట్ చాటింగ్ చాలా ఇష్టం. ఇక నా హాబీస్ విషయానికొస్తే.. నెయిల్ ఆర్ట్ బాగా వేస్తాను. మెహిందీ డిజైన్స్ వేయడం కూడా ఇష్టం. గూగుల్ తల్లి దయ వల్ల కుకింగ్ కూడా వంటబట్టింది.
 
ఇక్కడే సెటిల్..
నాకు లైఫ్ ఇచ్చిన హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. ఇక్కడే సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. షాపింగ్ కోసం ఇనార్బిట్ మాల్‌కి వెళ్తుంటాను. నెయిల్ పాలిష్ నుంచి.. ఎలక్ట్రానిక్ డివెజైస్ వరకు కొన్ని వందల షాప్స్ ఒకే రూఫ్ కింద ఉంటాయి. కొంపల్లిలోని ‘డోలా-రే-దని’లో టైమ్ స్పెండ్ చేస్తాను. ఒంటెలమీద స్వారీలు, పప్పెట్ షో, బెలూన్ షూట్, బుల్‌ఫైట్.. ఇలా అక్కడికి వెల్తే నిజంగానే రాజస్థాన్‌లో ఉన్నామా అన్నట్టు ఉంటుంది. ఐ లవ్ దట్ ప్లేస్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement