
కథానాయిక సమంత పోలీస్‌స్టేషన్‌కి వెళ్లారు. ఏదో కేసు విషయమై ఆమెపై ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారట పోలీసులు. వారి ప్రశ్నలకు సమంత ఎలాంటి సమాధానాలిచ్చారన్నది సిల్వర్‌స్క్రీన్‌పై చూడాల్సిందే. కన్నడ హిట్ మూవీ ‘యు–టర్న్’ సినిమాను అదే పేరుతో తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కన్నడ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ దర్శకత్వంలోనే ఈ రీమేక్ రూపొందుతోంది. సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. సిల్వర్‌స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.
జర్నలిస్ట్ పాత్రలో సమంత, పోలీస్ అధికారిగా ఆది పినిశెట్టి నటిస్తున్నారు. నటి భూమిక ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓ మీడియా హౌస్ ఆఫీస్‌లో ఇటీవల ఓ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసిన ఈ చిత్రబృందం ప్రస్తుతం పోలీస్‌స్టేషన్ సెట్‌లో సమంతపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘షూటింగ్ స్పీడ్‌గా జరుగుతోంది. త్వరలో సమంత ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత. ఈ సినిమాకు కెమెరా: నికేత్.
Comments
Please login to add a commentAdd a comment