‘‘7 డేస్‌ 6 నైట్స్‌’ షూటింగ్‌ పూర్తి..ఎం.ఎస్‌ రాజు ఎమోషనల్‌ | MS Raju Wrapped Up 7 Days 6 Nights Shoot | Sakshi
Sakshi News home page

‘‘7 డేస్‌ 6 నైట్స్‌’ షూటింగ్‌ పూర్తి..ఎం.ఎస్‌ రాజు ఎమోషనల్‌

Published Sat, Aug 28 2021 8:34 AM | Last Updated on Sat, Aug 28 2021 8:35 AM

MS Raju Wrapped Up 7 Days 6 Nights Shoot - Sakshi

‘‘7 డేస్‌ 6 నైట్స్‌’ చిత్రంతో మా అబ్బాయి సుమంత్‌ అశ్విన్‌ని నిర్మాతగా పరిచయం చేయడం హ్యాపీగా ఉంది. ఆకట్టుకునే సీన్స్, అద్భుతమైన విజువల్స్‌తో హృదయాన్ని హత్తుకునేలా ఈ కథ ఉంటుంది. ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు నిర్మించిన మా సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌కి ఈ చిత్రంతో పూర్వ వైభవం వస్తుంది’’ అన్నారు ఎంఎస్‌ రాజు. సుమంత్‌ అశ్విన్, మెహర్‌ చావల్, రోహన్, క్రితికా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘7 డేస్‌ 6 నైట్స్‌’.

సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సమర్ప ణలో ఎంఎస్‌ రాజు దర్శకత్వంలో సుమంత్‌ అశ్విన్‌ .ఎం, రజనీకాంత్‌ .ఎస్‌ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ‘‘నిర్మాణం– దర్శకత్వం ఏదయినా నాన్నగారు ఎంతో పట్టుదలతో, ఇష్టంతో చేస్తారు’’ అన్నారు సుమంత్‌ అశ్విన్‌.  ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత, కో–డైరెక్టర్‌: యూవీ సుష్మ, సహనిర్మాతలు: జె. శ్రీనివాసరాజు, మంతెన రాము.

చదవండి : ఆ స్టార్‌ హీరో సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న రకుల్‌!
అఫీషియల్‌ ప్రోమో: అమెజాన్‌లో 'టక్‌ జగదీష్‌'


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement