
భూమిక
రెండేళ్ల క్రితం నాని ‘ఎమ్‌సీఏ’ (మిడిల్‌క్లాస్ అబ్బాయి) చిత్రంతో ఫుల్‌లెంగ్త్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను స్టార్ట్ చేశారు భూమిక. గత ఏడాది తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం ‘యు–టర్న్’, ‘సవ్యసాచి’ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. ఇప్పుడు మళ్లీ తమిళంలో మరో సినిమా చేయడానికి అంగీకరించారు. ఉదయనిధి స్టాలిన్ హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నై నంబాదే’. (కంటిని నమ్మొదు అని అర్థం) మారన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఆత్మిక కథానాయికగా నటిస్తున్నారు. ఈ థ్రిల్లింగ్ మూవీలోనే ఓ కీలక పాత్ర చేయనున్నారు భూమిక. ‘‘సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంది. సినిమాకు భూమిక పాత్ర హైలైట్‌గా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా కాకుండా మరికొన్ని సినిమాలకు భూమిక కథలు వింటున్నారట.
Comments
Please login to add a commentAdd a comment