Bhumika Chawla Negative Role In Nagarjunas Bangarraju Movie - Sakshi
Sakshi News home page

బంగార్రాజు సీక్వెల్‌లో భూమిక!

Published Mon, Mar 15 2021 8:26 AM | Last Updated on Mon, Mar 15 2021 9:22 AM

Bhumika Negative Role In Bangarraju Movie - Sakshi

నాగార్జున హీరోగా కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ (2016) చిత్రం సూపర్‌హిట్‌ సాధించింది. ఈ సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు క్యారెక్టర్‌ ఆడియన్స్‌ను బాగా మెప్పించింది. దీంతో నాగ్, కల్యాణ్‌ కలిసి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రను భూమిక చేయనున్నారట. ఈ పాత్రకు నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని సమాచారం. 

కాగా నాగార్జున హీరోగా, బాలీవుడ్‌ నటి దియా మీర్జా హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. ఈ చిత్రంతో అహిషోర్‌ సాల్మోన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సయామీ ఖేర్, అతుల్‌ కులకర్ణి, అలీ రెజా, రుద్ర ప్రదీప్‌ ఇతర పాత్రల్లో నటించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదలకానుంది.

చదవండి: తెలంగాణ పోరిలా నటించి మెప్పిస్తోందీ హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement